సాక్షి, హైదరాబాద్ : తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రిలో.. కార్మికులకు వైద్య సేవలు నిలిపివేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను డిస్మిస్ చేస్తున్నట్టు ప్రకటించడంతో ఆస్పత్రి యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఆస్పత్రిలో వైద్య సేవలు నిలిపివేయడంపై కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ విషయంలో ప్రభుత్వ తీరును అఖిలపక్షం, ఆర్టీసీ జేఏసీ తీవ్రంగా ఖండించింది. ఆర్టీసీ జేఏసీ నాయకులు అశ్వత్థామరెడ్డి మట్లాడుతూ.. తార్నక ఆస్పత్రిలో ఆర్టీసీ కార్మికులకు చికిత్సలు నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ సమ్మెకు ఉద్యోగ సంఘాలు కూడా మద్దతు ఇవ్వాలని కోరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగ సంఘాలు ఎంతగానో పోరాటం చేశాయని.. ఆ స్ఫూర్తితలోనే తాము ఇప్పుడు ఆర్టీసీని కాపాడుకునేందుకు సమ్మె చేస్తున్నామని చెప్పారు. ఉద్యోగ సంఘాలను ఈ మాటలు నొప్పించి ఉంటే క్షమించాలని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment