పోలీసులతో జీవన్‌రెడ్డి, కోదండరాం, శ్రీధర్‌బాబు వాగ్వాదం
సాక్షి, కరీంనగర్: కరీంనగర్‌లో ఆర్టీసీ డ్రైవర్ నంగునూరి బాబు అంతిమయాత్ర రణరంగంగా మారింది. ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు బాబు అంతిమ యాత్రలో పాల్గొనేందుకు రాష్ట్ర వేలాది కార్మికులు కరీంనగర్ రూరల్ మండలం ఆరెపల్లి గ్రామానికి తరలివచ్చారు. ప్రభుత్వం చర్చలకు పిలిచే వరకు అంత్యక్రియలు చేసేది లేదని బాబు కుటుంబ సభ్యులతో సహా జేఏసీ నేతలు, విపక్షాల నేతలు ప్రతినబూనారు. మృతదేహాన్ని భద్రపరిచిన ఫ్రీజర్ చెడిపోవడాన్ని గమనించకపోవడంతో 3 రోజుల కిందట మృతి చెంది న బాబు మృతదేహం డీకంపోజింగ్ అవుతుందని గమనించిన నేతలు దహన సంస్కారాలు నిర్వ íహించేందుకు కుటుంబ సభ్యులను ఒప్పించారు. కుటుంబ సభ్యుల కోరిక మేరకు మృతదేహాన్ని ఆయన పనిచేస్తున్న కరీంనగర్ –2 డిపో కు తరలించి, తిరిగి శ్మశానవాటికకు తీసుకురావాలని నిర్ణయించారు. ఈ మేరకు చేపట్టిన అంతిమ యాత్రను పోలీసులు ఆదిలోనే అడ్డుకున్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ సూచనల మేరకు పోలీసులు బాబు మృతదేహాన్ని శ్మశానవాటికకు మళ్లించి, నాయకులను మరోవైపు పంపించారు.
పోలీసుల దారి మళ్లింపుతో ఉద్రిక్తత
నాయకులను అడ్డుకుని మృతదేహాన్ని కుటుంబ సభ్యులతో కలసి శ్మశానానికి తరలించడంతో జేఏసీ నాయకులు, బీజేపీ, కాంగ్రెస్, ఇతర ప్రజా సంఘాల నాయకులకు మధ్య తోపులాట తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. దీంతో ఆర్టీసీ కార్మికులు, ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు పోలీసులకు ఎదురునిలిచారు. ఈ క్రమంలో పోలీసులకు, పార్టీల నాయకులు, కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసు వాహనానికి అడ్డు తిరిగి కట్టెలు వేసి మంటలు పెట్టారు. ఈ క్రమంలోనే బాబు మృతదేహాన్ని మరికొంత మంది పోలీ సులు శ్మశానవాటిక వరకు తరలించి అంత్యక్రియ లు నిర్వహించారు. బండి సంజయ్ నేతృత్వంలో మంద కృష్ణమాదిగ, మాజీ ఎంపీ వివేక్, బీజేపీ, టీడీపీ, ఆర్టీసీ జేఏసీ, టీజేఎస్, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ, వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ ఇంటిపార్టీ్ట, ఆదివాసీ తుడుం దెబ్బ, ఏబీవీపీ నేతలు కోర్టు చౌరస్తాకు చేరుకుని బైఠాయించారు. తోపులాటలో సమయంలో ఏసీపీ వీరేంద్రసింగ్ ఎంపీ బండి సంజయ్ కాలర్‌ను పట్టుకుని చేయిచేసుకోబోయాడని, దానికి సంబంధించిన ఫొటోలను ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, కార్మికులు హక్కుల కోసం గొంతెత్తితే ఉక్కుపాదంతో ప్రభుత్వం అణచివేస్తోందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ ఆరోపించారు.
ఎంపీ సంజయ్ కాలర్ పట్టుకున్న ఏసీపీ
బాబుకు కన్నీటి వీడ్కోలు
బాబు అంత్యక్రియల ప్రక్రియ ఓవైపు జరుగుతుండగా.. ఎస్సాఆర్‌ఆర్ కళాశాల చౌరస్తాలో కాంగ్రెస్ నేతలు రాస్తారోకో చేసి రోడ్డుపై వంటావార్పు చేపట్టారు. డ్రైవర్ నంగునూరి బాబు అంత్య క్రియలకు డ్రైవర్లు, కండక్టర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి బాబన్నకు అంతిమ వీడ్కోలు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment