
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులతో యాజమాన్యం శనివారం జరిపిన చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. మొత్తం డిమాండ్ల పరిష్కారానికి కార్మిక సంఘాల నేతలు పట్టుబట్టడంతో చర్చలు చివరి వరకు కొనసాగలేదు. ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందడంతో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు చర్చలకు వచ్చారు. ఎర్రమంజిల్‌లో ఉన్న ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం చర్చలు ప్రారంభమయ్యాయి. ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్ శర్మ, రవాణా శాఖ కమీషనర్ సందీప్ కుమార్ సుల్తానియా చర్చల్లో పాల్గొన్నారు.
నలుగురు కార్మిక నేతలను మాత్రమే చర్చలకు అనుమతించారు. వారి ఫోన్లను అనుమతించబోమని అధికారులు చెప్పడంతో కార్మిక నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫోన్లు సిచ్చాప్ చేసిన తర్వాతే చర్చలు ప్రారంభమయ్యాయి. చర్చల ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేశారు. ప్రధాన డిమాండ్ ఆర్టీసీ విలీనంపై కార్మిక సంఘాల నాయకులు పట్టుబడటంతో చర్చలు అర్థాంతరంగా ముగిసినట్టు తెలుస్తోంది. కాగా, ఆర్టీసీ కార్మికుల సమ్మె 22వ రోజు కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment