సాక్షి,ఖమ్మం జిల్లా: సత్తుపల్లిలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ నామా నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను రైతు బిడ్డని, చిన్నప్పటి నుంచి కష్టాలు చూసినవాడిని.. తెలంగాణా రాకముందు బ్రతుకు దెరువు కోసం వలసలు ఉండేవని గుర్తు చేశారు’. 9 ఏళ్ళ కాలంలో అనేక పథకాలను కేసీఆర్ ప్రవేశ పెట్టారని వేలాది కోట్ల రూపాయలను పట్టణాల అభివృద్ధికి ఖర్చు చేశారని కొనియాడారు.
తెలంగాణ మీద కన్నుగుట్టి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఆపాలని కేంద్ర ప్రభుత్వం మాయ మాటలు చెబుతోందని ధ్వజమెత్తారు. ఒక ఎంపీని పిలవకుండా హైదరాబాద్‌లో కార్యక్రమాలు చేశారని మండిపడ్డారు. ప్రజా ప్రతినిధులను అవమాన పరిచేలా పొంగులేటి మాట్లాడటంపై అసహనం వ్యక్తం చేశారు. విమర్శించే ముందు చరిత్ర తెలుసుకోవాల్సిన మాట్లాడాల్సిన అవసరం ఉందని, ఇటువంటి పద్దతులు మార్చుకోవాలని హితవు పలికారు. కేసీఆర్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని ఫైర్ అయ్యారు. ఏ ఎన్నికలైన ఖమ్మం ప్రజలు సీఎంకు అండగా ఉంటారని పేర్కొన్నారు. అనేక సేవా కార్యక్రమాల చేస్తున్న పార్థ సారథి రెడ్డి పై బండి సంజయ్ విమర్శలు చేయటం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment