Integrated family survey
-
‘ఆసరా’ అయోమయం
సాక్షి, రంగారెడ్డి జిల్లా : సామాజిక పింఛన్ల పథకం(ఆసరా) అమలు ప్రక్రియ జిల్లా యంత్రాంగంలో తీవ్ర గందరగోళం సృష్టిస్తోంది. పరిశీలన ప్రక్రియ పూర్తిచేసి అర్హతను నిర్ధారించిన అధికారులకు తాజాగా పింఛన్ల పంపిణీ సంకటంగా మారింది. అర్హతను తేల్చి 2,05,940 మంది లబ్ధిదారుల వివరాలను ప్రభుత్వం రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేశారు. ఇక్కడే అసలు సమస్య వచ్చిపడింది. సమగ్ర కుటుంబ సర్వే వివరాలు, తాజా దరఖాస్తుల పరిశీలన వివరాలు ఏమాత్రం సరిపోలకపోవడంతో అర్హులుగా ఎంపికైన పలువురిని చివరకు అనర్హులుగా సాఫ్ట్వేర్ తేల్చడంతో యంత్రాంగం తలలు పట్టుకుంటోంది. జిల్లాలో ఆసరా పథకం కోసం 3,69,118 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల పరిశీలనకు ఉపక్రమించిన అధికారులు మొత్తంగా 2,37,443 మందిని లబ్ధిదారులుగా తేల్చారు. అనంతరం సాఫ్ట్‌వేర్‌లో వివరాల నమోదు చేపట్టిన అధికారులు.. ఇప్పటివరకు 2,05,940 మంది వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. ఈ వివరాలను ఎంపీడీఓ లాగిన్‌లోని సమగ్ర కుటుంబ సర్వే వివరాలతో సరిపోల్చితే అర్హుల కార్డుల తుది ఫార్మాట్ ప్రత్యోక్షమవుతుంది. ప్రస్తుతం వీరికి కార్డులు అందించిన తర్వాత పింఛన్ డబ్బులు ఇవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో కార్డులను ప్రింట్ తీసేందుకు సదరు వివరాలను సమగ్ర కుటుంబ సర్వే వివరాలతో మ్యాచ్ చేయగా.. అర్హులుగా నిర్ధారించిన పలువురు అనర్హులయ్యారు. ఇప్పటివరకు లక్ష మంది వివరాలను ప్రింట్ చేసేందుకు ప్రయత్నించగా.. దాదాపు 25వేల మంది అనర్హులుగా సాఫ్ట్వేర్ తేల్చడంతో అధికారులు జుట్టుపీక్కుంటున్నారు. నిలిచిన పింఛన్ల పంపిణీ.. జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఈనెల 8, 9 తేదీల్లో మండల కేంద్రాల్లో పింఛన్ లబ్ధిదారులకు కార్డులు పంపిణీచేసి పింఛన్లు ఇచ్చారు. ఇలా జిల్లావ్యాప్తంగా దాదాపు 10వేల మందికి ఇచ్చినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. మిగతా వారికి మరుసటి రోజునుంచి పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టగా.. సాఫ్ట్‌వేర్‌లో అర్హుల జాబితాలో తప్పులు చూపడంతో కార్డుల ముద్రణ నిలిపివేశారు. దీంతో కార్డుల ప్రింటింగ్ ముగిసిన తర్వాతే పింఛన్లు పంపిణీ చేయాలని భావించిన జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు.. పంపిణీ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ సమస్యపై మంగళవారం జిల్లాలోని అన్ని మండలాల అభివృద్ధి అధికారులు, మున్సిపల్ అధికారులతో అత్యవసర కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు డీఆర్డీఏ అధికారి ఒకరు ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
సర్వే కోసం వచ్చి ఇద్దరి మృతి
ముత్యాలమ్మకుంట (నేరేడుచర్ల) : సమగ్ర కుటుంబ సర్వే కోసం స్వగ్రామాలకు వచ్చిన ఇద్దరు మృత్యువాత పడ్డారు. జిల్లాలోని బొమ్మలరామారం, నేరేడుచర్ల మండలాల పరిధిలో మంగళవారం చోటుచేసుకున్న ఘటనల వివరాలు.. మండలంలోని దిర్శిం చర్ల గ్రామ పంచాయతీ పరిధి ముత్యాలమ్మకుంటకు చెందిన కత్తి వెంకట్‌రెడ్డి(49) కొంత కాలంగా భార్య పిల్లలతో హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. సమగ్ర సర్వే నిమిత్తం హైదరాబాద్ నుంచి సో మవారం సాయంత్రం స్వగ్రామానికి బయలుదేరాడు. ముత్యాల మ్మకుంటకు రాత్రి చేరుకునే క్రమంలో ఊరి వెంట ఉన్న కాల్వ డ్రాఫ్ట్ మీద కూర్చున్నాడు. ప్రమాదవశాత్తు డ్రాఫ్ట్‌పై భాగం నుంచి కాల్వలో పడడంతో తలకు బల మైన గాయం తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. వెంకట్‌రెడ్డి మృతిచెందిన సమయంలో కాల్వలో నీటి ప్రవాహం కూడా తక్కువగా నే ఉంది. మంగళవారం ఉదయం పోలాల వైపు వెళ్లిన రైతులు వెంకట్‌రెడ్డి మృతదేహం కనిపించడం తో అధికారులకు సమాచారం అం దించారు. సంఘటన స్థలాన్ని తహసీల్దార్ డి.సత్యనారాయణ, ఎస్ఐ రాజశేఖర్‌రెడ్డి సందర్శించి వివరాలు సేకరించారు. మద్యం మత్తులోనే ఈ ప్రమాదం చోటు చేసుకుని ఉంటుందని భావిస్తున్నారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మే రకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మర్యాలలో గుండెపోటుతో... మర్యాల(బొమ్మలరామారం) : సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనేందుకు వచ్చిన వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని మర్యాల గ్రామం లో మంగళవారం చోటు చేసుకుం ది. వివరాలు.. గ్రామానికి చెందిన వలబోజు క్రిష్ణాచారి(61) కులవృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి ముగ్గురు కూతుళ్లు, కుమారుడు. ఇటీవల క్రిష్ణాచారి కుమారుడు శ్రీనివాస్ హైదరాబాద్‌లో పైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం వరకు ఉప్పల్‌లో తన కుమారుడి వద్ద ఉన్న క్రిష్ణాచారి మంగళవారం సమగ్ర కుటు ంబ సర్వేకోసం భార్య,సుగుణ, కుమారుడు శ్రీనివాస్‌తో కలిసి సోమవారం రాత్రి స్వగ్రా మం మర్యాలకు చేరుకున్నారు. మంగళవారం ఉదయం సైతం ఇరుగుపొరుగ వారిని ఆప్యాయంగా పలకరిం చిన క్రిష్ణాచారి ఉదయం 11గంటల ప్రాంతంలో భోజనం చేసిన అనంతరం ఛాతిలో నొప్పి వస్తుం దని ఇంటి అరుగుపై కుప్పకూలి పడిపోయాడు. భార్య సుగుణ గమనించి ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందాడు. దీంతో బాధిత కుటుంబంలో విశాదఛాయలు అలుముకున్నాయి. సర్వే కోసం వచ్చి కానరాని లోకాలకు పోయావా అంటూ కుటుంబ సభ్యుల రోదనలు గ్రామస్తులను కంటతడిపెట్టించాయి. -
సమన్వయంతో పనిచేయాలి
ఖమ్మం జడ్పీసెంటర్ : అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో పనిచేసి సమగ్ర కుటుంబ సర్వేను విజయవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి అన్నారు. సర్వేపై ఆర్డీఓలు, తహశీల్దార్లు, గ్రామ ప్రత్యేకాధికారులతో కలెక్టరేట్ నుంచి కలెక్టర్ శనివారం వీడియోకాన్పరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ప్రసుత్తం సుమారు 8లక్షల 59 వేల కుటుంబాలు ఉన్నాయన్నారు. సర్వే పక డ్బందీగా జరిగేందుకు జిల్లాను 29,951 ఎన్యూమరేట్ బ్లాకులుగా విభజించినట్లు చెప్పారు. ఎన్యూమరేటర్లు ప్రతి కుటుంబంలో సరైన వివరాలు నమోదు చేసేలా గ్రామ, వార్డు ప్రత్యేకాధికారులు కృషిచేయాలన్నారు. గ్రామ ప్రత్యేకాధికారులు తమ పంచాయతీకి సంబంధించిన రేషన్‌కార్డులు, భూమి, గృహ సంబంధ వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. 19న ఉదయం 7గంటలకు సర్వే ప్రారంభమయ్యేలా చూడాలన్నారు. ఎన్యూమరేటర్ల అవసరమైన సామగ్రి ఒక రోజు ముందుగానే చేరేలా చూడాలన్నారు. ఏ ఇళ్లు ఏ బ్లాక్‌లో ఉన్నాయో ప్రత్యేకాధికారులు గమనించాలన్నారు. మహిళా ఎన్యూమరేటర్లకు అవసరమైన సౌకర్యాలు, భద్రతా విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఖమ్మం నగరం మినహామిగతా అన్ని చోట్ల స్టిక్కరింగ్ పూర్తి చేసినట్లు చెప్పారు. స్టిక్కరింగ్ లేని వారు సంబంధిత తహశీల్దార్లను సంప్రదించాలన్నారు. సర్వే సామగ్రి పంపిణీని ఈనెల 18లోగా పూర్తి చేయాలని సూచించారు. మున్సిపాలిటీలో సర్వే సజావుగా జరిగేందుకు ఆర్డీవోలు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఆస్పత్రిలో ఉన్న రోగులు, హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు, పుట్టింటికి వెళ్లిన గర్భిణులు సర్వే రోజు ఇంట్లో లేనిపక్షంలో వారికి సంబంధించిన వివరాలు, ధ్రువీకరణ పత్రాలు చూసి ఎన్యూమనేటర్లు వివరాలు నమోదు చేయాలన్నారు. ఉత్తమ ఎన్యూమరేటర్లకు నగదు ప్రోత్సాహకం, ప్రశంసాపత్రం అందిస్తామని ప్రకటించారు. వీడియోకాన్ఫరెన్సలో జేసీ సురేంద్రమోహన్, ఏజేసీ బాబూరావు, డీఆర్వో శివశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.