ఆలేరు (నల్లగొండ) : నల్లగొండ జిల్లా ఆలేరులో ఆదివారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమయ్యారు. వరంగల్ జిల్లా పరకాల పట్టణానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బైక్‌పై హైదరాబాద్ వైపు వెళ్తుండగా..ఆలేరు సమీపంలో ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరూ కింద పడిపోయారు. అప్పుడే వెనుక నుంచి వచ్చిన డీసీఎం వారిద్దరితోపాటు బైక్ పైనుండి దూసుకెళ్లింది. దీంతో బైక్ నుంచి మంటలు చెలరేగి వారిద్దరూ అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. లారీ, డీసీఎం డ్రైవర్లు సంఘటనాస్థలం నుంచి పరారయ్యారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.