సర్వే కోసం వచ్చి ఇద్దరి మృతి | two peoples are dead, when coming to survey | Sakshi
Sakshi News home page

సర్వే కోసం వచ్చి ఇద్దరి మృతి

Published Wed, Aug 20 2014 1:57 AM | Last Updated on Sat, Sep 2 2017 12:07 PM

సర్వే కోసం వచ్చి ఇద్దరి మృతి

సర్వే కోసం వచ్చి ఇద్దరి మృతి

ముత్యాలమ్మకుంట (నేరేడుచర్ల) :  సమగ్ర కుటుంబ సర్వే కోసం స్వగ్రామాలకు వచ్చిన ఇద్దరు మృత్యువాత పడ్డారు. జిల్లాలోని బొమ్మలరామారం, నేరేడుచర్ల మండలాల పరిధిలో మంగళవారం చోటుచేసుకున్న ఘటనల వివరాలు.. మండలంలోని దిర్శిం చర్ల గ్రామ పంచాయతీ పరిధి ముత్యాలమ్మకుంటకు చెందిన కత్తి వెంకట్‌రెడ్డి(49) కొంత కాలంగా భార్య పిల్లలతో హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు.  సమగ్ర సర్వే నిమిత్తం హైదరాబాద్ నుంచి సో మవారం సాయంత్రం స్వగ్రామానికి బయలుదేరాడు. ముత్యాల మ్మకుంటకు రాత్రి చేరుకునే క్రమంలో ఊరి వెంట ఉన్న కాల్వ డ్రాఫ్ట్ మీద కూర్చున్నాడు.
 
ప్రమాదవశాత్తు డ్రాఫ్ట్‌పై భాగం నుంచి కాల్వలో పడడంతో తలకు బల మైన గాయం తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. వెంకట్‌రెడ్డి మృతిచెందిన సమయంలో కాల్వలో నీటి ప్రవాహం కూడా తక్కువగా నే ఉంది. మంగళవారం ఉదయం పోలాల వైపు వెళ్లిన రైతులు వెంకట్‌రెడ్డి మృతదేహం కనిపించడం తో అధికారులకు సమాచారం అం దించారు. సంఘటన స్థలాన్ని తహసీల్దార్ డి.సత్యనారాయణ, ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి సందర్శించి వివరాలు సేకరించారు. మద్యం మత్తులోనే ఈ ప్రమాదం చోటు చేసుకుని ఉంటుందని భావిస్తున్నారు.  మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మే రకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
 
మర్యాలలో గుండెపోటుతో...
మర్యాల(బొమ్మలరామారం) : సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనేందుకు వచ్చిన వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని మర్యాల గ్రామం లో మంగళవారం చోటు చేసుకుం ది. వివరాలు..  గ్రామానికి చెందిన వలబోజు క్రిష్ణాచారి(61)  కులవృత్తి  చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి ముగ్గురు కూతుళ్లు, కుమారుడు. ఇటీవల క్రిష్ణాచారి కుమారుడు శ్రీనివాస్ హైదరాబాద్‌లో పైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
 
కొన్ని రోజుల క్రితం వరకు ఉప్పల్‌లో తన కుమారుడి వద్ద ఉన్న క్రిష్ణాచారి మంగళవారం సమగ్ర కుటు ంబ సర్వేకోసం భార్య,సుగుణ, కుమారుడు శ్రీనివాస్‌తో కలిసి సోమవారం రాత్రి స్వగ్రా మం మర్యాలకు చేరుకున్నారు. మంగళవారం ఉదయం సైతం ఇరుగుపొరుగ వారిని ఆప్యాయంగా పలకరిం చిన క్రిష్ణాచారి ఉదయం 11గంటల ప్రాంతంలో భోజనం చేసిన అనంతరం ఛాతిలో నొప్పి వస్తుం దని ఇంటి అరుగుపై కుప్పకూలి పడిపోయాడు. భార్య సుగుణ  గమనించి ఆస్పత్రికి తరలించేలోపే  మృతిచెందాడు. దీంతో బాధిత కుటుంబంలో విశాదఛాయలు అలుముకున్నాయి. సర్వే కోసం వచ్చి కానరాని లోకాలకు పోయావా అంటూ కుటుంబ సభ్యుల రోదనలు గ్రామస్తులను కంటతడిపెట్టించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement