ఖమ్మం గుమ్మంలో ‘తుమ్మల’
రాజకీయ వ్యూహకర్తగా పేరు..
మారనున్న జిల్లా రాజకీయ ముఖచిత్రం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాజకీయ చాణుక్యడిగా పేరున్న తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రివర్గంలో చోటు లభించడంతో జిల్లా రాజకీయాల్లో అ నూహ్య పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. టీడీపీ నేతగా దాదాపు నాలుగు దశాబ్దాల పాటు రాజకీయ ఏకచత్రాధిపత్యాన్ని సాగించిన తుమ్మల భుజస్కంధాలపై ఖమ్మం జిల్లాలో నామమాత్రంగా ఉన్న టీఆర్‌ఎస్‌ను బలోపేతం చేయాల్సిన బాధ్యత ఉంది. దశాబ్దకాలం తర్వాత మంత్రి గా బాధ్యతలు చేపట్టిన తుమ్మల కమ్యూనిస్టుల కంచుకోటగా, కాంగ్రెస్‌కు ఆయువుపట్టుగా ఉన్న జిల్లాలో లక్ష్య సాధనలో రాజకీయంగా ముందు ఎవరివైపు గురి పెడతారనే అంశం చర్చనీయాం శమైంది.
టీడీపీలో ఉన్నప్పుడు తనకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు తదితరుల వ్యూహాలకు భిన్నంగా టీడీపీ శ్రేణులను గులాబీదళం వైపు మరల్చుకోవడానికి ప్రధాన దృష్టి సారించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వంటి నేతల సొంత జిల్లా కావ డం, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన రేణుకా చౌదరి ప్రభావం జిల్లాపై ఉన్న నేపథ్యంలో జిల్లాలోని కొందరు కాంగ్రెస్ శ్రేణుల్లో గూడుకట్టుకున్న అసంతృప్తి, నిరాశను తనవైపు ఏ మేర కు తిప్పుకోగలుగుతారన్న భావన వ్యక్తమవుతోంది.
టీడీపీ లక్ష్యంగా..
తెలంగాణలో తెలుగుదేశంను తుడిచి పెట్టడమే లక్ష్యంగా తుమ్మల పావులు కదిపే అవకాశం ఉం దని... కాంగ్రెస్, టీడీపీ తదితర పార్టీల్లో ఇమడలేని నేతలపై తుమ్మల ఇప్పటికే దృష్టి సారించారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు జి ల్లాకు మంత్రిపదవి లేకపోవడంతో టీఆర్‌ఎస్‌లో ఎవరికి వారే యమునా తీరే అన్న పరిస్థితుల్లో పార్లమెంట్ సెక్రటరీ జలగం వెంకట్రావును, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, పార్టీకి ఇద్దరు శాసనసభ్యులను సమన్వయం చేసుకుం టూ పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది.