rtc driver died
-
దేవరకొండలో ఉద్రిక్తత
కొండమల్లేపల్లి (దేవరకొండ) : గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతిచెందడంతో సోమవారం దేవరకొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా యి. డ్రైవర్ మృతదేహంతో ఆర్టీసీ కార్మికులు డి పో ఎదుట ఆందోళన చేపట్టి మృతుడి కుటుం బానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వీరికి అఖిలపక్ష పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ క్రమంలో పట్టణంలోని దుకా ణాలను మూసి వేయించారు. ధర్నాలో పాల్గొంటూనే.. నాంపల్లి మండలం పగిడిపల్లి గ్రామానికి చెంది న తుమ్మలపల్లి జైపాల్‌రెడ్డి (టి.జె.రెడ్డి) (57) దేవరకొండ డిపోలో ఆర్టీసీ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. జైపాల్‌రెడ్డి తన కుటుంబ ంతో హైదరాబాద్‌లోని ఓంకార్‌నగర్‌లో నివాసముంటూ విధులకు హాజరవుతున్నాడు. అయితే తమ డిమాండ్లను నెరవేర్చాలని నెలరోజులుగా చేస్తున్న సమ్మెలో పాల్గొంటున్నాడు. ఆదివారం ఆర్టీసీ కార్మికులు డిపో ఎదుట నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నాడు. రాత్రి జైపాల్‌రెడ్డి తమ స్వగ్రామమైన నాంపల్లి మండలం పగిడిపల్లి గ్రామానికి వెళ్లాడు. తెల్లవారు జామున అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో బంధువులు తొలుత దేవరకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించా రు.పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడినుంచి హైదరాబాదుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృ తిచెందాడు. మృతుడికి భార్య,కుమారుడు ఉన్నారు. డిపో ఎదుట ఆందోళన జైపాల్‌రెడ్డి మృతి విషయాన్ని తెలుసుకున్న ఆర్టీసీ జేఏసీ నాయకులు, కార్మికులు, మృతుడి కుటుంబ సభ్యులు దేవరకొండకు చేరుకున్నారు. మృతదేహాన్ని దేవరకొండ డిపో ఎదుట ఉంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై నిరంకుశంగా వ్యవహరిస్తుండడంతో జైపాల్‌రెడ్డి మనస్తాపానికి గురై హఠాన్మరణం చెందాడని ఆరోపించారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఇకనైనా ప్రభుత్వం కార్మికులతో చర్చలు జరిపి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో రాత్రి దేవరకొండ డిపో ఎదుట కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి జైపాల్‌రెడ్డికి నివాళులర్పించారు. నివాళులర్పించిన అఖిలపక్ష నాయకులు డ్రైవర్ మృతివిషయం తెలుసుకున్న సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే నేనావత్ బాలూ నా యక్, సీపీఐ జిల్లా కార్యదర్శి పల్లా నర్సింహారె డ్డి, బీజేపీ నాయకులు బెజవాడ శేఖర్, సీపీఎం నాయకులు నల్లా వెంకటయ్య, వివిధ పార్టీలు , ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, జేఏసీ నాయకులు డిపో వద్దకు చేరుకున్నారు. జైపాల్‌రెడ్డి మృతదేహంపై పూలమాలలు ఉంచి నివా ళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో నియంత పాలన సాగుతోం దని ధ్వజమెత్తారు.తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకపాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం విస్మరిస్తోందని ఆరోపించారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మృతదేహం హైదరాబాద్‌కు తరలింపు మృతదేహాన్ని పోలీసులు, బంధువులు హైదరాబాద్‌కు తరలించేందుకు సిద్ధం కాగా అఖిలపక్ష పార్టీల నాయకులు, ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగి కొద్దిసేపు ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. జైపాల్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌లోని ఓంకార్ నగర్లో నివాసముంటున్నాడు. దీంతో అంత్యక్రియల నిమిత్తం మృతదేహాన్ని హైదరాబాద్ తరలించారు. డిపోకే పరిమితమైన బస్సులు తెల్లవారుజామునే జైపాల్‌రెడ్డి మృతదేహంతో ఆర్టీసీ కార్మికులు డిపో ఎదుట బైఠాయించారు. దీంతో బస్సులు డిపోకే పరిమితమయ్యాయి.పలువురు తాత్కాలిక విధులు నిర్వహిస్తున్న సిబ్బంది డిపో వద్దకు చేరుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. అఖిలపక్ష నాయకులు, ఆర్టీసి జేఏసీ నాయకులు దేవరకొండ పట్టణ బంద్‌కు పిలుపునివ్వడంతో విద్యాసంస్థలు, దుకాణాలను మూసివేయించారు. ఎలాం టి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా దేవరకొండ డీఎస్పీ ఆనంద్‌రెడ్డి ఆధ్వర్యంలో సబ్‌డివిజన్ పరిధితో పాటు జిల్లా నుంచి పోలీసులు భారీగా దేవరకొండ బస్ డిపో ఎదుట మోహరించారు. 11గంటల సమయంలో పోలీస్ ఎస్కార్ట్ మధ్య ప్రభుత్వ అంబులెన్స్‌లో జైపాల్‌రెడ్డి మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. -
గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి
కొండమల్లేపల్లి (దేవరకొండ): నల్లగొండ జిల్లా దేవరకొండ ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న తుమ్మలపల్లి జైపాల్‌రెడ్డి(57) సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందాడు. జైపాల్ కుటుంబంతో కలసి హైదరాబాద్‌లోని సాగర్‌రింగ్‌రోడ్డు సమీపంలోని ఓంకార్‌నగర్‌లో నివసిస్తున్నాడు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా ఆదివారం దేవరకొండ డిపో వద్ద జేఏసీ నిర్వహించిన ధర్నాలో జైపాల్ పాల్గొన్నాడు. తర్వాత తన స్వగ్రామమైన నాంపల్లి మండలం పగిడిపల్లికి వెళ్లాడు. అక్కడ గుండెపోటు రావడంతో ఆయనను దేవరకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఆర్టీసీ జేఏసీ నాయకులు, కార్మికులు, మృతుడి కుటుంబసభ్యులు, వివిధ పార్టీల నేతలు దేవరకొండలోని డిపో వద్దకు చేరుకున్నారు. మృతదేహాన్ని డిపో ఎదుట ఉంచి ఆందోళనకు దిగారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం స్పందించకపోవడంతో జైపాల్ మనస్తాపానికి గురై మృతి చెందాడన్నారు. కార్మికుల ఆందోళనకు అఖిలపక్ష నాయకులు మద్దతు తెలిపారు. కార్మికుల ఆందోళనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో.. పోలీసులు మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. -
కరీంనగర్లో రణరంగం
సాక్షి, కరీంనగర్: కరీంనగర్లో ఆర్టీసీ డ్రైవర్ నంగునూరి బాబు అంతిమయాత్ర రణరంగంగా మారింది. ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు బాబు అంతిమ యాత్రలో పాల్గొనేందుకు రాష్ట్ర వేలాది కార్మికులు కరీంనగర్ రూరల్ మండలం ఆరెపల్లి గ్రామానికి తరలివచ్చారు. ప్రభుత్వం చర్చలకు పిలిచే వరకు అంత్యక్రియలు చేసేది లేదని బాబు కుటుంబ సభ్యులతో సహా జేఏసీ నేతలు, విపక్షాల నేతలు ప్రతినబూనారు. మృతదేహాన్ని భద్రపరిచిన ఫ్రీజర్ చెడిపోవడాన్ని గమనించకపోవడంతో 3 రోజుల కిందట మృతి చెంది న బాబు మృతదేహం డీకంపోజింగ్ అవుతుందని గమనించిన నేతలు దహన సంస్కారాలు నిర్వ íహించేందుకు కుటుంబ సభ్యులను ఒప్పించారు. కుటుంబ సభ్యుల కోరిక మేరకు మృతదేహాన్ని ఆయన పనిచేస్తున్న కరీంనగర్ –2 డిపో కు తరలించి, తిరిగి శ్మశానవాటికకు తీసుకురావాలని నిర్ణయించారు. ఈ మేరకు చేపట్టిన అంతిమ యాత్రను పోలీసులు ఆదిలోనే అడ్డుకున్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ సూచనల మేరకు పోలీసులు బాబు మృతదేహాన్ని శ్మశానవాటికకు మళ్లించి, నాయకులను మరోవైపు పంపించారు. పోలీసుల దారి మళ్లింపుతో ఉద్రిక్తత నాయకులను అడ్డుకుని మృతదేహాన్ని కుటుంబ సభ్యులతో కలసి శ్మశానానికి తరలించడంతో జేఏసీ నాయకులు, బీజేపీ, కాంగ్రెస్, ఇతర ప్రజా సంఘాల నాయకులకు మధ్య తోపులాట తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. దీంతో ఆర్టీసీ కార్మికులు, ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు పోలీసులకు ఎదురునిలిచారు. ఈ క్రమంలో పోలీసులకు, పార్టీల నాయకులు, కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసు వాహనానికి అడ్డు తిరిగి కట్టెలు వేసి మంటలు పెట్టారు. ఈ క్రమంలోనే బాబు మృతదేహాన్ని మరికొంత మంది పోలీ సులు శ్మశానవాటిక వరకు తరలించి అంత్యక్రియ లు నిర్వహించారు. బండి సంజయ్ నేతృత్వంలో మంద కృష్ణమాదిగ, మాజీ ఎంపీ వివేక్, బీజేపీ, టీడీపీ, ఆర్టీసీ జేఏసీ, టీజేఎస్, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ, వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ ఇంటిపార్టీ్ట, ఆదివాసీ తుడుం దెబ్బ, ఏబీవీపీ నేతలు కోర్టు చౌరస్తాకు చేరుకుని బైఠాయించారు. తోపులాటలో సమయంలో ఏసీపీ వీరేంద్రసింగ్ ఎంపీ బండి సంజయ్ కాలర్‌ను పట్టుకుని చేయిచేసుకోబోయాడని, దానికి సంబంధించిన ఫొటోలను ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, కార్మికులు హక్కుల కోసం గొంతెత్తితే ఉక్కుపాదంతో ప్రభుత్వం అణచివేస్తోందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ ఆరోపించారు. ఎంపీ సంజయ్ కాలర్ పట్టుకున్న ఏసీపీ బాబుకు కన్నీటి వీడ్కోలు బాబు అంత్యక్రియల ప్రక్రియ ఓవైపు జరుగుతుండగా.. ఎస్సాఆర్ఆర్ కళాశాల చౌరస్తాలో కాంగ్రెస్ నేతలు రాస్తారోకో చేసి రోడ్డుపై వంటావార్పు చేపట్టారు. డ్రైవర్ నంగునూరి బాబు అంత్య క్రియలకు డ్రైవర్లు, కండక్టర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి బాబన్నకు అంతిమ వీడ్కోలు పలికారు. -
జేఏసీ నిర్ణయంతో బాబు అంత్యక్రియలు
సాక్షి, కరీంనగర్ : ఆర్టీసీ డ్రైవర్ బాబు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాలని జేఏసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బాబు కుటుంబ సభ్యుల అనుమతితోనే అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు జేఏసీ నేతలు తెలిపారు. ఈ క్రమంలో కరీంనగర్ బస్ డిపో వరకు శవయాత్ర నిర్వహించి తరువాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా 28 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినా.. మూడు రోజులుగా బాబు మృతదేహంతో దీక్ష చేసినా సీఎం కేసీఆర్‌లో చలనం లేదని టీఎంయూ వర్కింగ్ ప్రెసిడెంట్ థామస్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ యావత్ సమాజం, ఉద్యోగులు, విద్యార్ధులు, వ్యాపారస్తులు మద్దతు తెలిపిన కేసీఆర్‌లో మార్పు రాలేదని దుయ్యబట్టారు. ప్రభుత్వ వైఖరి వల్ల కార్మికులంతా ఆవేదనకు లోనై ఆత్మహత్య, మానసికంగా, చనిపోతున్నారని ధామస్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైవర్ బాబు కుటుంబానికి రూ. 50 లక్షల నష్ట పరిహారం, డబుల్ బెడ్ రూం ఇల్లు, ఇంట్లో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులెవరు ఆత్మహత్య చేసుకోవద్దని, సీఎంకు ఆ పరిస్థితులు తీసుకొచ్చేవరకు ఊరుకునేదిలేదని అన్నారు. చదవండి : ఆర్టీసీ డ్రైవర్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత -
నివురుగప్పిన నిప్పులా కరీంనగర్
సాక్షి, కరీంనగర్ : ఆర్టీసీ డ్రైవర్ బాబు నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆరపల్లికి తరలి వస్తున్నవారిని నియంత్రించేందుకు రోడ్లపై పోలీసులు భారీ గేట్లను అమర్చారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యకతిరేకంగా నినాదాలు చేస్తూ.. పోలీసుల నిర్భందం ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అటు పోలీసులకు ఇటు కార్మికులకు వాగ్వాదం నెలకొంది. దీంతో కరీంనగర్ నివురుగప్పిన నిప్పులా మారింది. ఇక డ్రైవర్ బాబు నివాసం వద్ద ఆర్టీసీ కార్మికులు మానవహారంగా ఏర్పడ్డారు. అలాగే కోదండరాంతో పాటు చాడ వెంకట్‌రెడ్డి, తమ్మినేని వీరభద్రంతో పాటు పలువురు వామపక్ష నేతలు అక్కడకు చేరుకున్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె 28వ రోజుకు చేరుకుంది. హైదరాబాద్ సరూర్‌నగర్ స్టేడియంలో బుధవారం జరిగిన సకల జనుల సమరభేరిలో కరీంనగర్–2 డిపోకు చెందిన డ్రైవర్ నంగునూరి బాబు (54) హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. మృతదేహంతో ఎంపీ బండి సంజమ్, కార్మికులు రాత్రంతా జాగరణ చేయగా, పొలిటికల్ జేఏసీ ఇచ్చిన కరీంనగర్ నగర బంద్ కొనసాగుతోంది. కరీంనగర్లో విద్యసంస్థల బంద్‌కు ఏబీవీపీ, వామపక్ష విద్యార్ధి సంఘాల మద్దతు తెలిపాయి. అలాగే ఛలో కరీంనగర్‌కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చారు. పోలీసులు బాబు మృతదేహాన్ని స్వగ్రామం కరీంనగర్ రూరల్ మండలం ఆరెపల్లికి గురువారం వేకువజామున తరలించారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలిచే వరకు బాబు అంత్యక్రియలు నిర్వహించబోమని ఆర్టీసీ జేఏసీ నాయకులు ప్రకటించడం, వివిధ పార్టీల నాయకులు మృతదేహం వద్దే బైఠాయించడం, పరామర్శకు వచ్చిన కరీంనగర్–2 డిపో మేనేజర్ మల్లేశంను కార్మికులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. భారీ సంఖ్యలో పోలీసు బలగాల మొహరింపుతో ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. హైడ్రామా మధ్య మృతదేహం తరలింపు నంగునూరి బాబు మృతదేహాన్ని హైడ్రామా మధ్య గురువారం వేకువజామున ఆరెపల్లికి తరలించారు. బాబు మృతదేహంతో ఆర్టీసీ కార్మికులు బస్టాండ్ వద్ద ధర్నా చేపట్టనున్నారనే సమాచారం మేరకు బుధవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు ఆర్టీసీ జేఏసీ, పోలీసుల మధ్య దోబుచులాట నెలకొంది. బాబు మృతదేహంతో బస్టాండ్‌లో ధర్నా నిర్వహించాలని జేఏసీ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఉమ్మడి జిల్లా సరిహద్దులోని శనిగరం, బెజ్జంకి క్రాస్‌రోడ్, గుండ్లపల్లి టోల్‌ప్లాజా, ఎల్ఎండీ కాలనీ, అల్గునూర్ చౌరస్తా, ఎన్టీఆర్ చౌరస్తాల వద్ద పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి భౌతికకాయాన్ని తీసుకొచ్చే క్రమంలోనే కార్మిక నాయకుల వాహన శ్రేణిని వెంబడిస్తూ పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య కరీంనగర్ బైపాస్ రోడ్‌కు చేరుకున్నారు. ఉదయం 4.30 గంటల ప్రాంతంలో జేఏసీ నేతల వాహనాలను అడ్డగించి అదుపులోకి తీసుకుని పీటీసీ సెంటర్‌కు తరలించారు. డ్రైవర్ బాబు మృత దేహంతో ఉన్న అంబులెన్స్‌ను ఆరెపల్లిలోని ఆయన నివాసానికి తరలించారు. బాబు కుటుంబ సభ్యులను ఓదారుస్తున్న ఎంపీ సంజయ్ ఉదయం నుంచే అరెస్టుల పర్వం.. బాబు హఠాన్మరణం పట్ల ప్రభుత్వ వైఖరే కారణమని నిరసిస్తూ గురువారం బంద్‌కు పిలుపునివ్వగా.. ఉదయం నుంచే పోలీసులు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పోనగంటి కేదారి ఆధ్వర్యంలో బస్‌డిపో నుంచి బస్సులు బయటకు వెళ్లకుండా బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీపీఐ శ్రేణులు బస్టాండ్‌లోకి చోచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు, సీపీఐ నాయకులకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కేదారి మాట్లాడుతూ బాబు మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, రూ.50 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బోయిని అశోక్, టేకుమల్ల సమ్మయ్య, గుండేటి వాసుదేవ్, కొమురయ్య, పైడిపల్లి రాజు, సదాశివ, తదితరులు పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షులు కళ్యాడపు ఆగయ్య, నాయకులు ఉదయం బస్టాండ్ ఆవరణలో ధర్నా నిర్వహించారు. భారీ బందోబస్తు.. ఆరెపల్లి గ్రామంలో ముందస్తుగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజకీయ నాయకులు, కార్మికులు వందలాది మంది రావడంతో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు. కరీంనగర్, పెద్దపల్లి కమిషనరేట్ల పరిధి నుంచి పోలీసు బలగాలను రప్పించారు. కరీంనగర్ అడినషల్ డీసీపీ శ్రీనివాస్, ఏసీపీలు పార్థసారధి, అశోక్‌లతోపాటు సీఐ తుల శ్రీనివాస్‌రావు, విజయ్‌కుమార్, దేవారెడ్డి, విజ్ఞేశ్వరరావు, మరో 20 మంది సీఐలతోపాటు కానిస్టేబుల్ నుంచి ఎస్సై స్థాయి వరకు వందలాది మంది పోలీసులు ఉన్నారు. ఆరెపల్లి గ్రామ మొదలు నుంచి ప్రతీ గల్లీలో పోలీసుల పహారా చేపట్టారు. పర్యవేక్షించిన ఇన్చార్జి సీపీ పరిస్థితిని కరీంనగర్ ఇన్చార్జి కమిషనర్ సత్యనారాయణ, ఆర్డీవో ఆనంద్‌కుమార్ పర్యవేక్షించారు. బాబు ఇంటి వద్దకు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని కమిషనర్ పోలీసులను ఆదేశించారు. ఏమీ చేయలేని పరిస్థితిలో పోలీసులు పోలీసులు బుధవారం రాత్రి నుంచి పరిస్థితి అదుపు తప్పకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వివిధ పార్టీల రాజకీయ నాయకులు బాబు ఇంటి వద్దకు వచ్చి చర్చలు జరిపి వరకు మృతదేహం కదిలేది లేదని భీష్మించుకు కూర్చోవడంతో పోలీసులు ఏమీ చేయలేని పరి స్థితి నెలకొంది. అరెస్టు చేస్తే మరో వైపు దారి తీస్తే తలనొప్పిగా మారుతుందనే ఆలోచనలో ఉన్నారు. రాజకీయ నాయకులతో మాట్లాడిన ససేమిరా అంటున్నారు. వర్షం పడినా నాయకులు అక్కడి నుంచి కదలడం లేదు. పోలీసులు కూడా రాత్రి వరకు అక్కడే ఉండాల్సి వచ్చింది. టిఫిన్, భోజనం ఏర్పాట్లు... ఉదయం నుంచి బాబు మృతదేహం వద్దనే ఆర్టీసీ కార్మికులు, మృతుడి బంధువులు ఉండడంతో టిఫిన్, భోజనం, మంచినీటి వసతి ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపే వరకు బాబు ఇంటి వద్దనే సమ్మె కొనసాగించేందుకు సిద్ధమయ్యారు. ‘చలో కరీంనగర్’కు తరలిరండి బాబుకు ప్రభుత్వం పక్షాన సహాయం అందించడంతోపాటు ఆర్టీసీ జేఏసీని సత్వరమే చర్చలకు పిలువాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ శుక్రవారం కరీంనగర్ పట్టణ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ జిల్లా శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కరీంనగర్ రీజియన్ పరిధిలోని పది డిపోల కార్మికులు ఉదయం పెద్ద సంఖ్యలో కరీంనగర్‌కు తరలివచ్చి చర్చలకు పిలిచే వరకు అంత్యక్రియలు జరుపకుండా నిరవధిక ధర్నాలో పాల్గొనాలని కోరింది. బంద్‌కు మద్దతు శుక్రవారం నాటి కరీంనగర్ పట్టణ బంద్‌కు టీఆర్ఎస్ మినహా అన్ని పార్టీల నేతలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, యువజన, విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాలు మద్దతు ఇచ్చాయని ఆర్టీసీ జేఏసీ నాయకులు జక్కుల మల్లేశం, ఎంపీ రెడ్డి, మనోహర్, ఎస్కె రాజు తెలిపారు. ట్రస్మా జిల్లా శాఖ ప్రైవేట్ విద్యాసంస్థలకు ముందస్తుగానే సెలవు ప్రకటించింది. -
ఆర్టీసీ సమ్మె: ఆరెపల్లిలో విషాదం
సాక్షి, కరీంనగర్: ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల సాధన కోసం తలపెట్టిన సకలజనుల సమరభేరి సభకు బుధవారం హైదరాబాద్‌కు తరలివెళ్లిన డ్రైవర్ నంగునూరి బాబు గుండె ఆగింది. కరీంనగర్–2 డిపోకు చెందిన ఆయన హఠాన్మరణం కరీంనగర్ రూరల్ మండలం ఆరెపల్లి గ్రామంలో విషాదం మిగిల్చింది. బాబు మృతి విషయం తెలియడంతో ఆయన కుటుంబం గుండెలవిసేలా రోదించిన తీరు గ్రామస్తులను కలచివేసింది. బెజ్జంకి మండలం గాగిళ్లపూర్ గ్రామానికి చెందిన బాబు ఉద్యోగరీత్యా ఆరెపల్లిలో నివాసం ఉంటున్నాడు. కరీంనగర్–2 డిపోలో 25 ఏళ్లుగా పని చేస్తున్నాడు. ఆర్టీసీ జేఏసీ సమ్మె పిలుపులో భాగంగా గత 26రోజులుగా ఆందోళనల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. జేఏసీ పిలుపు మేరకు హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో జరిగిన సభలో పాల్గొనేందుకు తోటి కార్మికులతో కలిసి వెళ్లాడు. సభాప్రాంగణంలోనే గుండెపోటుతో కుప్పకూలాడు. జేఏసీ నాయకులు స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాబుకు భార్య జయ, కుమారుడు సాయికుమార్, ఇద్దరు కూతుళ్లు దివ్య, సంధ్య ఉన్నారు. కూతురు దివ్యకు వివాహం కాగా.. కుమారుడు బీటెక్ చదువుతున్నాడు. నేడు ఉమ్మడి కరీంనగర్ బంద్ : ఆర్టీసీ జేఏసీ ఆర్టీసీ డ్రైవర్ బాబు హఠాన్మరణం చెందడంపై గురువారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా బంద్‌కు ఆర్టీసీ జేఏసీ జిల్లా శాఖ పిలుపునిచ్చింది. సమ్మె పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అప్రజాస్వామికమని, ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలన్ని ప్రభుత్వ హత్యలేనని, ప్రభుత్వ మొండి వైఖరి వల్ల ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కారణాలతో 16 మంది కార్మికులు అమరులయ్యారని ఆర్టీసీ జేఏసీ జిల్లా నాయకులు ఎంపీ రెడ్డి, జక్కుల మల్లేశం, మనోహర్, ఎస్కె రాజు, తదితరులు విమర్శించారు. బాబు మరణం బాధాకరమని, ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరి వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. బంద్‌లో వివిధ వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా పాల్గొనాలని, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలు, కుల సంఘాలు బంద్‌కు సహకరించి విజయవంతం చేయాలని కోరారు. బంద్‌కు పలు పార్టీల మద్దతు.. బంద్‌కు సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, న్యూడెమోక్రసీ పార్టీలు వేర్వేరు ప్రకటనల్లో మద్దతు ప్రకటించాయి. గురువారం జరిగే బంద్‌లో అన్ని వర్గాల ప్రజలు బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పలువురి సంతాపం.. ఆర్టీసీ డ్రైవర్ బాబు మృతికి సీపీఎం జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కొయ్యడ సృజన్‌కుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కసిరెడ్డి మణికంఠరెడ్డి, సీఐటీయూ జిల్లా నాయకులు శేఖర్, ఎడ్ల రమేష్, జాక్టో నేతలు, ప్రజా సంఘాల నేతలు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. (చదవండి: గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి) -
గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి
సాక్షి, హైదరాబాద్: సరూర్ నగర్లో బుధవారం జరిగిన సకల జనుల సమావేశానికి హాజరయిన ఆర్టీసీ డ్రైవర్ అనూహ్యంగా గుండెపోటుతో మరణించాడు. మృతుడు కరీంనగర్-2 డిపోకు చెందిన నంగునూరి బాబు అని, జిల్లాలో డ్రైవర్‌గా విధులు నిర్వర్తించేవాడని ప్రాథమికంగా గుర్తించారు. ఆర్టీసీ సమ్మెపై ప్రతిపక్ష నేతలు, కార్మిక సంఘాల నాయకులు చేస్తున్న ప్రసంగాలు వింటుండగా.. హఠాత్తుగా బాబుకు గుండెపోటు రావడంతో.. తోటి కార్మికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాబు కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. ఆర్టీసీ సమ్మెతో తీవ్ర కలత చెందిన బాబు గుండె పోటుకు గురై హఠాన్మరణం పొందాడని తోటి కార్మికులు పేర్కొన్నారు. డ్రైవర్ బాబు మృతికి సంతాపంగా రేపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా బంద్‌కు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. -
గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి
నిజామాబాద్–2 ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వర్తించే దూదేకుల గఫూర్ (35) మంగళవారం రాత్రి గుండెపోటుతో మరణించాడు. సమ్మెపై ప్రభుత్వం నిర్దయగా వ్యవహరిస్తుండడంతో మళ్లీ ఉద్యోగంలోకి తీసుకుంటారోలేదోనన్న బెంగతో గుండెపోటుకు గురయ్యాడని తెలుస్తోంది. సాక్షి, నిజామాబాద్ : సమ్మె నేపథ్యంలో.. ఇక తనకు ఉద్యోగం రాదనే బెంగతో కార్మికుడు గుండె నొప్పితో మరణించాడు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం గోలిలింగాల గ్రామంలో మంగళవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గఫూర్ తన నివాసంలో టీవిలో ఆర్టీసీ సమ్మె వార్తలు చూస్తుండగానే గుండెనొప్పికి గురయ్యా రు.నొప్పిరాగానే కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో చేగుంట తుఫ్రాన్ మధ్యలో గఫూర్ ప్రాణాలు విడిచాడు. ఇతనికి భార్య, ఆరు నెలల కుమార్తె తల్లిదండ్రులు, తమ్ముడు ఉన్నారు. మొత్తం కుటుంబ భారమంతా ఇతనిపైనే ఉన్నందున మానసికంగా కుంగిపోయాడని తద్వారా గుండెనొప్పి వచ్చిం దని కుటుంబ సభ్యులు తెలిపారు. కొంత కాలంగా జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో అతడికి కుటుంబ పోషణ భారంగా మారింది. ఈనేపథ్యంలో వారం రోజులుగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తినట్లు గఫూర్ తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలిసింది. గఫూర్ మరణవార్తను తెలసుకున్న మం డలంలోని పలువురు ఆర్టీసీ కార్మికులు హుటాహుటిన గోలిలింగాల గ్రామానికి చేరు కుని వివరాలను ఆరా తీశారు. కేవలం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించకుండా ప్రభు త్వం చేస్తున్న తాత్సారమే గఫూర్ మృతికి కారణమైందని ఆర్టీసీ కార్మికులు ఆరోపించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పదిమందికిపైగా గుండెనొప్పితో మరణించారని, ఇద్దరు ఆత్మహత్యలు చేసుకున్నారని ఇంకెంతమందిని పొట్టనపెట్టుకుంటారని నిజామాబాద్ జిల్లా ఆర్టీసీ జెఏఏసీ కో–కన్వీనర్, ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి సంజీవ్ ఆవేదన వ్యక్తం చేశారు. -
ఈ చావులకు బాధ్యులెవరు?
-
ఆర్టీసీ డ్రైవర్ దుర్మరణం
కోట: గుర్తు తెలియని వాహనం ఢీకొని వాకాడు డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ బద్దెవోలు నిరంజన్‌రెడ్డి(47) మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున విద్యానగర్ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు, చిల్లకూరు మండలం పారిచెర్లపాళెంకు చెందిన నిరంజన్‌రెడ్డి మల్లాం–తిరుపతి సర్వీస్ 6 గంటల డ్యూటీకి పోవాల్సి ఉంది. అయితే ఉదయం 5 గంటలకు ఇంటి నుంచి ద్విచక్ర వాహనంలో బయలుదేరిన నిరంజన్‌రెడ్డి మార్గమధ్యంలో విద్యానగర్ వద్ద ప్రమాదానికి గురయ్యాడు. అయితే ప్రమాదం జరిగిన తీరుపై భిన్నకథనాలు వినిపిస్తున్నాయి. గుర్తు తెలియని వాహనం ఢీకొందని కొందరు చెబుతుండగా, రోడ్డుకు అడ్డంగా పందులు రావడంతో ప్రమాదం జరిగిందని పలువురు పేర్కొం టున్నారు. తలకు బలమైన గాయం కావడంతో నిరంజన్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నిరంజన్‌రెడ్డి వాకాడు ఆర్టీసీ డిపోలో 22 ఏళ్లుగా డ్రైవర్‌గా పని చేస్తున్నారు. విధుల్లో క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకొన్నాడు. అదే విధంగా నేషనల్ మజ్ధూర్ యూనియన్ డిపో సెక్రటరీగా అందరికీ సుపరిచితుడే. నిరంజన్‌రెడ్డి మృతి వాకాడు డిపో సిబ్బందిని దిగ్భ్రాంతికి గురిచేసింది. సమాచారం అందుకున్న ఎస్ఐ నారాయణరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాలిరెడ్డిపాళెంకు తరలిం చారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు గుర్తు తెలి యని వాహనం ఢీకొని మృతి చెందినట్లు కేసు నమోదు చేశారు. డిపో మేనేజర్ ముక్తేశ్వరరావు, తోటి కార్మికులు నిరంజన్‌రెడ్డి మృత దేహానికి నివాళులర్పించారు. -
గుంటూరులో విషాదం
గుంటూరు: గుంటూరులో విషాదం చోటుచేసుకుంది. డ్యూటీలో ఉన్న ఓ ప్రైవేట్ కళాశాల బస్సు డ్రైవర్ గుండెపోటుతో మరణిచారు. దీంతో బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు పక్కన చెట్టుకు ఢీకొట్టింది. బస్సులో ఉన్న ఇంజనీరింగ్ విధ్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని బస్సు ఢీకొనడంతో వారు చనిపోయారు. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం చాగంటివారి పాలెం వద్ద శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులని ఆస్సత్రికి తరలించారు. -
గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి
మహబూబ్‌నగర్: విధి నిర్వహణలో ఉన్న ఓ ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుకు గురై మృతి చెందిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా నర్వ సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. మహబూబ్‌నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి నర్వకు వెళ్తుండగా.. బస్సు డ్రైవర్ మధుసూదన్‌రెడ్డి గుండెపోటుకు గురై ఒక్కసారిగి కుప్పకూలిపోయాడు. ఇది గుర్తించిన ప్రయాణికులు ఆస్పత్రికి తరలించేందుకు యత్నిస్తుండగా మృతి చెందాడు. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ చాకచక్యంతో వ్యవహరించి బస్సును రహదారి పక్కన నిలిపివేయడంతో తాము క్షేమంగా ఉన్నామని ప్రయాణికులు తెలిపారు. మృతుడు పెబ్బేరు మండలం జనగంపల్లి గ్రామవాసిగా తెలిసింది. ఇటీవలే నల్లగొండ జిల్లా చండూరు వద్ద ఇదే విధంగా రిటైర్మెంట్కు ఒక్కరోజు ముందు డ్రైవర్ గుండెపోటుకు గురై మృతి చెందిన విషయం తెలిసిందే.