‘నామా’ పురాణం బట్టబయలు | story of 'Sakshi' is created sensation in both states on Ex MP Nama nageshwar rao | Sakshi
Sakshi News home page

‘నామా’ పురాణం బట్టబయలు

Published Sun, Oct 29 2017 1:23 AM | Last Updated on Fri, Aug 10 2018 8:31 PM

story of 'Sakshi' is created sensation in both states on Ex MP Nama nageshwar rao

సాక్షి, హైదరాబాద్‌: టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళను బ్లాక్‌మెయిల్‌ చేసిన ఉదంతం ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో సంచలనమైంది. నగ్న చిత్రాలున్నాయని, వాటిని బయటపెడతానని నామా బెదిరించడంపై హైదరాబాద్‌కు చెందిన మహిళ జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో నామా నాగేశ్వర్‌రావుతోపాటు ఆయన సోదరుడు సీతయ్యలపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీనిపై శనివారం ‘సాక్షి’ ప్రచురించిన కథనం రెండు రాష్ట్రాల్లో దుమారం రేపింది.

బాధ్యతాయుతంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధి మహిళ పట్ల వ్యవహరించిన తీరు మీడియాలో చర్చనీయాంశమ యింది. బాధిత మహిళ సుజాతా రామకృష్ణన్‌ కూడా నేరుగా మీడియా ముందుకు వచ్చారు. తనను నామా బెదిరించారని, అసభ్య పదజాలంతో దూషించారని, నగ్నచిత్రాలను బయటపెడతానని భయభ్రాంతులకు గురిచేశారని ఆవేదనను వెలిబుచ్చారు. నామా తనతో సంభాషించిన ఆడియోలను కూడా విడుదల చేశారు. మరోవైపు టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కూడా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. విలేకరులు అడిగిన ప్రశ్నకు ‘అదంతా వ్యక్తిగత వ్యవహారం.. పరిశీలిస్తాం.’ అని చెప్పి తేలిగ్గా కొట్టిపారేయడం గమనార్హం.

బాబు సమాధానం చెప్పాలి: సుజాత
బాధిత మహిళ సుజాతా రామకృష్ణన్‌ మీడియాతో మాట్లాడిన సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై తాను రెండు నెలల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేసినా కొందరు టీడీపీ నేతలు, మాజీ మంత్రులు కలసి కేసు నమోదు కాకుండా పోలీసులపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. తన కుమారుడిని ఓ రౌడీషీటర్‌తో బెదిరించారని, ఫిర్యాదు వెనక్కు తీసుకోవాలని చాలా ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. మహిళా సాధికారత కోసం పనిచేస్తానని చెబుతున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ విషయంపై స్పందించాలని డిమాండ్‌ చేశారు. మహిళలను లొంగదీసుకుని, బెదిరించే మనస్తత్వం ఉన్న నామాను పార్టీ పొలిట్‌బ్యూరోలో ఎలా కొనసాగిస్తారో బాబు సమాధానం చెప్పాలని, ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని కోరారు. 

త్వరలోనే నోటీసులు : ఈ ఉదంతంపై త్వరలోనే మాజీ ఎంపీ నామా నాగేశ్వర్‌రావుకు నోటీసులిచ్చి విచారణ జరుపుతామని జూబ్లీహిల్స్‌ పోలీసులు తెలిపారు. బాధిత మహిళ గతంలో రెండుసార్లు ఫిర్యాదు ఇచ్చిందని, అయితే, ఎలాంటి ఆధారాలు చూపనందున ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదన్నారు. తాజాగా ఫిర్యాదుతోపాటు ఆడియో, వీడియో ఆధారాలు ఇచ్చినందున వాటిని పరిశీలించి నామా, ఆయన సోదరుడు సీతయ్యపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. త్వరలోనే నోటీసులిచ్చి చట్టప్రకారం నామాను విచారిస్తామని చెప్పారు. మరోవైపు సుజాతా రామకృష్ణన్‌ వాంగ్మూలాన్ని జూబ్లీహిల్స్‌ పోలీసులు శనివారం నమోదు చేసుకున్నారు.  ఈ రికార్డు ఆధారంగానే నామాకు నోటీసులిచ్చి విచారణ జరపనున్నారు.

నా జీవితం తెరిచిన పుస్తకం
టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు
సాక్షి, అమరావతి:
తనపై సుజాత చేసిన ఆరోపణల మీద టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు స్పందించారు. టీటీడీపీ సమావేశంలో పాల్గొనేందుకు శనివారం విజయవాడ వచ్చిన ఆయన ఏపీ సీఎం క్యాంపు కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. తాను బ్లాక్‌ మెయిల్‌ చేసినట్లు ఎవరో ఆరోపించిన విషయం తనకు తెలిసిందని, అందుకే బయటకు వచ్చి మాట్లాడుతున్నానన్నారు. ఇంకా పూర్తి వివరాలు తనకు తెలియవని, తెలుసుకున్న తర్వాత మాట్లాడుతానన్నారు. తన జీవితం తెరిచిన పుస్తకమని, తాను ఎవరినీ బ్లాక్‌ మెయిల్‌ చేయలేదన్నారు. నలుగురికీ సాయపడ్డానే తప్ప ఎవరినీ ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదన్నారు. సుజాత మీకు తెలుసా అని మీడియా ప్రతినిధులు అడిగినా స్పందించకుండా ఆయన వెళ్లిపోయారు.  

నామా, సుజాతల ఆడియో సంభాషణ ఇదీ...
సుజాత: ఎందుకు అరుస్తారు అసలు
నామా: సంబంధం లేదన్నాను. ఒకసారి చెప్పాను.. వందసార్లు చెప్పాను.. నువ్వు కావాలని చెప్పి చేయించి కాదంటావు.. ప్రామిస్‌ చేయమంటావు.
సుజాత: ఏమీ లేనప్పుడు ప్రామిస్‌ చేయడానికి ఏమైంది?
నామా: నువ్వెవరివే అసలు. నువ్వు నా గురించి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు.. నా మీద కాన్ఫిడెన్స్‌ లేనప్పుడు నాతో మాట్లాడకు అని వందసార్లు చెప్పా.  నాతో మాట్లాడకు. అంతే.. ఒకటే మాట. నువ్వు ఇంత చిల్లర (బూతు మాట).. కాబట్టి డ్రైవర్ల దగ్గర ఎంక్వైరీ చేయడమేనా.. ఇదేనా నీ పద్ధతి.
సుజాత: వాళ్లను అడిగితే లేని విషయాలు బయటకు వస్తాయా?
నామా: ఏంటే... నువ్వు చిల్లర... కాబట్టి కథలు అల్లుతున్నావే. రోజుకో కథ అల్లి దొబ్బుతున్నావు. దొంగ (బూతు) ఒకసారి చెప్తారు.. రెండుసార్లు చెప్తారు... రోజూ  ఆట అయిపోయింది నీకు.. ఇది కాదే బ్లాక్‌మెయిల్‌?
సుజాత: ఎందుకు, నిజాన్ని అడగడం బ్లాక్‌మెయిలా?
నామా: నీ.....
సుజాత: నిజం అడిగితే బ్లాక్‌మెయిలా... నాకు చెప్పండి.. ప్రామిస్‌ చేస్తారా... లేదా?
నామా: ఈ మాట మాట్లాడకు. నాకు సంబంధం లేదని చెప్పాను.
సుజాత: అంటే.. లేనప్పుడు ఎందుకు ప్రామిస్‌ చేయవు?
నామా: (బూతు మాట) నాకు సంబంధం లేదంటే నీకేంటే ప్రామిస్‌ చేసేది... (బూతు మాట)
సుజాత: నువ్వెవరు నన్ను (బూతు మాట) అనడానికి
నామా: బూతుమాట
సుజాత: అంటే అది నిన్ను పెళ్లి చేసుకుందా.  అది పతివ్రతా.. అంటే నువ్వు దానికి తాళి కట్టావు. అంతే కదా.. అందుకే కదా అది నిన్ను మొగుడు అని చెప్పుకుంటుంది.
నామా: పద్ధతి ప్రకారం మాట్లాడు
సుజాత: నేను పద్ధతి ప్రకారమే మాట్లాడుతున్నా. అది నిన్ను మొగుడు అని ఎందుకు చెప్పుకుంటుంది? నీ గురించి మాట్లాడినప్పుడు హస్బెండ్‌.. హస్బెండ్‌ అని ఎందుకు చెప్తోంది..
నామా: అది ఎవరో నాకు తెలియదు. దాంతో నువ్వు (బూతు మాట)... ఆ సంగతులు నాతో మాట్లాడకు. నువ్వు తప్పుడు (బూతు మాట) కాబట్టి అలా చేస్తున్నావు.
సుజాత: అవును.. మరి నువ్వేంటి... నువ్వేంటి?
నామా: అది చిల్లర (బూతు మాట) కాబట్టి నాకు సంబం«ధం లేని విషయం అది
సుజాత: అంటే అది నిన్ను మొగుడని చెప్పుకోవచ్చా?
నామా: ఈ విధంగా బ్లాక్‌మెయిల్‌ చేయడం
సుజాత: ఏంటి బ్లాక్‌మెయిల్‌.... నువ్వు ఏమీ చేయనప్పుడు బ్లాక్‌మెయిల్‌ ఎందుకవుతుంది? నువ్వు ఏం తప్పు చేయనప్పుడు నీకు ఎందుకంత కోపం వస్తోంది?
నామా: మెస్సేజ్‌లు పెడతావు...బ్లాక్‌మెయిల్‌ చేస్తావు...
సుజాత: ఏం చేశాను.. ఏం ఫోటోలు పంపించాను.. ఏం పంపించాను
నామా: నా మాట మీద కాన్ఫిడెన్స్‌ లేనప్పుడు నాతో మాట్లాడకు. ఒకటే మాట.
సుజాత: అంటే నువ్వు దాంతో...?
నామా: ఏయ్‌..  పో... (బూతు మాట)
సుజాత: ఇవాళ మధ్యాహ్నం కూడా దానితో మాట్లాడావు.
నామా: నీ... (బూతు మాట) నాకు సంబంధం లేదని చెప్తున్నా.. పద్ధతిగా మాట్లాడు.
సుజాత: నేను ప్రూవ్‌ చేస్తే ఏం చేస్తావు ఇప్పుడు. ఇంతకుముందు ఒకసారి ఒప్పుకున్నావా లేదా దాంతో నీకుందని ఒప్పుకున్నావా లేదా?
నామా:  నువ్వొక... చూడు... ఇక మొదలుపెట్టానంటే... నువ్వు తలెత్తుకోకుండా చేస్తా.. నువ్వు మాట్లాడుతున్నావు చెప్తున్నా..
సుజాత: ఓకే...
నామా: చిల్లర మాటలు మాట్లాడకు.. చెప్తున్నా..
సుజాత: ఓకే చెయ్యి..
నామా: ఏమనుకుంటున్నావో నువ్వు...
సుజాత: ఏం చేస్తావు... నన్ను తలెత్తుకోకుండా చేస్తానన్నావు.. ఏం చేస్తావు.

రెండో ఆడియో టేపులోని సంభాషణలు..
నామా: నీకు నమ్మకం ఉంటే చెయ్యి... లేకపోతే లేదు.
సుజాత: నాకు నమ్మకం ఎలా ఉంటుంది... నీ మీద
నామా: పెట్టు
సుజాత: నువ్వు వాళ్లతో ఆడే డ్రామాలు వాళ్లతో ఆడుతున్నావ్‌... వాళ్లకేమో నా మీద పోలీస్‌ కంప్లైంట్‌ ఇవ్వమని చెప్తున్నావ్‌.
నామా: నువ్వు ఇదే మాట్లాడుతున్నావ్‌
సుజాత: సరే...నరేంద్ర నీకు తెలుసని ప్రూవ్‌ చేస్తే ఏం చేస్తావ్‌... జూలై నెలలో వాడు నీకు కాల్స్‌ చేశాడు.. నీవ్వు వాడితో మాట్లాడావని ప్రూవ్‌ చేస్తే ఏం చేస్తావ్‌?
నామా: తప్పు మాట్లాడుతున్నావ్‌. తప్పు మాట్లాడుతున్నావ్‌.
సుజాత: 2014 నీ కాల్స్‌ లిస్టు నా దగ్గర ఉందని నీకు తెలుసు కదా.
నామా: నువ్వు మొదలుపెట్టిందే మాట్లాడుతు న్నావ్‌.. ఇక దయచేసి నాకు ఫోన్‌ చెయ్యకు
సుజాత: ఓకే సరే అయితే
నామా: నువ్వు మారిపోతానంటే...
సుజాత: నువ్వు మారవా...
నామా: నువ్వు తప్పు మాట్లాడుతున్నావ్‌. వాళ్లతో మాట్లాడావ్, వీళ్లతో మాట్లాడావ్‌.. నాకు ఎవ్వరితో మాట్లాడే అవసరం లేదు. 
సుజాత: అవునా... నువ్వు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నావ్‌. నీ పొలిటికల్‌ కెరియర్‌ కోసం నన్ను విత్‌డ్రా చేసుకోమంటున్నావ్‌. అంతేగానీ..
నామా: నా పొలిటికల్‌ కెరీర్‌ గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. నా పొలిటికల్‌ కెరీర్‌ గురించి నువ్వు అడగొద్దు. నా పొలిటికల్‌ కెరీర్‌ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. అర్థమైందా..?
సుజాత: నా పర్సనల్‌ లైఫ్‌ గురించి మాత్రం నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు
నామా: తప్పులు మాట్లాడుతున్నావ్‌.. ఛండాలంగా మాట్లాడుతున్నావ్‌
సుజాత: అవునా...
నామా: కావాలని మాట్లాడుతున్నావ్‌... కావాలని చేస్తున్నావ్‌.. సమస్యే లేదు. ఇలాంటి చిల్లర పనులు నేను చెయ్యను. చేయబోను. కేసు విత్‌డ్రా చేసుకుని తర్వాత మాట్లాడు.
(ఇంతలోనే ఫోన్‌ కట్‌ అయిపోయింది) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement