సైన్‌ప్లూ కలకలం..!
స్వైన్‌ఫ్లూ.. ఇప్పుడు జిల్లావాసులను వణికిస్తున్న వ్యాధి. ఈ సీజన్‌లో ఒకటి కాదు.. రెండుకాదు ఏకంగా ఏడు కేసులు నమోదయ్యాయి. నానాటికి వ్యాధి తీవ్రత పెరుగుతుండడంతో ప్రజలు బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం దీనిపై దృష్టి కూడా పెట్టకపోవడం జిల్లావాసులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ప్రతి పల్లెకూ వైద్యరంగాన్ని విస్తరిస్తామని.. ప్రతి జిల్లాలో కార్పొరేట్ స్థాయిలో ఆస్పత్రులను తీర్చిదిద్దుతామని చెబుతున్న ప్రభుత్వం జిల్లా ఆస్పత్రికి కనీసం స్వైన్‌ఫ్లూ మందులు కూడా పంపడం లేదు.
మహబూబ్‌నగర్ వైద్యవిభాగం
పాలమూరులో సైన్‌ఫ్లూ కలకలం రేగింది. మూడు రోజుల క్రితం ఓ వ్యక్తికి సైన్‌ప్లూ ఉన్నట్లు గుర్తించిన వైద్య సిబ్బంది అతడికి పరీక్షలు చేసి చికిత్సలు చేయడం మొదలెట్టారు. ఇది జరిగి మూడు రోజులు అయ్యిందో లేదో అదే కుటుంబంలో మరో నలుగురికి (తల్లి, కూతురు, కోడలు, బావ) సైన్‌ప్లూ వ్యాధి సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. మంగళవారం ఈ సంఘటన బయటపడడంతో పాలమూరు జిల్లా ఉలిక్కిపడింది. ఒకే కుటుంబంలో ఐదుగురికి వ్యాధి సోకడంతో.. మహబూబ్‌నగర్ పట్టణంలో ఇంకా ఎంతమంది ఈ వ్యాధి బారినపడ్డారోనని ఆందోళనకు పాలమూరు : జిల్లావాసులు స్వైన్‌ఫ్లూ వ్యాధిపట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ప్రస్తుతం ఈ వ్యాధిబారిన పడిన నలుగురు వ్యక్తులకు స్టేజ్-1 దశలో ఉందని, త్వరితగతిన వారు కోలుకునే అవకాశం ఉందని కలెక్టర్ జీడీ ప్రియదర్శిని పేర్కొన్నారు.
అయిదుగురికి స్వైన్‌ఫ్లూ సోకిన నేపథ్యంలో సత్వర వైద్యచర్యలు చేపట్టడంతోపాటు ఇతరులకు ఈ వ్యాధి సోకకుండా ముందస్తు చర్యలు చేపట్టేందుకుగాను వైద్యాధికారులు, ఇతర అధికారులతో మంగళవారం తన కార్యాలయంలో కలెక్టర్ అత్యవసర సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లుకు తిరుపతి వెళ్లినపుడు స్వైన్‌ఫ్లూ సోకిందని, ఆయన ద్వారా వారి కుటుంబంలోని నలుగురు స్వైన్‌ఫ్లూ బారిన పడ్డారని, వారంతా స్టేజ్-1 దశలో ఉండడంతో ఎటువంటి ప్రమాదమూ లేదన్నారు. ఆ కుటుంబంలోని చిన్నారికి కూడా స్లైన్‌ఫ్లూ పాజిటివ్ ఉన్నట్లు తేలిందని, ఇందుకుగాను ఆ చిన్నారి చదువుకునే పాఠశాలలోని చిన్నారులకు కూడా ముందస్తు వైద్యసేవలు అందించనున్నట్లు తెలిపారు.
అంతేకాకుండా వ్యాధి సోకిన కుటుంబం పరిసర ఇళ్ల వారికి కూడా ముందస్తు వైద్యసేవలు అందించనున్నట్లు వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో స్వైన్‌ఫ్లూ సోకిన వారికి వైద్య సేవలందించేందుకు ప్రత్యేక వార్డును కెటాయించినట్లు తెలిపారు. ఆసుపత్రిలో వైద్యులు సైతం అందుబాటులో ఉన్నారని, ఈ వ్యాధిని నయం చేసేందుకు మందులు సైతం అందుబాటులో ఉన్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ ఏడాది జిల్లాలో ఆరుగురు స్వైన్‌ఫ్లూ బారిన పడ్డారని, ఎవరికీ ప్రమాదం జరగలేదని, జిల్లావాసులు ఆందోళన చెందకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంతేకాకుండా మున్సిపాలిటీ పరిధిలో ఆయా కాలనీలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని కమిషనర్‌ను ఆదేశించామన్నారు. వైద్య శాఖ అధికారులను కూడా అప్రమత్తం చేసి ఇతరులెవరూ ఈ వ్యాధి బారిన పడకుండా చర్యలు చేపట్టినట్లు ఆమె వివరించారు.
జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శామ్యూల్ మాట్లాడుతూ స్వైన్‌ఫ్లూ బారినపడి ఆసుపత్రిలో చేరిన అయిదుగురికి అంత తీవ్రత లేదని, వారంతా స్టేజ్-1 దశలోనే ఉండటంతో 5 రోజుల పాటు వ్యాధి నివారణ మందులు, చికిత్స చేపడితే కోలుకునే వీలుందన్నారు. చికిత్సకోసం ప్రత్యేకంగా వార్డు ఏర్పాటు చేశామని, వైద్యులను కూడా నియమించాయమని తెలిపారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలోనే స్వైన్ ఫ్లూ త్వరగా వ్యాప్తి చెందుతుందని, గర్భిణులు, షుగర్, టీబీ, క్యాన్సర్, హెచ్‌ఐవీ, ఉన్నవారికి ఈ వ్యాధి త్వరగా వ్యాపిస్తుందని, ప్రజలు దీనిపట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. సమావేశంలో డీఆర్‌ఓ యం.రాంకిషన్, డీఎంహెచ్‌ఓ పార్వతి, జిల్లా ఆసుపత్రి ఆర్‌ఎంఓ రాంబాబు, స్వైన్‌ఫ్లూ వ్యాధి నిపుణుడు పెరుమాళ్ల శ్రీనివాసరెడ్డి, ఎస్‌పీహెచ్‌ఓ డాక్టర్ రజిని, ఐడీఎస్‌పీ ఇన్‌చార్జ్ శశికాంత్ తదితరులు పాల్గొన్నారు.