గవర్నర్ ప్రసంగంలో అబద్ధాలివిగో..
⇒ నిరూపిస్తున్నాం..
⇒ రాజీనామా చేస్తావా: కేసీఆర్‌కు ఉత్తమ్ సవాల్
సాక్షి, హైదరాబాద్: ‘‘గవర్నర్ బడ్జెట్ ప్రసంగంలో అబద్ధాలుంటే రాజీనామా చేస్తానని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సవాల్ చేశారు. వాటిలో ఎన్నో అబద్ధాలున్నాయి. ఆ విషయాన్ని ఆధారాలతో సహా నిరూపిస్తు న్నాం. మరిప్పుడు కేసీఆర్ రాజీనామా చేస్తా రా’’ అని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి సోమవారం సవాలు చేశారు. ‘‘కేసీఆర్ నోరు పెద్ద అబద్దాల పుట్ట. ఆయన మాటల కు విలువివ్వడంలేదు. రాజకీయాల్లో ఇప్పటి దాకా కేసీఆర్ చెప్పినన్ని అబద్ధాలు ప్రపంచం లోనే ఎవరూ చెప్పి ఉండరు. అందులో ఆయన గిన్నిస్ రికార్డు వస్తుందేమో’’ అంటూ ఎద్దేవా చేశారు.
‘‘దేశంలోనే అత్యధిక రెవె న్యూ ఉన్న రాష్ట్రం తెలంగాణ అని గవర్నర్ ప్రసంగంలో చెప్పారు. కాగ్ నివేదిక ప్రకారం అది రూ.94వేల కోట్లన్నారు. ఏడాది పూర్త య్యేసరికి రూ.72వేల కోట్లొచ్చింది. పన్నేతర రెవెన్యూ 2016 వరకు రూ.9,974 కోట్లని చూ పారు. నెలవారీ పన్నేతర ఆదాయం రూ.366 కోట్ల నుంచి రూ.176కోట్లకు తగ్గినట్టు నమో దైంది. కేవలం పుస్తకాల్లో పెంపు చూపి అంకెల గారడీ చేశారు. 2016–17 బడ్జెట్ ప్రకారం 2016 నవంబరు నాటికి 45 వేల కోట్ల ఆదాయం వచ్చిందని చూపారు.
ఈ ఏడాది బడ్జెట్ అంచనాల్లో రూ.1,00,924 కోట్ల ఆదాయాన్ని అంచనా వేశారు. నోట్ల రద్దుతో ఆదాయం పడిపోయిందని కేసీఆర్ ప్రకటించారు. అభివృద్ధి రేటంతా బూటకమే నని దీన్ని బట్టే తేలుతోంది’’ అన్నారు. తెలం గాణకు విపరీతంగా పెట్టుబడులు వచ్చా యని, పారిశ్రామిక విధానంతో దేశంలోనే నంబర్‌వన్ అయ్యామని అబద్ధపు ప్రచారాలు చేసుకున్నారన్నారు. ‘‘2015లో పెట్టుబడుల్లో దేశంలో గుజరాత్, 2016లో కర్ణాటక తొలి స్థానంలో ఉన్నాయి. ఈ రెండుసార్లూ తెలంగాణ మాత్రం ఆరో స్థానంలో ఉంది’’ అని ఉత్తమ్ వెల్లడించారు.