వాటర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఏర్పాటు | Vatargrid Corporation established | Sakshi
Sakshi News home page

వాటర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఏర్పాటు

Published Sat, Jan 31 2015 2:28 AM | Last Updated on Sat, Sep 2 2017 8:32 PM

Vatargrid Corporation established

  • చైర్మన్, ఎండీ సహా గరిష్టంగా 12 మంది సభ్యులు
  • సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్ పథకం అమలు, నిర్వహణ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటైంది. దీనికి ‘తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లయ్ కార్పొరేషన్(టీడీడబ్ల్యూఎస్‌సీ)’గా నామకరణం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ కార్పొరేషన్‌లో చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ సహా సభ్యులు గరిష్టంగా 12 మందికి మించరాదని పేర్కొంది.

    కార్పొరేషన్ ఉపాధ్యక్షునిగా పంచాయితీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, డెరైక్టర్లుగా గ్రామీణ నీటిసరఫరా విభాగం ఇంజనీర్ ఇన్ ఛీఫ్, ప్రజారోగ్య విభాగం ఇంజనీర్ ఇన్ చీఫ్ వ్యవహరిస్తారు. ఈ కార్పొరేషన్‌ను కంపెనీల చట్టంలోని సెక్షన్ 149 ప్రకారం రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లో నమోదు చేయాల్సి ఉంది.

    ఒక్కో షేరు ధర రూ. 10 చొప్పున 50 లక్షల షేర్లతో రూ. 5 కోట్ల ఆథరైజ్డ్ క్యాపిటల్‌ను, 20 లక్షల షేర్లతో రూ. 2 కోట్ల పెయిడ్ క్యాపిటల్‌ను సమకూర్చాలని ప్రతిపాదించారు. పెయిడ్ క్యాపిటల్‌లోని 20 ల క్షల షేర్లలో సింహభాగాన్ని గవర్నర్ పేరు మీద, మిగిలిన వాటిని డెరైక్టర్లకు కేటాయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement