nama nageswar rao
-
కేసీఆర్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు: ఎంపీ నామా
సాక్షి,ఖమ్మం జిల్లా: సత్తుపల్లిలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ నామా నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను రైతు బిడ్డని, చిన్నప్పటి నుంచి కష్టాలు చూసినవాడిని.. తెలంగాణా రాకముందు బ్రతుకు దెరువు కోసం వలసలు ఉండేవని గుర్తు చేశారు’. 9 ఏళ్ళ కాలంలో అనేక పథకాలను కేసీఆర్ ప్రవేశ పెట్టారని వేలాది కోట్ల రూపాయలను పట్టణాల అభివృద్ధికి ఖర్చు చేశారని కొనియాడారు. తెలంగాణ మీద కన్నుగుట్టి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఆపాలని కేంద్ర ప్రభుత్వం మాయ మాటలు చెబుతోందని ధ్వజమెత్తారు. ఒక ఎంపీని పిలవకుండా హైదరాబాద్‌లో కార్యక్రమాలు చేశారని మండిపడ్డారు. ప్రజా ప్రతినిధులను అవమాన పరిచేలా పొంగులేటి మాట్లాడటంపై అసహనం వ్యక్తం చేశారు. విమర్శించే ముందు చరిత్ర తెలుసుకోవాల్సిన మాట్లాడాల్సిన అవసరం ఉందని, ఇటువంటి పద్దతులు మార్చుకోవాలని హితవు పలికారు. కేసీఆర్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని ఫైర్ అయ్యారు. ఏ ఎన్నికలైన ఖమ్మం ప్రజలు సీఎంకు అండగా ఉంటారని పేర్కొన్నారు. అనేక సేవా కార్యక్రమాల చేస్తున్న పార్థ సారథి రెడ్డి పై బండి సంజయ్ విమర్శలు చేయటం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. -
‘నామా’ పురాణం బట్టబయలు
సాక్షి, హైదరాబాద్: టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళను బ్లాక్మెయిల్ చేసిన ఉదంతం ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సంచలనమైంది. నగ్న చిత్రాలున్నాయని, వాటిని బయటపెడతానని నామా బెదిరించడంపై హైదరాబాద్‌కు చెందిన మహిళ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో నామా నాగేశ్వర్రావుతోపాటు ఆయన సోదరుడు సీతయ్యలపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీనిపై శనివారం ‘సాక్షి’ ప్రచురించిన కథనం రెండు రాష్ట్రాల్లో దుమారం రేపింది. బాధ్యతాయుతంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధి మహిళ పట్ల వ్యవహరించిన తీరు మీడియాలో చర్చనీయాంశమ యింది. బాధిత మహిళ సుజాతా రామకృష్ణన్ కూడా నేరుగా మీడియా ముందుకు వచ్చారు. తనను నామా బెదిరించారని, అసభ్య పదజాలంతో దూషించారని, నగ్నచిత్రాలను బయటపెడతానని భయభ్రాంతులకు గురిచేశారని ఆవేదనను వెలిబుచ్చారు. నామా తనతో సంభాషించిన ఆడియోలను కూడా విడుదల చేశారు. మరోవైపు టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కూడా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. విలేకరులు అడిగిన ప్రశ్నకు ‘అదంతా వ్యక్తిగత వ్యవహారం.. పరిశీలిస్తాం.’ అని చెప్పి తేలిగ్గా కొట్టిపారేయడం గమనార్హం. బాబు సమాధానం చెప్పాలి: సుజాత బాధిత మహిళ సుజాతా రామకృష్ణన్ మీడియాతో మాట్లాడిన సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై తాను రెండు నెలల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేసినా కొందరు టీడీపీ నేతలు, మాజీ మంత్రులు కలసి కేసు నమోదు కాకుండా పోలీసులపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. తన కుమారుడిని ఓ రౌడీషీటర్‌తో బెదిరించారని, ఫిర్యాదు వెనక్కు తీసుకోవాలని చాలా ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. మహిళా సాధికారత కోసం పనిచేస్తానని చెబుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ విషయంపై స్పందించాలని డిమాండ్ చేశారు. మహిళలను లొంగదీసుకుని, బెదిరించే మనస్తత్వం ఉన్న నామాను పార్టీ పొలిట్‌బ్యూరోలో ఎలా కొనసాగిస్తారో బాబు సమాధానం చెప్పాలని, ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని కోరారు. త్వరలోనే నోటీసులు : ఈ ఉదంతంపై త్వరలోనే మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావుకు నోటీసులిచ్చి విచారణ జరుపుతామని జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. బాధిత మహిళ గతంలో రెండుసార్లు ఫిర్యాదు ఇచ్చిందని, అయితే, ఎలాంటి ఆధారాలు చూపనందున ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదన్నారు. తాజాగా ఫిర్యాదుతోపాటు ఆడియో, వీడియో ఆధారాలు ఇచ్చినందున వాటిని పరిశీలించి నామా, ఆయన సోదరుడు సీతయ్యపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. త్వరలోనే నోటీసులిచ్చి చట్టప్రకారం నామాను విచారిస్తామని చెప్పారు. మరోవైపు సుజాతా రామకృష్ణన్ వాంగ్మూలాన్ని జూబ్లీహిల్స్ పోలీసులు శనివారం నమోదు చేసుకున్నారు. ఈ రికార్డు ఆధారంగానే నామాకు నోటీసులిచ్చి విచారణ జరపనున్నారు. నా జీవితం తెరిచిన పుస్తకం టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు సాక్షి, అమరావతి: తనపై సుజాత చేసిన ఆరోపణల మీద టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు స్పందించారు. టీటీడీపీ సమావేశంలో పాల్గొనేందుకు శనివారం విజయవాడ వచ్చిన ఆయన ఏపీ సీఎం క్యాంపు కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. తాను బ్లాక్ మెయిల్ చేసినట్లు ఎవరో ఆరోపించిన విషయం తనకు తెలిసిందని, అందుకే బయటకు వచ్చి మాట్లాడుతున్నానన్నారు. ఇంకా పూర్తి వివరాలు తనకు తెలియవని, తెలుసుకున్న తర్వాత మాట్లాడుతానన్నారు. తన జీవితం తెరిచిన పుస్తకమని, తాను ఎవరినీ బ్లాక్ మెయిల్ చేయలేదన్నారు. నలుగురికీ సాయపడ్డానే తప్ప ఎవరినీ ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదన్నారు. సుజాత మీకు తెలుసా అని మీడియా ప్రతినిధులు అడిగినా స్పందించకుండా ఆయన వెళ్లిపోయారు. నామా, సుజాతల ఆడియో సంభాషణ ఇదీ... సుజాత: ఎందుకు అరుస్తారు అసలు నామా: సంబంధం లేదన్నాను. ఒకసారి చెప్పాను.. వందసార్లు చెప్పాను.. నువ్వు కావాలని చెప్పి చేయించి కాదంటావు.. ప్రామిస్ చేయమంటావు. సుజాత: ఏమీ లేనప్పుడు ప్రామిస్ చేయడానికి ఏమైంది? నామా: నువ్వెవరివే అసలు. నువ్వు నా గురించి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు.. నా మీద కాన్ఫిడెన్స్ లేనప్పుడు నాతో మాట్లాడకు అని వందసార్లు చెప్పా. నాతో మాట్లాడకు. అంతే.. ఒకటే మాట. నువ్వు ఇంత చిల్లర (బూతు మాట).. కాబట్టి డ్రైవర్ల దగ్గర ఎంక్వైరీ చేయడమేనా.. ఇదేనా నీ పద్ధతి. సుజాత: వాళ్లను అడిగితే లేని విషయాలు బయటకు వస్తాయా? నామా: ఏంటే... నువ్వు చిల్లర... కాబట్టి కథలు అల్లుతున్నావే. రోజుకో కథ అల్లి దొబ్బుతున్నావు. దొంగ (బూతు) ఒకసారి చెప్తారు.. రెండుసార్లు చెప్తారు... రోజూ ఆట అయిపోయింది నీకు.. ఇది కాదే బ్లాక్మెయిల్? సుజాత: ఎందుకు, నిజాన్ని అడగడం బ్లాక్‌మెయిలా? నామా: నీ..... సుజాత: నిజం అడిగితే బ్లాక్‌మెయిలా... నాకు చెప్పండి.. ప్రామిస్ చేస్తారా... లేదా? నామా: ఈ మాట మాట్లాడకు. నాకు సంబంధం లేదని చెప్పాను. సుజాత: అంటే.. లేనప్పుడు ఎందుకు ప్రామిస్ చేయవు? నామా: (బూతు మాట) నాకు సంబంధం లేదంటే నీకేంటే ప్రామిస్ చేసేది... (బూతు మాట) సుజాత: నువ్వెవరు నన్ను (బూతు మాట) అనడానికి నామా: బూతుమాట సుజాత: అంటే అది నిన్ను పెళ్లి చేసుకుందా. అది పతివ్రతా.. అంటే నువ్వు దానికి తాళి కట్టావు. అంతే కదా.. అందుకే కదా అది నిన్ను మొగుడు అని చెప్పుకుంటుంది. నామా: పద్ధతి ప్రకారం మాట్లాడు సుజాత: నేను పద్ధతి ప్రకారమే మాట్లాడుతున్నా. అది నిన్ను మొగుడు అని ఎందుకు చెప్పుకుంటుంది? నీ గురించి మాట్లాడినప్పుడు హస్బెండ్.. హస్బెండ్ అని ఎందుకు చెప్తోంది.. నామా: అది ఎవరో నాకు తెలియదు. దాంతో నువ్వు (బూతు మాట)... ఆ సంగతులు నాతో మాట్లాడకు. నువ్వు తప్పుడు (బూతు మాట) కాబట్టి అలా చేస్తున్నావు. సుజాత: అవును.. మరి నువ్వేంటి... నువ్వేంటి? నామా: అది చిల్లర (బూతు మాట) కాబట్టి నాకు సంబం«ధం లేని విషయం అది సుజాత: అంటే అది నిన్ను మొగుడని చెప్పుకోవచ్చా? నామా: ఈ విధంగా బ్లాక్మెయిల్ చేయడం సుజాత: ఏంటి బ్లాక్మెయిల్.... నువ్వు ఏమీ చేయనప్పుడు బ్లాక్మెయిల్ ఎందుకవుతుంది? నువ్వు ఏం తప్పు చేయనప్పుడు నీకు ఎందుకంత కోపం వస్తోంది? నామా: మెస్సేజ్‌లు పెడతావు...బ్లాక్మెయిల్ చేస్తావు... సుజాత: ఏం చేశాను.. ఏం ఫోటోలు పంపించాను.. ఏం పంపించాను నామా: నా మాట మీద కాన్ఫిడెన్స్ లేనప్పుడు నాతో మాట్లాడకు. ఒకటే మాట. సుజాత: అంటే నువ్వు దాంతో...? నామా: ఏయ్.. పో... (బూతు మాట) సుజాత: ఇవాళ మధ్యాహ్నం కూడా దానితో మాట్లాడావు. నామా: నీ... (బూతు మాట) నాకు సంబంధం లేదని చెప్తున్నా.. పద్ధతిగా మాట్లాడు. సుజాత: నేను ప్రూవ్ చేస్తే ఏం చేస్తావు ఇప్పుడు. ఇంతకుముందు ఒకసారి ఒప్పుకున్నావా లేదా దాంతో నీకుందని ఒప్పుకున్నావా లేదా? నామా: నువ్వొక... చూడు... ఇక మొదలుపెట్టానంటే... నువ్వు తలెత్తుకోకుండా చేస్తా.. నువ్వు మాట్లాడుతున్నావు చెప్తున్నా.. సుజాత: ఓకే... నామా: చిల్లర మాటలు మాట్లాడకు.. చెప్తున్నా.. సుజాత: ఓకే చెయ్యి.. నామా: ఏమనుకుంటున్నావో నువ్వు... సుజాత: ఏం చేస్తావు... నన్ను తలెత్తుకోకుండా చేస్తానన్నావు.. ఏం చేస్తావు. రెండో ఆడియో టేపులోని సంభాషణలు.. నామా: నీకు నమ్మకం ఉంటే చెయ్యి... లేకపోతే లేదు. సుజాత: నాకు నమ్మకం ఎలా ఉంటుంది... నీ మీద నామా: పెట్టు సుజాత: నువ్వు వాళ్లతో ఆడే డ్రామాలు వాళ్లతో ఆడుతున్నావ్... వాళ్లకేమో నా మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్తున్నావ్. నామా: నువ్వు ఇదే మాట్లాడుతున్నావ్ సుజాత: సరే...నరేంద్ర నీకు తెలుసని ప్రూవ్ చేస్తే ఏం చేస్తావ్... జూలై నెలలో వాడు నీకు కాల్స్ చేశాడు.. నీవ్వు వాడితో మాట్లాడావని ప్రూవ్ చేస్తే ఏం చేస్తావ్? నామా: తప్పు మాట్లాడుతున్నావ్. తప్పు మాట్లాడుతున్నావ్. సుజాత: 2014 నీ కాల్స్ లిస్టు నా దగ్గర ఉందని నీకు తెలుసు కదా. నామా: నువ్వు మొదలుపెట్టిందే మాట్లాడుతు న్నావ్.. ఇక దయచేసి నాకు ఫోన్ చెయ్యకు సుజాత: ఓకే సరే అయితే నామా: నువ్వు మారిపోతానంటే... సుజాత: నువ్వు మారవా... నామా: నువ్వు తప్పు మాట్లాడుతున్నావ్. వాళ్లతో మాట్లాడావ్, వీళ్లతో మాట్లాడావ్.. నాకు ఎవ్వరితో మాట్లాడే అవసరం లేదు. సుజాత: అవునా... నువ్వు టీఆర్ఎస్లో చేరుతున్నావ్. నీ పొలిటికల్ కెరియర్ కోసం నన్ను విత్‌డ్రా చేసుకోమంటున్నావ్. అంతేగానీ.. నామా: నా పొలిటికల్ కెరీర్ గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. నా పొలిటికల్ కెరీర్ గురించి నువ్వు అడగొద్దు. నా పొలిటికల్ కెరీర్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. అర్థమైందా..? సుజాత: నా పర్సనల్ లైఫ్ గురించి మాత్రం నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు నామా: తప్పులు మాట్లాడుతున్నావ్.. ఛండాలంగా మాట్లాడుతున్నావ్ సుజాత: అవునా... నామా: కావాలని మాట్లాడుతున్నావ్... కావాలని చేస్తున్నావ్.. సమస్యే లేదు. ఇలాంటి చిల్లర పనులు నేను చెయ్యను. చేయబోను. కేసు విత్‌డ్రా చేసుకుని తర్వాత మాట్లాడు. (ఇంతలోనే ఫోన్ కట్ అయిపోయింది) -
ఖమ్మం గుమ్మంలో ‘తుమ్మల’
రాజకీయ వ్యూహకర్తగా పేరు.. మారనున్న జిల్లా రాజకీయ ముఖచిత్రం సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాజకీయ చాణుక్యడిగా పేరున్న తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రివర్గంలో చోటు లభించడంతో జిల్లా రాజకీయాల్లో అ నూహ్య పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. టీడీపీ నేతగా దాదాపు నాలుగు దశాబ్దాల పాటు రాజకీయ ఏకచత్రాధిపత్యాన్ని సాగించిన తుమ్మల భుజస్కంధాలపై ఖమ్మం జిల్లాలో నామమాత్రంగా ఉన్న టీఆర్ఎస్ను బలోపేతం చేయాల్సిన బాధ్యత ఉంది. దశాబ్దకాలం తర్వాత మంత్రి గా బాధ్యతలు చేపట్టిన తుమ్మల కమ్యూనిస్టుల కంచుకోటగా, కాంగ్రెస్‌కు ఆయువుపట్టుగా ఉన్న జిల్లాలో లక్ష్య సాధనలో రాజకీయంగా ముందు ఎవరివైపు గురి పెడతారనే అంశం చర్చనీయాం శమైంది. టీడీపీలో ఉన్నప్పుడు తనకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు తదితరుల వ్యూహాలకు భిన్నంగా టీడీపీ శ్రేణులను గులాబీదళం వైపు మరల్చుకోవడానికి ప్రధాన దృష్టి సారించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వంటి నేతల సొంత జిల్లా కావ డం, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన రేణుకా చౌదరి ప్రభావం జిల్లాపై ఉన్న నేపథ్యంలో జిల్లాలోని కొందరు కాంగ్రెస్ శ్రేణుల్లో గూడుకట్టుకున్న అసంతృప్తి, నిరాశను తనవైపు ఏ మేర కు తిప్పుకోగలుగుతారన్న భావన వ్యక్తమవుతోంది. టీడీపీ లక్ష్యంగా.. తెలంగాణలో తెలుగుదేశంను తుడిచి పెట్టడమే లక్ష్యంగా తుమ్మల పావులు కదిపే అవకాశం ఉం దని... కాంగ్రెస్, టీడీపీ తదితర పార్టీల్లో ఇమడలేని నేతలపై తుమ్మల ఇప్పటికే దృష్టి సారించారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు జి ల్లాకు మంత్రిపదవి లేకపోవడంతో టీఆర్ఎస్లో ఎవరికి వారే యమునా తీరే అన్న పరిస్థితుల్లో పార్లమెంట్ సెక్రటరీ జలగం వెంకట్రావును, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, పార్టీకి ఇద్దరు శాసనసభ్యులను సమన్వయం చేసుకుం టూ పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. -
తనయ కష్టం చూడలేక తండ్రి ఆత్మహత్య
అతనికి కూతురంటే ప్రాణం. భారీగా కట్నకానుకలు ఇచ్చి ఆమెకు పెళ్లి చేశాడు. పెళ్లరుున ఏడాదిన్నరకే ఆమెను అల్లుడు వేధిస్తుండడాన్ని తట్టుకోలేకపోయూడు. భర్త దగ్గర ఉండలేకపోతున్నానంటూ పుట్టింటికొచ్చి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కూతురిని చూసి ఆ తండ్రి గుండె చెరువైంది. ఆమె ఏదైనా అఘారుుత్యం చేసుకుంటుందేమోనని అతడు నిత్యం భయపడుతుండేవాడు. తీవ్రంగా మదనపడుతుండేవాడు. ఎంతో ప్రేమగా పెంచుకున్న తన చిట్టి తల్లికి వచ్చిన కష్టాన్ని చూసి తట్టుకోలేక, ఆమె కన్నీళ్లను తుడవలేక తనువు చాలించాడు. పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వందనం (ఖమ్మం అర్బన్): తన కూతురిని అల్లుడు వేధిస్తుండడాన్ని తట్టుకోలేని ఓ వ్యక్తి పురుగు మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని కుటుంబీకులు తెలిపిన ప్రకారం...వందనం గ్రామస్తుడు పున్నం నరసింహా రావు(43) తన చిన్న కూతురు శివాణిని, గోపాలపురం గ్రామానికి చెందిన దొండపాటి సురేష్‌కు ఇచ్చి 18 నెలల క్రితం వివాహం చేశాడు. హైదరాబాదులోగల ప్రైవేటుబ్యాంక్లో ఉద్యో గం చేస్తున్న సురేష్‌కు వివాహ సమయంలో నాలుగు ఎకరాల భూమి, కొంత బంగారం, సుమారు 60లక్షల రూపాయలు కట్నంగా ఇచ్చాడు. శివాణి-సురేష్ దాంపత్యం జీవితం కొన్నాళ్లపాటు బాగానే సాగింది. వారు హైదరాబాద్‌లో కాపురం పెట్టారు. అప్పటికే సురేష్‌కు తన సహోద్యోగితో వివాహేతర సంబంధం ఉంది. శివాణిని వదిలించుకోవాలని నిర్ణరుుంచుకున్న సురేష్.. ఆమెను రకారకాలుగా హింసించసాగాడు. ఈ విషయం తన తల్లిదండ్రులకు చెబితే తట్టుకోలేరనే భయంతో ఆమె కొంతకాలం ఈ హింసను భరించించింది. చివరికి ఆమె రెండు నెలల కిందట పుట్టింటికి వచ్చి తన తల్లిదండ్రులకు మొత్తం విషయం చెప్పి విలపించింది. ఆమె ఇక్కడకు వచ్చిన తరువాత కూడా సురేష్ వేధించడం మానలేదు. ఆమెను బెదిరిస్తూ సెల్‌ఫోన్‌కు మెసేజ్‌లు పంపించసాగాడు. తన కూతురు ఏదైనా అఘా యత్యం చేసుకుంటుందేమోనని నరసింహారావు నిత్యం భయపడుతుండేవాడు. ఈ వేదనతోనే అతడు గత మంగళవారం తన ఇంటి వద్ద పురుగు మందు తాగాడు. అప్పటి నుంచి హైదరాబాదులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడు గురువారం రాత్రి మృతిచెందాడు. కూతురు శివాణిని అల్లుడు సురేష్తోపా టు అతని తమ్ముడు, తండ్రి వేధిస్తుండడాన్ని తట్టుకోలేకనే నరసింహారావు ఆత్మహత్య చేసుకున్నట్టుగా అతని కుటుంబీకులు చింతకాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మృతదేహంతో రాస్తారోకో నరసింహారావు మృతదేహాన్ని అతని కుటుంబీ కులు, బంధువులు శుక్రవారం గోపాలపురం తీసుకొచ్చారు. సురేష్ ఇంటి ఎదుట ఖమ్మం- వైరా ప్రధాన రహదారిపై మృతదేహాన్ని ఉంచి రెండు గంటలపాటు ఆందోళనకు దిగారు. రెండు వైపులా ట్రాఫిక్ నిలిచిపోవడంతో అర్బన్ సీఐ శ్రీధర్ వెళ్లి, డీఎస్పీతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని ఆందోళనకారులకు నచ్చచెప్పి శాంతింపచేశారు. అదే సమయంలో అటువైపు వచ్చిన మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆగారు. శివాణితో మాట్లాడారు. మృతుని కుటుంబానికి తగిన న్యాయం చేయాలని సీఐని కోరారు. -
మీ అందరికీ రుణపడి ఉంటా : తుమ్మల
సత్తుపల్లి : ‘నాకు రాజకీయ జన్మనిచ్చి ఈ స్థాయికి తీసుకొచ్చిన మీ అందరి జన్మజన్మలా రుణపడి ఉంటా’నని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భావోద్వేగానికి లోనయ్యారు. సత్తుపల్లిలోని చల్లగుళ్ల నర్సింహారావు నివాసంలో ఆదివారం జరిగిన ఐదు నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘గత 30 సంవత్సరాలుగా ఎలా పని చేశమో, భవిష్యత్తులో కూడా మీ కీర్తి ప్రతిష్టల కోసం.. మీ సౌభాగ్యం కోసం, మీ తుమ్మల పనిచేస్తాడు.. మీరిచ్చిన అపూర్వ సంఘీభావం జీవితాంతం గుర్తు పెట్టుకుంటా..’ అని అన్నారు. పలుమార్లు కంటతడి పెట్టిన తుమ్మల... టీడీపీకి రాజీనామా చేసిన జిల్లా అధ్యక్షులు కొండబాల కోటేశ్వరరావు మాట్లాడుతున్న సమయంలో తుమ్మల నాగేశ్వరరావు పలుమార్లు కన్నీటి పర్యంతమయ్యారు. ‘తుమ్మల నిర్ణయానికి కట్టుబడి ఉంటాం.. మీ అనుమతితో ప్రతిష్టాత్మకమైన నిర్ణయాన్ని ప్రకటిద్దాం.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పనిచేద్దాం.. మీ అందరి అనుమతితో సభ్యత్వం తీసుకుందాం.. తుమ్మల నాయకత్వాన్ని బలపర్చుదాం’ అని కొండబాల కోటేశ్వరరావు కార్యకర్తల హర్షద్వానాల మధ్య ప్రకటించటంతో తుమ్మల నాగేశ్వరరావు కన్నీరు ఆపుకోలేకపోయారు. దీంతో సభాప్రాంగణంలో నిశ్శబ్దం అలుముకుంది. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జిల్లాలో నియంతలా తయారైన వ్యక్తి పోకడలపై అధిష్టానానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని, అది భరించలేకనే బయటకు రావాల్సి వచ్చిందని మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాము పదవుల కోసమో, డబ్బు కోసమో టీడీపీని వీడడం లేదన్నారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, డీసీఎంఎస్ చైర్మన్ అంజయ్య, జెడ్పీ వైస్ చైర్మన్ బరపాటి వాసు, డీసీసీబీ డెరైక్టర్లు బోడేపూడి రమేష్‌బాబు, పాల నర్సారెడ్డి, వెలిశాల చెన్నాచారి, చల్లగుండ్ల కృష్ణయ్య, నాయకులు దొడ్డాలకుల స్వాతి, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, తోటకూర రవిశంకర్, బాలాజీ నాయక్, మచ్చా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీలో ‘జడ్పీ’ లొల్లి
సాక్షి, ఖమ్మం : జిల్లా పరిషత్ చైర్మన్ కుర్చీ కోసం టీడీపీలో ఆట మొదలైంది. పార్టీ నేతలు తుమ్మల నాగేశ్వరరావు, నామా నాగేశ్వరరావు ఎవరికి వారు తమ అనుచరులకే చైర్మన్ పీఠం దక్కేలా పావులు కదుపుతున్నారు. ముంపు మండలాలను ఈ ఎన్నిక నుంచి మినహాయించడం, పీఠం దక్కించుకునేందుకు మరో జెడ్పీటీసీ అవసరం కావడం.. ఇద్దరు నేతల మధ్య పొసగకపోవడంతో రాజీ కుదుర్చుకునేందుకు టీడీపీ జిల్లా రాజకీయం రాజధానికి చేరింది. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇరువురు నేతల మధ్య సయోధ్యకు ప్రయత్నిస్తున్నా రాజీ కుదరకపోతే సమీకరణ లు మారే అవకాశం ఉంది. జిల్లా పరిషత్ ఎన్నికల్లో టీడీపీ 22 జెడ్పీటీసీ స్థానాలు దక్కించుకొని అతి పెద్ద పార్టీగా అవతరించింది. అయితే ముంపు మండలాలను తాజాగా ఈ ఎన్నికల నుంచి మినహాయిస్తూ ఎన్నికల సంఘం ప్రకటించడంతో ఆ పార్టీ జెడ్పీటీసీల సంఖ్య మూడు తగ్గి 19కి చేరింది. ముంపు మండలాలను మినహాయిస్తే మిగిలిన 39 స్థానాల్లో టీడీపీ 19, కాంగ్రెస్ 10, వైఎస్సార్సీపీ 4, సీపీఎం 2, సీపీఐ 1, సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ 3 స్థానాలను దక్కించుకున్నాయి. ఏ పార్టీ జెడ్పీ చైర్మన్ పదవిని దక్కించుకోవాలన్నా 20 జెడ్పీటీసీ స్థానాలుండాలి. అయితే ఇందులో టీడీపీకి మరొక స్థానం ఉంటే జెడ్పీ చైర్మన్ దక్కించుకోనుంది. ఈ ఒక్క స్థానం మాట అటుంచితే చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు తుమ్మల, నామా వర్గాలు సై అంటే సై అంటున్నాయి. తమ జెడ్పీటీసీలే ఎక్కువగా ఉన్నారని తమ్మల వర్గం, తమకే ఎక్కువ మంది సభ్యుల మద్దతు ఉందని నామా వర్గం భావిస్తోంది. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఇరువర్గాల జెడ్పీటీసీలు ఇలానే లెక్కలు వేసుకున్నారు. అయితే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వెలువరించి ఈనెల 7న ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించడంతో ఇప్పుడు ఆ పార్టీలో చైర్మన్ పదవి రాజకీయం అగ్గి రాజేసింది. తెలంగాణలో ఖమ్మంలోనే టీడీపీ అత్యధిక జెడ్పీటీసీ స్థానాలు గెలుపొందడంతో చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు అధినేత చంద్రబాబు ఇరువురు నేతలను సయోధ్యకు రావాలని పిలిచినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తుమ్మల, నామాతో పాటు వారి అనుచర నేతలు, జెడ్పీటీసీలు శుక్రవారం రాజధానికి వెళ్లారు. సాయంత్రం బాబు నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశానికి తుమ్మల, నామా, పోట్ల నాగేశ్వర్రావు, సండ్ర వెంకటవీరయ్య, బాలసాని ల క్ష్మీనారాయణ, కొండబాల కోటేశ్వర్రావు తదితర నేతలు హాజరయ్యారు. చైర్మన్ అభ్యర్థి ఎంపిక విషయంలో ఏకాభిప్రాయానికి రావాలని తొలుత చంద్రబాబు ఇరువురు నేతలకు సూచించారని, వారు ఎటూ తేల్చలేక చివరకు అభ్యర్థి ఎంపికను బాబుకే వదిలేశారని సమాచారం. ఈ విషయంలో జిల్లా నేతలతో శనివారం మరోసారి బాబు సమావేశమై అభ్యర్థి పేరు ఖరారు చేస్తారని తెలిసింది. ఇక్కడ సయోధ్య కుదిరితే అనంతరం జెడ్పీటీసీలను క్యాంపులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. బరిలో వెంకటాపురం, అశ్వాపురం, ఏన్కూరు జెడ్పీటీసీలు.. చైర్ పర్సన్ రేసులో తుమ్మల వర్గం నుంచి వెంకటాపురం జెడ్పీటీసీ గుడిపల్లి కవిత, నామా వర్గం నుంచి అశ్వాపురం, ఏన్కూరు జెడ్పీటీసీలు తోకల లత, కొపెల శ్యామల ఉన్నారు. టీడీపీ గెలిచిన 19 జెడ్పీటీసీల్లో ఎక్కువ మంది తమ వర్గం వారే ఉన్నారని, చంద్రబాబు తమ వర్గం సభ్యురాలినే చైర్పర్సన్ అభ్యర్థిగా ప్రకటిస్తారని తుమ్మల వర్గం భావిస్తోంది. అయితే చంద్రబాబు వద్ద తనకున్న పలుకుబడితో నామా తన అనుచర సభ్యులకే జెడ్పీ చైర్మన్ దక్కేలా చూస్తారని పార్టీలో చర్చ జరుగుతోంది. జిల్లాలో ఇక తుమ్మల ఆధిపత్యానికి పూర్తిగా బ్రేక్ వేయాలంటే జెడ్పీ చైర్మన్ పదవిని తన అనుచర సభ్యురాలికి దక్కేలా నామా చక్రం తిప్పుతున్నారని పార్టీ నేతలు గుసగుసలాడుతున్నారు. నామా వర్గం సభ్యురాలిని చంద్రబాబు చైర్పర్సన్ అభ్యర్థిగా ప్రకటిస్తే చివరకు ఏం చేయాలన్న విషయమై ఇప్పటికే తుమ్మల వర్గం ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మరొకరి కోసం వేట.. చంద్రబాబు మాటే వేదంగా అంతా ఒక్కతాటిపైకి వచ్చినా టీడీపీలో ఏ వర్గం చైర్మన్ పీఠం దక్కించుకోవాలన్నా మరో పార్టీ సభ్యుడి మద్దతు కీలకం అవుతుంది. ఎన్డీ సభ్యులు గతంలో కూడా తటస్థంగా వ్యవహరించగా, ఈ సారి కూడా అదే విధానం పాటించాలని ఆ పార్టీ నేతలు ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే ఇప్పటికే తుమ్మల వర్గం ఓ అడుగు ముందుకేసి సీపీఎం, సీపీఐ నేతలతో మంతనాలు జరిపినట్లు సమాచారం. చైర్మన్ అభ్యర్థిగా చంద్రబాబు తమ వర్గం సభ్యురాలినే ప్రకటిస్తే ముందస్తు వ్యూహం ఫలిస్తుందని తు మ్మల వర్గం ధీమాగా ఉంది. నామా వర్గం కూడా ఇదే తరహాలో తమ వర్గం సభ్యురాలిని చైర్‌పర్సన్‌ను చేసేందుకు ఆ ఒక్క సభ్యుడి మద్దతు కోసం ఇతర పార్టీ నేతలతో రహస్యంగా మంతనాలు చేసినట్లు సమాచారం. రాజీ కుదరకపోతే.. ఇరు వర్గాల మధ్య చంద్రబాబు చేసిన సయోధ్య కుదరక, తమ అనుచరురాలిని చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించకపోతే తుమ్మల వర్గం ఏం చేస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌కు 10 మంది జెడ్పీటీసీ సభ్యులున్నా అందులో పినపాక జెడ్పీటీసీ జాడి జానమ్మ మాత్రమే ఎస్సీ మహిళ. ఆ పార్టీ చైర్పర్సన్ పీఠాన్ని దక్కించుకోవాలంటే మరో పది మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే చైర్మన్ పీఠం రాజకీయాలకు ఆ పార్టీ నేతలు ఎవరికివారు అంటీముట్టనట్లుగా ఉన్నారు. చంద్రబాబు వద్ద చైర్మన్ పీఠం రాజీ కుదరకపోతే ఇతర పార్టీలు, కాంగ్రెస్ పొత్తుతో చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు కూడా తుమ్మల వర్గం వెనకాడదని సమాచారం. -
టీడీపీపీ నేత ఎంపిక అధికారం చంద్రబాబుకే
బాబు అధ్యక్షతన భేటీలో టీడీపీ ఎంపీల తీర్మానం టీడీపీపీ నేతగా అశోక్‌గజపతిరాజుకు అవకాశం? లేదంటే శివప్రసాద్, కొనకళ్ల, నిమ్మల, రాయపాటిల్లో ఒకరికి చాన్స్ సుజనాకు కేంద్రమంత్రి పదవి ఇస్తామన్న బాబు! హైదరాబాద్: తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ (టీడీపీపీ) నాయకుడిని ఎంపిక చేసే అధికారాన్ని పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు ఎంపీలు కట్టబెట్టారు. టీడీపీపీ సమావేశం మంగళవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో టీడీపీపీ నేత ఎంపిక అంశం చర్చకు రాగానే ఆ అధికారాన్ని చంద్రబాబుకు కట్టబెడుతూ పార్టీ ఎంపీలు తీర్మానం చేశారు. గత సభలో టీడీపీపీ నేతగా నామా నాగేశ్వరరావు వ్యవహరించగా రాజ్యసభలో పార్టీ పక్ష నేతగా టి.దేవేందర్‌గౌడ్ కొనసాగుతున్నారు. ఆ పదవిలో ఆయన్ను కొనసాగిస్తారు. ఈసారి నామా ఖమ్మం లోక్‌సభ నుంచి పోటీచేసి ఓడిపోయారు. దీంతో కొత్త నేతను ఎన్నుకోవాల్సి వచ్చింది. టీడీపీపీ నేతగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజును నియమించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. లేదంటే ఆయన్ను లోక్‌సభలో పార్టీ పక్ష నేతగా నియమించి, టీడీపీపీ నేతగా ఎన్.శివప్రసాద్, వై.సుజనాచౌదరి, కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప, రాయపాటి సాంబశివరావుల్లో ఒకరిని నియమించే అవకాశముందని సమాచారం. మరో మంత్రి పదవి వస్తుంది టీడీపీకి కేంద్ర కేబినెట్లో మరో మంత్రి పదవి దక్కుతుందని టీడీపీపీ సమావేశంలో చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. అయితే అది కేబినేట్ హోదా లేదా సహాయ మంత్రి పదవా అనేది చెప్పలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. కేంద్ర మంత్రివర్గ విస్తరణ సమయంలో టీడీపీకి మళ్లీ అవకాశమిస్తానని ప్రధానమంత్రి నరేంద్రమోడీ తనతో అన్నారని.. ఈ పదవిని సుజనాచౌదరికి ఇస్తామని చంద్రబాబు చెప్పినట్లు సమావేశంలో పాల్గొన్న ఎంపీలు కొందరు చె ప్పగా అలాంటిదేమీ లేదని మరి కొందరు పేర్కొన్నారు. నేదురుమల్లి జనార్దనరెడ్డి మరణం వల్ల ఏర్పడిన రాజ్యసభలో రాష్ట్రం నుంచి ఏర్పడిన ఖాళీని భర్తీ చేసే సమయంలో బీజేపీకి కేటాయించాల్సి రావచ్చని చంద్రబాబు తెలిపారు. ఈ సీటు వారికి కేటాయించటం వల్ల గతంలో జరిగిన ఒప్పందం మేరకు కేటాయించాల్సిన మూడు శాసనమండ లి సీట్లలో కోత విధించవచ్చని తెలిపారు. ముండే మృతిపట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపీనాథ్‌ముండే రోడ్డు ప్రమాదంలో మృతి చెందటం పట్ల చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముండే అందించిన సేవలు మరువలేనివని.. ఆయన మృతి దేశానికి తీరని లోటని సంతాపం తెలిపారు. -
వైఎస్సార్సీపీకి మూడు అసెంబ్లీ, ఒక ఎంపీ
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలోనూ ప్రాతినిధ్యం లభించింది. ఒక పార్లమెంట్ స్థానంతో పాటు, మూడు అసెంబ్లీ సెగ్మెంట్లను ఆ పార్టీ కైవసం చేసుకుంది. ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తన సమీప ప్రత్యర్థి నామా నాగేశ్వరరావు(టీడీపీ)పై 17వేలకు పైచిలుకు ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధిం చారు. అదే విధంగా ఖమ్మం జిల్లాలోని పినపాక, వైరా, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ జెండా రెపరెపలాడింది. పినపాక నుంచి పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట నుంచి తాటి వెంకటేశ్వర్లు, వైరా నుంచి బానోతు మదన్‌లాల్‌లు ఘన విజయం సాధించారు. -
నేను స్థానికుడిని.. ఆశీర్వదించండి
సాక్షి, ఖమ్మం: ‘నామా నాగేశ్వరరావుది వరంగల్ జిల్లా... నారాయణది చిత్తూరు జిల్లా.. నాది కల్లూరు మండలం నారాయణపురం..నేను స్థానికుడిని..స్వతహా రైతు బిడ్డను... నన్ను ఆశీర్వదిస్తే జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తాను’- అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. ఖమ్మం పార్లమెంట్ ఏర్పడిన తర్వాత స్థానికుడిగా విజయం సాధించింది తమ్మినేని ఒక్కరేనని, ఆతర్వాత తాను స్థానికుడిగా ఈ ఎన్నికల్లో బరిలోకి దిగానని, స్థానిక నాయకత్వాన్ని రాజకీయ చైతన్యవంతులైన జిల్లా ప్రజలు తప్పకుండా ఆశీర్వదిస్తారని ఆయన ఆకాంక్షించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలోనే రాష్ట్రంతో పాటు జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. ఎస్సీ,ఎస్టీ, బీసీలతో పాటు అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందేలా..., ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలని పాలనచేసి చూపించిన ఘనత దేశంలోనే ఒక్క వైఎస్‌కే దక్కిందన్నారు. సంక్షేమ పథకాలతో వైఎస్ తెలంగాణ ప్రజలను కూడా ఆకర్షితులను చేశారన్నారు. ఇదే స్ఫూర్తితో వైఎస్ తనయుడిగా జగన్మోహన్రెడ్డికి అన్ని ప్రాంతాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. వైఎస్‌ను జిల్లా ప్రజలు తమ గుండెల్లో పెట్టుకొని దీవిస్తున్నారనడానికి ఇటీవల జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలే నిదర్శమన్నారు. కమ్యూనిస్టుల నినాదమైన దున్నేవాడికే భూమిని ఇచ్చిన మహనీయుడు వైఎస్.రాజశేఖరరెడ్డి అని కొనియాడారు. గిరిజనులు ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న పోడు భూములపై వారికి హక్కులు కల్పించి.. హక్కు పత్రాలు ఇచ్చిన ఘనత వైఎస్ఆర్కే దక్కిందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభంజనాన్ని అడ్డుకోలేరు.. సంక్షేమ పథకాలతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖరరెడ్డి ప్రజల మనిషిగా చిరస్థాయిగా నిలిచారని, అందుకే వైఎస్సార్సీపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పొంగులేటి అన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలు ముందే వస్తే వైఎస్సార్సీపీ సత్తా ఎంటో తెలిసేదన్నారు. జిల్లాలో జెడ్పీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడంతో పాటు ఎక్కువగా ఎంపీపీ స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంటుందని పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం తప్పదని, పంచాయతీ ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయన్నారు. ప్రజలు ఆశీర్వదిస్తే నామా నాగేశ్వరరావు కన్నా భిన్నంగా, నిస్వార్థంగా, ప్రజా సేవే లక్ష్యంగా జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని పొంగులేటి హామీ ఇచ్చారు. తాను వైఎస్సార్సీపీలోకి వచ్చిన 14 నెలల్లో జిల్లాలో అన్ని గ్రామాల్లో తిరిగానన్నారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ బలంగా ఉందని, ఈ ప్రభంజనాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరన్నారు. జలయజ్ఞం ప్రాజెక్టుల పూర్తికి కృషి.. జలయజ్ఞంలో జిల్లాకు మంజూరైన సాగునీటి ప్రాజెక్టు పనుల పరిస్థితి ఎక్కడవేసిన గొంగళి అక్కడే చందంగా మారిందన్నారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి అయ్యేందుకు, బయ్యారంలో స్టీల్ పరిశ్రమ ఏర్పాటుకు కూడా కృషి చేస్తానన్నారు. అలాగే జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేలా కృషి చేస్తానన్నారు. అంతేకాకుండా ఏజెన్సీ వాసుల కలనెరవేర్చేందుకు ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న గిరిజన, మైనింగ్ యూనివర్శిటీలు, మాటలకే పరిమితమైన కొవ్వూరు రైల్వే లైన్ కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానన్నారు. పోలవరం నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ ఇచ్చి వారిని తెలంగాణలోనే ఉంచేందుకు గిరిజనులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు జగన్ సీఎం అయితే నిర్వాసితులకు న్యాయం చేసేందుకు వైఎస్సార్సీపీ బాధ్యతగా తీసుకుంటుందన్నారు. అలాగే ఖమ్మంలో జర్నలిస్టుల, నిరుపేదల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరిస్తానన్నారు. నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది.. ఆర్థికంగా నామాకు.. తనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని పొంగులేటి పేర్కొన్నారు. రూ. 2 కోట్లు ఉన్నా, లక్ష కోట్లు ఉన్నా కోటీశ్వరుడే అంటారన్నారు. డబ్బులు ఉంటే సరిపోదని, జనబలం, ప్రజల విశ్వసనీయత ఉంటేనే రాజకీయ నాయకుడవుతారన్నారు. కానీ డబ్బులుంటే రాజకీయనాయకుడవుతారన్నది అవివేకమన్నారు. గత ఐదేళ్లలో నామా నాగేశ్వరరావు తన ఎంపీ ల్యాడ్స్ నిధులు ఖర్చు చేయకుండా చివరి రోజుల్లో ఎన్నికలను దృష్టి పెట్టుకొని ఖర్చు చేశారని, ఇది ప్రజలు గమనించాలని ఆరోపించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నామా తుంగలో తొక్కి బీజేపీతో పొత్తుతో మళ్లీ ఓట్ల కోసం వస్తున్నారని, ప్రజలు ఆయనకు తగిన గుణపాఠం చెప్పాలని పొంగులేటి పిలుపునిచ్చారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు కూరాకుల గోపి అధ్యక్షతన జరిగిన ఈ ‘మీట్‌ది ప్రెస్’కు ఉపాధ్యక్షులు గోగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సంధానకర్తగా వ్యవహరించారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు కట్టెకోల రాంనారాయణ, ఏనుగు వెంకటేశ్వర్లు, ప్రెస్‌క్లబ్ కార్యదర్శి మురళీకృష్ణ, కోశాధికారి వేణు పాల్గొన్నారు. -
మధుకాన్ అంటే మోసం
నామా ప్రాజెక్టులు కాంట్రాక్టులు తీసుకుని కట్టకుండా పారిపోతాడు జార్ఖండ్‌లో హైవే నిర్మాణం కోసం నేనే చాలాసార్లు ఫోన్ చేశాను పోలవరం నిర్వాసితులెవరినీ బలవంతంగా ఖాళీ చేయించం బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, మరోచోట మైనింగ్ వర్శిటీ ఏర్పాటు చేస్తాం విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి జైరాం రమేశ్ సాక్షి ప్రతినిధి, ఖమ్మం : ‘ఇక్కడ టీడీపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు పోటీచేస్తున్నారు. ఆయన స్థాపించిన ‘మధుకాన్’ కంపెనీలో మధు లేదు.. కాన్ మాత్రమే ఉంది.. కాన్ అంటే మోసం.. మధుకాన్ అంటేనే మోసం.’ అని కేంద్ర మంత్రి జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. మధుకాన్ అధినేత నామా నాగేశ్వరరావు చాలా రాష్ట్రాల్లో ప్రాజెక్టులు కడతానని కాంట్రాక్టులు తీసుకుని.. కట్టకుండా పారిపోతుంటాడని ఆయన అన్నారు. మంగళవారం జిల్లాలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన జైరాంరమేశ్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అస్సాం, జార్ఖండ్ లాంటి చాలా రాష్ట్రాల్లో నామా ప్రాజెక్టులు కట్టకుండా పారిపోయాడని ఎద్దేవా చేశారు. జార్ఖండ్‌లో హైవే నిర్మాణం కోసం తానే చాలా సార్లు నామాకు ఫోన్‌చేశానని, 10 రోజుల క్రితం కూడా ఫోన్ చేసి హైవే పని పూర్తిచేయాలని కోరానని, అయినా నామా ప్రాజెక్టులు కట్టడని అన్నారు. జిల్లాలోని బయ్యారం ఇనుప ఖనిజాన్ని ఉక్కుగా చేసేందుకు స్టీలు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆరునెలల్లో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నివేదికను తయారుచేస్తామని, ఆ తర్వాత పరిశ్రమను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుతో జిల్లాలోని యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులయ్యే జిల్లాకు చెందిన 45వేల కుటుంబాలకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని చెప్పారు. బలవంతంగా ఎవరిని ఒక ప్రాంతం నుంచి తరలించబోమని, అందరి ఆమోదం మేరకు పునరావాసం కల్పిస్తామని చెప్పారు. వీరందరికీ నూతన పాలసీ ప్రకారం పునరావాసం కల్పించే బాధ్యతను కేంద్రమే తీసుకుంటుందని చెప్పారు. భద్రాచలం, పాల్వంచ డివిజన్లలోని కొన్ని గ్రామాలను సీమాంధ్రలో కలిపామని, అయితే, 1959కి ముందు కూడా భద్రాచలం డివిజన్ కూడా తూర్పుగోదావరి జిల్లాలోనే ఉండేదని, ఇప్పుడు తాము కొత్తగా చేస్తున్నదేమీ లేదని అన్నారు. పోలవరం కారణంగా ఖమ్మం జిల్లాలో ముంపునకు గురయ్యే ప్రాంతాలకు సంబంధించి గ్రామాలను సీమాంధ్రలో కలిపే అంశం మాత్రమే బిల్లులో ఉందని, కానీ మండలాలను కలిపే అంశంలో మాత్రం ఆర్డినెన్స్ తీసుకురావాల్సి ఉందని, కేంద్రంలో ఏర్పడబోయే నూతన ప్రభుత్వం దీనిని తీసుకువస్తుందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును కేంద్ర జలసంఘం క్లియర్చేసిందని, ఈ ప్రాజెక్టు డిజైన్ మార్పు చేసే అంశం సీడబ్ల్యూసీ, కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించినదని అన్నారు. తెలంగాణ ఏర్పాటయిన తర్వాత ఖమ్మం జిల్లాలో మైనింగ్ యూనివర్శిటీని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు మాట్లాడుతూ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలంగాణ యువతకు ఓ స్వప్నాన్ని ఆవిష్కరించారని, ఆ స్వప్నం ఖమ్మం నుంచే ప్రారంభమవుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ లాగే బీసీలకు, మైనార్టీలకు కూడా సబ్‌ప్లాన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. విలేకరుల సమావేశంలో రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి, ఖమ్మం అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్, జిల్లా పార్టీ ఇన్చార్జి జెట్టి కుసుమకుమార్, టీపీసీసీ అధికార ప్రతినిధి లోకేశ్‌యాదవ్, జిల్లా సమన్వయ కమిటీ సభ్యులు పరుచూరి మురళీ కష్ణ, వీవీ అప్పారావు, పులిపాటి వెంకయ్య పాల్గొన్నారు. -
నామా..గోబ్యాక్
సాక్షి, ఖమ్మం: తెలుగుదేశం పార్టీలో వర్గపోరు రోడ్డెక్కింది. టికెట్ కేటాయింపు విషయంలో తమ నేతకు అన్యాయం చేశారని ఆరోపిస్తూ ఎంపీ నామానాగేశ్వరరావును ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ వర్గీయులు అడ్డుకుని దూషణకు దిగారు. బాలసాని ఇంటికి వచ్చిన నామాను లోపలికి వెళ్లకుండా అటకాయించగా....ఎట్టకేలకు నామా లోపలికి వెళ్లి గంటసేపు ఇంట్లో కూర్చున్నా బాలసాని కలవకపోవడంతో తీవ్రపరాభవంతో వెనుదిరిగారు. బుధవారం జరిగిన ఈ సంఘటనలకు సంబంధించి వివరాలు... కొత్తగూడెం అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తనకు టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి.. కొత్తగూడెం నియోకజవర్గ ఇన్చార్జి కోనేరు సత్యనారాయణ(చిన్ని)కి బీ-ఫాం ఇవ్వడంతో బాలసాని లక్ష్మీనారాయణ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఈ విషయమై బుధవారం ఉదయం 10 గంటలకు తన ఇంట్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అప్పటికే వందలాది మంది బాలసానిఅనుచరులు తమ నాయకునికి అన్యాయం జరిగిందంటూ అక్కడికి చేరుకొని నినాదాలు చేశారు. విలేకరుల సమావేశం ముగుస్తున్న సమయంలో....నామా తన నామినేషన్ కార్యక్రమానికి ఆహ్వానించేందుకు బాలసాని ఇంటికి వచ్చారు. ఆయన వెంట ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మద్దినేని స్వర్ణకమారి కూడా ఉన్నారు. వీరు బాలసాని ఇంటిముందు వాహనం నిలపగానే బాలసాని వర్గీయులు ఆగ్రహంతో ఊగిపోయారు. నామా డౌన్‌డౌన్ అంటూ తీవ్ర స్థాయిలో నినాదాలు చేశారు. అప్పటికే బాలసాని విలేకరుల సమావేశంలో నామాపై ఆగ్రహంతో మాట్లాడడంతో ఆయన అనుచరులు ఆవేశంతో ఉన్నారు. ఇదే సమయంలో నామా ఆయన ఇంటికి రావడంతో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. నామాను ఇంట్లోకి రానివ్వకుండా బాలసాని అనుచరులు గేట్లు వేశారు. దీంతో నామా వెంట వచ్చిన నేతలు.. బాలసాని అనుచర నేతలు గేటు తీసే విషయంలో ఘర్షణకు దిగారు. ‘ఎంపీ డౌన్‌డౌన్.. నిన్ను గెలవనివ్వం, నామా గ్యోబాక్, బీసీలు లేకుండా ఎలా గెలుస్తారో చూస్తాం.. వెన్ను పోటు పొడుస్తావా..?’ అంటూ నామాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాయడానికి వీలు లేని పదజాలంతో దూషించారు. చివరకు గేటు తీయాలని కార్యకర్తలను బాలసాని వారించడంతో నామా ఆయన ఇంట్లోకి వచ్చి కూర్చున్నారు. అయితే తన ఇంట్లో విలేకరుల సమావేశం వద్ద ఏర్పాటు చేసిన ప్రాంగణం నుంచి నామాను కలిసేందుకు బాలసాని వెళ్లడానికి ప్రయత్నించినా.. ‘మీరు ఆయనను కలవడానికి వెళ్లొద్దు.. బీసీల పరువు తీయొద్దు’ అంటూ బాలసానిని అతని అనుచరులు అడుగు కదలనివ్వలేదు. అవమానంతో వెనుదిరిగిన నామా.. గంటపాటు ఇంట్లో కూర్చున్నా బాలసాని తన దగ్గరకు రాకపోవడంతో నామా వెనుదిరిగి పోయారు. మధ్యవర్తులుగా ఉన్న నేతలు బాలసానిని మీదగ్గరకు కార్యకర్తలు రానివ్వడం లేదని చెప్పడంతో ఆయన అవమానంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. నామా వెళ్తుతున్న సమయంలోనూ బాలసాని అనుచరులు ‘నామా గోబ్యాక్, నిన్ను గెలవనివ్వవం’ అంటూ నినాదాలను మిన్నంటించారు. బాలసాని ఇంటికి నామా వచ్చారని, అక్కడ ఇరువురు నేతల అనుచరుల మధ్య వాగ్వాదం జరుగుతోందని తెలుసుకొని పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు అక్కడి చేరుకున్నారు. అయితే పలువురు ‘టికెట్ బాలసానికి ఇచ్చారు కదా...గొడవెందుకని అసలు విషయం తెలియక మాట్లాడారు. రాత్రికి రాత్రే సీన్ మారిన విషయం కార్యకర్తలకు తెలియక తికమక పడ్డారు. బాలసానికి టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి.. బీ-ఫాం కోనేరు సత్యనారాయణకు ఇచ్చారన్న విషయం తెలుసుకొని అక్కడికి వచ్చిన వారంతా కూడా నామాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీసీలను అణగదొక్కుతున్నారు.... టీడీపీ బీసీల పార్టీ అని, బీసీని సీఎం చేస్తానని, వంద సీట్లు బీసీలకు ఇస్తామని పార్టీ నేత ప్రకటిస్తే జిల్లాలో మాత్రం నాయకులు బీసీలను అణగదొక్కుతున్నారని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ విమర్శించారు. ‘ఖమ్మం జిల్లాలో 12 లక్షల మంది బీసీలున్నారు.. బీసీలకు ఒక్క సీటు ఇవ్వకుండా, మైకు పట్టుకొని వారి ఓట్లను నేను ఎలా అడగాలి.. వారికి ఏం సమాధానం చెబుతారు. నాకు కాకపోతే బీసీలైన నాగప్రసాద్, పంతంగి వెంకటేశ్వర్లు, వల్లంకొండ వెంకట్రామయ్య ఎవరికైనా టికెట్లు ఇవ్వవచ్చు కాదా.. నీ వెంట ఉండి, నిన్ను నమ్మిన వారికి కూడా టికెట్ ఇవ్వకుండా బీసీలను అవమానించారు. ఇప్పుడు బీసీలకు ఏం సమాధానం చెబుతారు’ అని ఆయన నామాపై ధ్వజమెత్తారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...చంద్రబాబు తనకు టికెట్ ఇస్తే రాత్రికిరాత్రే నామా నాగేశ్వరారావు కోనేరు చిన్నికి బీ-ఫాం తీసుకొచ్చి జిల్లాలో బీసీలను అవమానించారని మండిపడ్డారు. ‘పార్టీపై నీ పెత్తనం ఏంటీ, నీ జేబు సంస్థ అనుకున్నావా’అంటూ ఘాటుగా విమర్శించారు. ఎంపీగా నామినేషన్ వేస్తూ బీసీకి వచ్చిన సీటు ఆపడం ఎంతవరకు న్యాయమని బాలసాని ప్రశ్నించారు. బీసీలకు టికెట్ ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్తే మీకే నష్టం అన్నారు. పాలేరులో నాలుగు మండలాలు ఒకే సామాజిక వర్గం వారికి బాధ్యతలు ఇచ్చారని కార్యకర్తలు మొత్తుకున్నా పరిస్థితి మారలేదన్నారు. ఆర్థిక బలంతో వచ్చి పార్టీని నాశనం చేస్తున్నారని.. మీ వైఖరి మార్చుకోవాలని నామాను ఆయన హెచ్చరించారు. బీసీలకు అన్యాయం జరగడంతో ఈ ఎన్నికల్లో 30వ తేదీ వరకు తాను ఎక్కడికి ప్రచారానికి వెళ్లనన్నారు. చంద్రబాబు వచ్చినా ఆయనను మర్యాదపూర్వకంగా కలుస్తానే తప్ప.. ప్రచారానికి వెళ్లనని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఆయన వెంట బీరెడ్డి నాగచంద్రారెడ్డి, శెట్టి రంగారావు, చింతనిప్పు కృష్ణచైతన్య, బుడిగం శ్రీను ఉన్నారు. -
టీడీపీ తొలిజాబితాలో జిల్లా ఊసే లేదు
సాక్షి, ఖమ్మం: తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన అభ్యర్థుల తొలి జాబితాలో జిల్లాకు చోటు దక్కలేదు. ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావుల మధ్య ఉన్న ఆధిపత్య పోరుతో జిల్లా జాబితాను ప్రకటించేందుకు పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సాహసించలేదు. ఖమ్మం పార్లమెంటు, అసెంబ్లీ, పాలేరు అసెంబ్లీ స్థానాలపై మా మాట నెగ్గాలంటే.. మా మాట నెగ్గాలని ఇరువురు నేతలు పట్టుతో ఉండడంతో ఈ సీట్లపై సందిగ్ధత నెలకొంది. తెలంగాణలో టీడీపీ తరఫున బరిలోకి దిగుతున్న అభ్యర్థుల తొలిజాబితాను పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సోమవారం ప్రకటించారు. ఇందులో 27 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. పొరుగున ఉన్న వరంగల్, నల్లగొండ జిల్లాల్లో పలు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినా జిల్లాలో మాత్రం ఒక్క అభ్యర్థిని కూడా తొలి జాబితాలో ప్రకటించలేదు. ఇక్కడి నేతల మధ్య సయోధ్య కుదరకపోవడంతోనే తొలి జాబితాలో జిల్లా అభ్యర్థుల పేరు ఎక్కలేదని సమాచారం. ఒకపక్క తమ అనుచరులకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ... పైకిమాత్రం అంతా అధిష్టానం చూసుకుంటుందని చెబుతున్నా .. నామా, తుమ్మల ఒకరిపై మరొకరు ఆగ్రహంగా ఉన్నట్లు ఆపార్టీ క్యాడర్ చర్చించుకుంటోంది. తుమ్మల పాలేరు పయనమయ్యేందుకు సిద్ధం కాగా... అక్కడ తన అనుచరురాలు మద్దినేని బేబిస్వర్ణకుమారికి టికెట్ ఇవ్వాలని నామా పట్టుబడుతున్నారు. అంతేకాకుండా ఒక అడుగు ముందుకేసి ఆమెతో వ్యూహాత్మకంగా నామినేషన్ పత్రాలు తీయించారు. రెండు రోజుల క్రితం నామా పరోక్షంగా తుమ్మలపై చేసిన వ్యాఖ్యలతో ఏకంగా ఎంపీ స్థానానికి పోటీ చేయాలని తుమ్మల వర్గం ఎత్తుకు పై ఎత్తు వేసింది. తాను పాలేరుకు వెళ్తే ఖమ్మం అసెంబ్లీ స్థానాన్ని తన అనుచరుడు ఎమ్మెల్సీ బాలసానికి ఇప్పించాలన్న యోచనలో తుమ్మల ఉన్నారు. ఈ స్థానానికి కూడా నామా తన అనుచర అభ్యర్థిగా మరోనేతకు ఇవ్వాలని పట్టుబడుతుండడం తుమ్మల వర్గానికి ఆగ్రహం తెప్పిస్తోంది. నామా పెత్తనానికి చెక్ పెట్టేదిశగా తుమ్మల అడుగులు వేస్తుండగా.. ఇదే స్థాయిలో తుమ్మల వర్గాన్ని ఈ ఎన్నికలతోనే నిలువరించాలన్న యోచనలో నామా కూడా సీట్ల విషయంలో తన పంతం నెగ్గించుకోవాలన్న బెట్టుతో ఉన్నారు. తమ్ముళ్లలో టెన్షన్.. టెన్షన్.. జిల్లాలో పార్టీకి ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్నా వారిలో ఒక్కరికి కూడా తొలి జాబితాలో చోటు దక్కకపోవడంతో.. ఏంజరుగుతుందోనని తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు. నామినేషన్‌కు మరో రెండు రోజులే గడువు ఉండడంతో ఆశావాహులతో పాటు ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తల్లో టెన్షన్ నెలకొంది. తమ నేతకు ఎక్కడ టికెట్ ఇస్తారు..? టికెట్ల విషయంలో ఎవరిది పై చేయి అవుతుంది..? అని ఇరువర్గాల నేతలు చర్చించుకుంటున్నారు. తమ నేతలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని అనుచర నాయకులు తాడోపేడో తేల్చుకునేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలిసింది. బీజేపీతో పొత్తును విభేదిస్తూ.. ఒకపక్క నేతల విభేదాలతో సతమతమవుతున్న తెలుగుదేశం పార్టీకి మరో కొత్త సమస్య వచ్చిపడింది. బీజేపీతో పొత్తు పెట్టుకోవడాన్ని ఆపార్టీలోని మైనార్టీ నేతలు తీవ్రంగా విభేదిస్తున్నారు. తమ మనోభావాలకు వ్యతిరేకమైన పార్టీతో ఎలా పొత్తు పెట్టుకుంటారని వారు భగ్గుమంటున్నారు. పార్టీ ఒంటెత్తు పోకడలను నిరసిస్తూ కొంతమంది నేతలు రాజీనామా బాటలో ఉన్నట్లు సమాచారం. బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీకి తగిన గుణపాఠం చెప్పేందుకు ఈ ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపాలన్న దిశగా మైనార్టీ నేతలు అడుగులు వేస్తున్నారు. పార్టీలో మైనార్టీలకు అన్యాయం జరుగుతోందని నిరసిస్తూ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు బడే సాహెబ్ ఖమ్మం అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ జెండాలను మోసేందుకే తమను ఉపయోగించుకుంటున్నారని, టికెట్ల విషయంలో తమకు మొండిచేయి చూపుతున్నారని ‘సాక్షి’ ఎదుట ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
తుమ్మల ఏం చేస్తారో?
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తెలుగుదేశం పార్టీ జిల్లా కీలకనేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజకీయంగా ఎలాంటి అడుగులు వేయబోతున్నారనేది ఇటు టీడీపీ శ్రేణుల్లో, అటు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాల కారణంగా చాలా కాలంగా మౌనంగా ఉంటున్న ఒకప్పటి టీడీపీ లెజెండ్ ఇప్పుడు ఏం చేస్తారన్నది చర్చనీయాంశమవుతోంది. పార్టీ అధినేత చంద్రబాబు విశ్వసించే అతితక్కువ మంది నాయకుల్లో ఒకడిగా ఉన్న తుమ్మల... మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో క్రమంగా ఆయనకు దూరమయ్యారనే చర్చ పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది. నామాతో ఎన్ని విభేదాలు వచ్చినా... తన వర్గానికి చెందిన నేతలను, తనను అణగదొక్కేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా తుమ్మల ఇన్నాళ్లూ మౌనంగానే ఉన్నారని, ఇక ఎన్నికలు దగ్గరపడుతున్న కారణంగా మళ్లీ ఇప్పుడు క్రియాశీలమవుతున్నారని ఆయన అనుచరగణం అంటోంది. ఇంతకాలం ఏం జరిగినా చూసీ చూడనట్లు వెళ్లిపోయిన మాజీ మంత్రి ఇప్పుడు ఘాటైన వ్యాఖ్యలే చేస్తుండడం గమనార్హం. అటు పార్టీలోని తన ప్రత్యర్థులను, ఇటు పార్టీ అధిష్టానాన్ని హెచ్చరించేందుకు కూడా సిద్ధపడ్డారు. ఈ పరిస్థితుల్లో ఎంపీ నామా నాగేశ్వరరావుతో ఉన్న విభేదాల కారణంగా పార్టీలోని ఓ వర్గానికి నాయకత్వం వహిస్తున్న తుమ్మల ఇప్పుడు ఏ స్టెప్ వేస్తారన్నదే జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్. నామానే టార్గెట్ తుమ్మల తాజా వ్యాఖ్యలు, చర్యలు ఆసక్తిని రేపుతున్నాయి. నామా ఆధిపత్యాన్ని సహించలేక అటు హైదరాబాద్‌లో, ఇటు ఖమ్మంలో జరిగిన పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి సమావేశాలకు డుమ్మా కొడుతూ, తన అనుచరుల చేత కూడా ఆయన డుమ్మా కొట్టించి నిరసన తెలియజేశారు. ఇటీవల తె లంగాణస్థాయిలో జరిగిన పార్టీ సమావేశానికి కూడా ఆయన వెళ్లలేదు. ఆ తర్వాత పాలేరు నియోజకవర్గంలో పర్యటించారు. మళ్లీ ఖమ్మం నియోజకవర్గ సమన్వయ సమావేశం పేరుతో ఆయన పూర్తిస్థాయిలో తెరపైకి వచ్చారు. వచ్చిందే తడవుగా తన ప్రత్యర్థి నామా నాగేశ్వరరావుపై పరోక్షంగా మాటల తూటాలు పేల్చారు. పదవుల కోసం వచ్చిన వారి వల్లే పార్టీ భ్రష్టుపడుతోందని ఆయన చేసిన వ్యాఖ్యలు నామా శిబిరంపై దాడిగానే చెప్పవచ్చు. తనను ఎన్టీఆర్ పిలిచి టికెట్ ఇచ్చారని, తానెప్పుడూ పదవుల కోసం పాకులాడలేదని చెప్పడం ద్వారా తన ప్రత్యర్థుల వ్యవహారశైలిని ఆయన తప్పుపట్టారు. అదేవిధంగా ఆయన అధిష్టానానికి కూడా హెచ్చరిక సంకేతాలను పంపారు. తనకు కార్యకర్తలే హైకమాండ్ అని, వారి మనోభావాలకు అనుగుణంగానే నడుచుకుంటానని చెప్పడం ద్వారా అవసరమైతే పార్టీ నుంచి దూరమయ్యేందుకు కూడా తాను వెనుకంజ వేయబోనని ఆయన స్పష్టం చేసినట్లయింది. మరోవైపు ఖమ్మం పట్టణంలో తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ అనుచరగణంతో భారీ ర్యాలీ నిర్వహించి ఆయన ఎన్నికల సందడిని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తుమ్మల తాజా వ్యాఖ్యలు, చర్యలపై జిల్లా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అధినేత తీరుపైనా గుర్రు... కాగా, పార్టీ అధినాయకుడి వ్యవహారశైలిపై కూడా తుమ్మల గుర్రుగానే ఉన్నారు. నామా వర్గానికే ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారని, తెలంగాణలోనే సీనియర్ నాయకుడినైన తనను విస్మరిస్తున్నారనే ఆవేదన ఆయనకు ఉందని అనుచరగణం చెపుతోంది. పార్టీ తెలంగాణ కమిటీని ఏర్పాటు చేసేందుకు బాబు ప్రయత్నిస్తుండగా, ఇందుకోసం కనీసం తుమ్మలను సంప్రదించలేదని తెలిసింది. పార్టీలో చాలా సీనియర్ నేతగా ఉన్న తనను సంప్రదించకపోవడం, కమిటీ ఏర్పాటులో నామాకు ప్రాధాన్యం లభిస్తుందని ప్రచారం జరుగుతుండడం ఆయనకు రుచించడం లేదు. ఇతర పార్టీలతోనూ మాట్లాడుతున్నారా? ఇన్నాళ్లూ తుమ్మల మౌనంగా ఉండడంతో పార్టీ శ్రేణుల్లో మరో రకమైన ప్రచారం కూడా జరిగింది. తెలుగుదేశం పార్టీలో తుమ్మల ఇమడలేకపోతున్నారని, అటు చంద్రబాబు, ఇటు నామాల వ్యవహార శైలి కారణంగా ఆయన ఈసారి ఎన్నికలలో ఉంటే మౌనంగా ఉంటారని, లేదంటే పార్టీ నుంచి వెళ్లిపోతారనే స్థాయిలో పుకార్లు వచ్చాయి. మరోవైపు తనకున్న సంబంధాలతో ఇతర పార్టీల నేతలతో కూడా ఆయన సంప్రదింపులు జరుపుతున్నారని, వచ్చే ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లో నామాకు అడ్డుకట్ట వేయాలనే ఆయన వ్యూహాత్మకంగా ఎత్తులు వేస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే, తుమ్మల నిజంగానే ఇతర పార్టీలతో సంప్రదింపులు జరిపారా? జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మూలస్తంభమయిన ఆయన పార్టీ నుంచి వెళ్లిపోతే పరిస్థితేంటి అనే అంశాలపై పార్టీ శ్రేణులు జోరుగానే చర్చించుకుంటున్నాయి. -
దేశాభివృద్ధికి పాటుపడే పార్టీలకు మద్దతు
సాక్షి, న్యూఢిల్లీ: అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతూ, దేశాన్ని అభివృద్ధిపథం వైపు నడిపించే పార్టీలకు తమ మద్దతు ఉంటుందని టీడీపీ నేత నామా నాగేశ్వరరావు అన్నారు. ఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీతో పొత్తు విషయమై అడిగిన ప్రశ్నకుఆయన పైవిధంగా బదులిచ్చారు. పొత్తులపై మాట్లాడడానికి ఇప్పుడు సమ యం కాదంటూనే బీజేపీ పేరు చెప్పకుండా అవి నీతిని వ్యతిరేకిస్తూ, దేశాన్ని, రాష్ట్రాలను అభివృద్ధి చేసే పార్టీలతో ముందుకు వెళ్తామన్నారు. వామపక్షాలతో కలుస్తారా? అని అడగ్గా.. ఆ విషయాలను తర్వాత మాట్లాడదామన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, సహా టీడీపీ నేతలపై వచ్చిన అవినీతి ఆరోపణలపై అడిగినప్పుడు.. అవన్నీ ఆరోపణలేనని, ఒక్కటి కూడా రుజువుకాలేదని బదులిచ్చారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు సంతృప్తికరంగా లేదని, 10 అంశాలను కలపాలని కోరుతామన్నారు. ప్రత్యేక సమావేశం, లేదా ఓటాన్ అకౌంట్లో తెలంగాణ బిల్లు వస్తుందని, తాము ఓటు వేస్తూనే, సీమాంధ్రకు కూడా న్యాయం చేయాలని పట్టుపడతామన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం దేశ సంపదను కొల్లగొట్టిందని, ఇప్పుడు అవినీతిపై ప్రధాని నీతులు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో మైనింగ్ మాఫియాపై తాము ప్రధానికి స్వయంగా పుస్తకాలు అందించినా ఎలాంటి చర్య లు తీసుకోలేదన్నారు. ప్రధానికి చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయాలన్నారు. అన్ని విషయాల్లో ప్రధాని విఫలమై గద్దె దిగేముందు రాహుల్ కోసం యువతకు సందేశం ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. లోక్‌సభలో ప్రజా సమస్యలపై ప్రధాని మన్మోహన్, రాహుల్ ఒక్కరోజు కూడా మాట్లాడలేదన్నారు. నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను ఓడించారని, 2014లో దేశం నుంచే పారద్రోలుతారన్నారు. -
నిరసనలు.. నిలదీతలు
సాక్షి, కొత్తగూడెం : ప్రభుత్వం ఆర్భాటంగా నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమానికి నిరసన సెగ తగులుతోంది. రెండేళ్ల తర్వాత ప్రభుత్వం ప్రజల వద్దకు వస్తుండడంతో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటోంది. నిలదీతలు.. నిరసనలు..లబ్ధిదారుల ఆందోళనలతో అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇళ్లు, ఇళ్ల స్థలాలు, రేషన్‌కార్డులు, పింఛన్లు, ఆరోగ్యశ్రీకోసం జిల్లాలో అర్హులైన లబ్ధిదారులు రెండో విడత రచ్చబండలో చేసుకున్న దరఖాస్తులపై అధికార యం త్రాంగం స్పందించకపోవడంతో ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మండలాలు, మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 52 రచ్చబండ సభలకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈనెల 11 నుంచి 18 వరకు పది సభలను అధికారులు నిర్వహించారు. టేకులపల్లి, వాజేడు, వీఆర్‌పురం, చింతూరు, గుండాల, సత్తుపల్లి, పినపాక, గార్ల, పాల్వంచ, కొణిజర్లలో ఈ సభలు ముగిశాయి. తొలిరోజు సభ నుంచే నిరుపేదల నిరసనలు హోరెత్తాయి. సంక్షేమ పథకాలు అమలు కావడం లేదంటూ లబ్ధిదారులు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులను నిలదీసి ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో రెండు విడతలుగా నిర్వహించిన రచ్చబండ సభల్లో 1,13,928 మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అలాగే పింఛన్ల కోసం 29 వేల మంది, రేషన్‌కార్డుల కోసం 65వేల పైచిలుకు నిరుపేదలు దరఖాస్తు చేసుకున్నా ఇప్పటి వరకు వారికి లబ్ధి చేకూర్చడంలో ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో ఈ సభలో ఇవే ప్రధాన సమస్యలుగా అర్హులైన వారు ప్రశ్నిస్తుండడంతో అధికారులు మౌనమే సమాధానం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ ప్రజాప్రజానిధులు మాత్రం గతంలో రచ్చబండల మాదిరి మళ్లీ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడానికి సిద్ధమవుతుండగా.. గతంలో దరఖాస్తుల సం గతి తేల్చాలని నిరుపేదలు ఎక్కడికక్కడ నిల దీస్తుండడంతో చేసేదేమీ లేక త్వరలో అందరికి లబ్ధి చేకూరుతుందని చెప్పుకుంటూ వేదిక దిగి పోతున్నారు. సభలకు ఆర్భాటంగా వస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు.. ఊహించని రీ తిలో వస్తున్న నిరసనలను చూసి త్వరగా సభలు ముగించుకుంటూ మమ అనిపిస్తున్నా రు. సంక్షేమ పథకాల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి కూడా ఈ సభల్లో అవకా శం ఇవ్వడం లేదు. కొన్నిచోట్ల పోలీసు బం దో బస్తుతో సభలు నిర్వహించి ప్రజాసమస్యల ను ప్రభుత్వం పక్కన పెడుతుండడం గమనార్హం. కన్నెర్ర చేస్తున్న రైతన్న ఇటీవలి తుపానుతో అపారనష్టం జరిగి పంటలు చేతికందకుండాపోయినా ప్రభుత్వం కన్నెత్తి చూడలేదని, అలాంటిది ఈ సభలెందుకని రైతులు నిరసనగళం వినిపిస్తున్నారు. గతంలో పంట నష్టం జరిగినా ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదని, ఇప్పుడు సభలు పెట్టిం ఏంచేస్తారని అధికారులను ప్రశ్నిస్తున్నారు. సోమవారం కొణిజర్లలో రైతులు ఇదే విషయమై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని, తుపానుతో నష్టపోయిన పంటలకు సంబంధించి తక్షణమే నష్టపరిహారం అందించాలంటూ రైతులు ఆందోళన చేశారు. ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజలకు ఒరిగేది ఏమీ లేదంటూ రైతులు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇలా రైతుల నుంచి నిరసనలు ఎదురవుతుండడం, ఇంకా 42 సభలు ఉండడంతో ఏం సమాధానం చెప్పాలో అని అధికారులు తలపట్టుకుంటున్నారు. టీడీపీ నేతల ఫ్లెక్సీల జగడం.. ప్రజా సమస్యలు విని, అధికార పక్షాన్ని ప్రశ్నించాల్సిన ప్రధాన ప్రతిపక్ష నేతలు రచ్చబండ సభల్లో తమ పార్టీ ప్రజాప్రతినిధుల ఫోటోలు పెట్టడం లేదంటూ అధికారులతో జగడం చేస్తున్నారు. కొణిజర్లలో నిర్వహించిన రచ్చబండ సభ వేదిక పై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎంపీ నామా నాగేశ్వరరావు ఫోటో పెట్టలేదని.., సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ మండల నాయకులు వేదికపై బైఠాయించి నిరసన తెలిపారు. అలాగే పాల్వంచ రచ్చబండ సభ ఫ్లెక్సీలో నామా ఫోటోలేదని టీడీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. సమైక్యవాదం వినిపిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఫ్లెక్సీని తొలగించాలని పాల్వంచలో టీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టడంతో వారిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.