ఉయ్యాలా.. జంపాలా | uyyala jampala | Sakshi
Sakshi News home page

ఉయ్యాలా.. జంపాలా

Published Mon, Jun 1 2015 4:13 AM | Last Updated on Wed, Oct 3 2018 6:55 PM

uyyala jampala

 వరంగల్ అర్బన్ : కాకతీయుల రాజధానిగా ఎన్నో చరిత్రాత్మక ప్రదేశాలకు నెలవైన ఓరుగల్లు సిగలో మరో నగ చేరనుంది. దశాబ్దాలుగా నానుతున్న భద్రకాళి గుట్ట-పద్మాక్షి గుట్ట రోప్‌వే ప్రతిపాదనలకు అధికారులు దుమ్ము దులిపారు. దీనికి సంబంధించి ఐదేళ్ల క్రితం నాటి ప్రాజెక్టు రిపోర్టులో కొద్దిపాటి మార్పులు చేసి.. తెలంగాణ ఆవిర్భావ వారోత్సవాలు ముగియగానే టెండ ర్ల ప్రక్రియ ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇదంతా పూర్తరుు రోప్ వే నిర్మాణం జరిగితే వరంగల్ నగర వాసులే కాదు, ఇక్కడకు వచ్చే పర్యాటకులకు అద్భుతమైన అనుభూతి సొంతమవుతుందనే చెప్పాలి.

 రూ.20 కోట్లతో..
 వరంగల్ భద్రకాళి ఆలయ సమీపంలోని గుట్టల మీద నుంచి హన్మకొండలోని పద్మాక్ష్మి గుట్ట వరకు రోప్ వే నిర్మించాలని దశాబ్దం క్రితం కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(కుడా) అధికారులు భావించారు. ఆ తర్వాత ఐదేళ్లకు బీఓటీ పద్ధతిపై కోల్‌కత్తాకు చెందిన దామోదర్ రోప్‌వే కంపెనీకి బాధ్యతలు అప్పగించాలని నిర్ణరుుంచారు. సెంట్రల్ ఫైనాన్స్ అసిస్ట్ స్కీం కింద ఈ ప్రాజెక్టు చేపట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్టు వ్యయంలో 30 శాతం కేంద్రప్రభుత్వం, 70 శాతం కంపెనీ భరించేలా, ‘అపిట్కో’తో డిజైన్ చేరుుంచేందుకు ఒప్పందాలు జరిగారుు. ఆ తర్వాత సాంకేతిక అడ్డంకులు, తదితర కారణాలతో ఈ ప్రాజెక్టు అటకెక్కింది.

 కలెక్టర్ చొరవతో..
 జిల్లా కలెక్టర్, కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(కుడా) చైర్మన్ వాకాటి కరుణ ‘పద్మాక్షి’ రోప్ వే నిర్మాణానికి తాజాగా చొరవ తీసుకున్నారు. తెలంగాణలో హైదరాబాద్‌లో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్‌లో ఈ రోప్ వే నిర్మాణం ద్వారా పర్యాటకులను ఆకర్షించవచ్చని భావించిన ఆమె ‘కుడా’ వీసీ, బల్దియూ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌తో చర్చించారు. గతంలో మాదిరిగా కేంద్రప్రభుత్వం, నిర్మాణ కంపెనీల పొత్తు ఉండకుండా, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్‌నర్ షిప్(పీపీపీ) పద్ధతిలో రోప్‌వే ప్రాజెక్టును నిర్మించేందుకు సన్నాహాలు ప్రారంభించారు.

ఐదేళ్ల క్రితం నాటి ప్రాజెక్టు డిజైన్‌లో చిన్నచిన్న మార్పులు చేరుుంచేందుకు నిపుణులతో చర్చించి ఓ కొలిక్కి తీసుకొచ్చారు. రెండు రోజుల క్రితమే ప్రాజెక్టు డిజైన్‌లో మార్పులు, చేర్పులు చివరి దశకు చేరినా... తెలంగాణ ఆవిర్భావ వారోత్సవాల హడావుడి ఉండడంతో వారం తర్వాత టెండర్లు పిలవాలని భావిస్తున్నారు.

 రూ.20 కోట్లు, 1.1 కిలోమీటర్లు
 భద్రకాళి గుట్ట-పద్మాక్షి గుట్ట రోప్‌వే కోసం సుమారు రూ.20 కోట్లు వ్యయమవుతుందని అధికారులు ఇప్పటికే అంచనా వేశారు. ఈ రోప్‌వేను 1.1 కిలోమీటర్ల దూరంతో నిర్మించనుండగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే అతి పెద్ద రోప్‌వేగా నిలవనుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం, విశాఖపట్నంలో రోప్ వే ఉండగా వీటి దూరం 0.3 నుంచి 0.5 కిలోమీటర్లు మాత్రమే! ఈ మేరకు వరంగల్‌లో 1.1 కిలోమీటర్ల నిడివితో దీన్ని నిర్మించనుండడం విశేషం.

 అటు హృదయ్.. ఇటు రోప్‌వే..
 కేంద్రప్రభుత్వం హృదయ్ పథకం కింద వరంగల్‌ను ఎంపిక చేసి తొలి ఏడాది రూ.41.50 కోట్లు మంజూరు చేయనున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. ఇందులో ఇప్పటికే రూ.5 కోట్లు విడుదల కాగా, ఈ నిధులతో భద్రకాళి బండ్‌ను అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు. భద్రకాళి బండ్ పటిష్టత, ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యూరుు కూడా! అలాగే, మిషన్ కాకతీయ పథకంలో భాగంగా పూడిక తీసి కట్టను అభివృద్ధి చేసే ప్రారంభమయ్యూరుు.

ఆ తర్వాత కట్ట, ఆ పక్కనే పార్క్‌లో రంగురంగుల విద్యుత్ దీపాలు, పిల్లల ఆట వస్తువులు, ఇతర రిక్రియేషన్ పనులు చేపడుతారు. ఇక రోప్ వే కూడా పూర్తరుుతే వరంగల్‌లోని భద్రకాళి ఆలయూనికి వచ్చే భక్తులు, పర్యాటకులు... నగరాన్ని విహంగ వీక్షణం చేస్తూ పద్మాక్ష్మి గుట్టపైకి చేరుకోవచ్చు. తద్వారా ప్రజలకు సరికొత్త అనుభూతి సొంతం కానుందనే చెప్పాలి!!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement