Water grid scheme
-
జలం.. పుష్కలం
బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లాలో నాలుగు, చిత్తూరు జిల్లాలో ఒక నియోజకవర్గంలో ప్రజలకు శాశ్వత తాగునీటి కష్టాలను దూరం చేసేందుకు ప్రభుత్వం వాటర్‌గ్రిడ్‌కు రూపకల్పన చేసింది. తద్వారా వచ్చే 30 ఏళ్ల వరకు(2054) నీటిని అందించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికి కృష్ణా జలాలను అందించే వాటర్ గ్రిడ్ పథకానికి ప్రభుత్వం రూ.2,400 కోట్లు మంజూరు చేస్తూ పాలనాపర ఉత్తర్వులను ఫిబ్రవరిలోనే జారీ చేసింది. దీంతో గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు సమగ్ర నివేదికలు తయారుచేసి ప్రభుత్వానికి పంపారు. ఐదు నియోజకవర్గాల్లోని 4,938 పల్లెలు, రెండు మున్సిపాలిటీలకు తాగునీరు అందుతుంది. నిధుల వినియోగం ఇలా రూ.2,400 కోట్ల వ్యయంతో అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, రాయచోటి, చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గం, ఈ రెండు జిల్లాల్లోని మదనపల్లె, పుంగనూరు మున్సిపాలిటీ ప్రజలకు తాగునీటిని అందించేందుకు ప్రణాళికలు అమలు చేస్తారు. ఈ పనులకు సంబంధించి రూ.1,550 కోట్లతో పాలనాపరమైన అనుమతి ఇచ్చింది. మదనపల్లె, పుంగనూరు మున్సిపాలిటీల్లో రూ.850 కోట్ల పనులకు పాలనాపర అనుమతి రావాల్సి ఉంది. రూ.1,550 కోట్లలో కేంద్రం జల్‌జీవన్ మిషన్ కింద రూ.755 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.755 కోట్లు ఖర్చు చేయనుంది.్ల గండికోట రిజర్వాయర్ నుంచి 3.37 టీఎంసీల కృష్ణా జలాలను తరలించి ఇంటింటికి శుద్ధిచేసిన జలాన్ని కుళాయిల ద్వారా అందిస్తారు. పైప్‌లైన్ ఇలా: మామిళ్లవారిపల్లె రీట్రీట్‌మెంట్ ప్లాంట్ నుంచి ఎడమవైపు పైప్‌లైన్ ద్వారా గుర్రంకొండ, వాయల్పాడు, కలికిరి, కలకడ, కేవీపల్లె, పీలేరు, సదుం, రొంపిచర్ల, పులిచర్ల మండలాలకు,కుడివైపు పైప్‌లైన్ ద్వారా పెద్దమండ్యం, తంబళ్లపల్లె, ములకలచెరువు, పెద్దతిప్పసముద్రం, బి.కొత్తకోట, కురబలకోట మీదుగా మదనపల్లె, నిమ్మనపల్లె, రామసముద్రం, పుంగనూరు, చౌడేపల్లె, సోమల వరకు సాగుతుంది. 165 కిలోమీటర్ల పైప్‌లైన్ వైఎస్సార్ జిల్లాలోని గండికోట ప్రాజెక్టు నుంచి జిల్లాలోని గుర్రంకొండ మండలం మామిళ్లవారిపల్లె వరకు కృష్ణా జలాలను తరలించేందుకు 165 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మిస్తారు. నీటి తరలింపు కోసం గండి, కొండప్పగారిపల్లె, గాలివీడు, కార్లకుండ, గాలివీడు, కలిచర్ల వద్ద 25వేల కిలో లీటర్ల సామర్థ్యం కలిగిన సంపులు నిర్మిస్తారు. రూ.850 కోట్లకు అనుమతి రావాలి మదనపల్లె, పుంగనూరు మున్సిపాలిటీల్లో వాటర్‌గ్రిడ్ అమలు కోసం రూ.850 కోట్లకు ప్రభుత్వం నుంచి పాలనాపరమైన అనుమతి రావాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతానికి మంజూరైన ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన పనుల అమలు ప్రణాళికను ప్రభుత్వానికి నివేదించాం. –ఎండీ.అబ్దుల్ మతీన్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ, మదనపల్లె -
పరిశుభ్రమైన తాగునీరు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజలందరికీ పరిశుభ్రమైన తాగునీరు అందించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తాగునీటి సరఫరా కోసం వాటర్ గ్రిడ్ పథకం కింద మూడు దశల్లో పనులు చేపట్టాలని సూచించారు. తాగునీటి సరఫరా, వాటర్ గ్రిడ్ పథకంపై ముఖ్యమంత్రి శుక్రవారం గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉద్ధానం తాగునీటి ప్రాజెక్టును శ్రీకాకుళం జిల్లా అంతటికీ వర్తింపజేయాలని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. వాటర్ గ్రిడ్ పథకం కింద మొదటి దశలో శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో పరిశుభ్రమైన తాగునీటిని సరఫరా చేయాలని చెప్పారు. రెండో దశలో విజయనగరం, విశాఖ, రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో శుభ్రమైన తాగునీరు అందించేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. మూడో దశలో కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో తాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. చెరువులు, సమ్మర్ స్టోరేజీ ట్యాంకులపై దృష్టి పెట్టండి నీటిని సేకరించిన చోటే శుద్ధి చేసి, అక్కడ నుంచి ప్రజలకు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. దీనిపై నిశితంగా అధ్యయనం చేసి, ప్రణాళిక ఖరారు చేయాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ సూచించారు. ప్రస్తుతం ఉన్న తాగునీటి చెరువులు, సమ్మర్ స్టోరేజీ ట్యాంకుల స్థితిగతులపై దృష్టి పెట్టాలని చెప్పారు. చెరువులు, సమ్మర్ స్టోరేజీ ట్యాంకుల్లో తాగునీరు నింపాక కలుషితం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కిడ్నీ వ్యాధుల బాధితులు ఉన్న ప్రాంతాల్లో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి నేరుగా వారి ఇళ్లకే తాగునీరు సరఫరా చేయాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. -
నల్లాలకు మీటర్లు
ఆదిలాబాద్‌రూరల్: వాటర్ గ్రిడ్ పథకం ద్వారా సరఫరా అయ్యే నీటి వినియోగానికి సంబంధించిన లెక్క ఇక పక్కాగా తేలనుంది. వాటర్‌గ్రిడ్ పథకం కింద ఇళ్లలో ఉచితంగా ఏర్పాటు చేసిన నల్లాలకు మీటర్లను అమర్చే ప్రక్రియ ఆదిలాబాద్ పట్టణంలో ప్రారంభమైంది. విడతల వారీగా ప్రతీ ఇంటిలోని నల్లాకు మీటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఇంటింటికీ శుద్ధ జలాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వాటర్ గ్రిడ్ పథకం ద్వారా ఉచితంగా నల్లా కనెక్షన్ ఇచ్చింది. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డుల్లో ఇప్పటి వరకు 17 వేల నల్లాలు బిగించారు. వాటర్‌గ్రిడ్ ద్వారా నీటిని కూడా సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వాటర్ గ్రిడ్ నల్లాలన్నింటికీ నీటి లెక్కింపు మీటర్లు అమర్చనున్నారు. తొలుత పట్టణంలో ఈ ప్రక్రియను ప్రారంభించారు. ఆయా వార్డుల్లో జరిగే నీటి సరఫరాకు అనుగుణంగా మీటర్లు బిగించనున్నారు. తొలుత పట్టణ శివారు కాలనీ అయిన రణాదీవేనగర్తోపాటు మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీశ ప్రతినిధ్యం వహిస్తున్న ద్వారాకానగర్ వార్డులో మీటర్లను అమర్చే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయా కాలనీల్లో ఇప్పటి వరకు 1300 మీటర్లు అమర్చారు. రోజుకు నాలుగు వార్డుల చొప్పున మీటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రారంభమైన నీటి సరఫరా.. వాగులు, చెలిమెలు, బావుల్లోని నీటిని తాగుతూ వ్యాధులబారిన పడుతున్న ప్రజలకు శుద్ధ జలాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వాటర్ గ్రిడ్ పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కొక్కరికి రోజుకు 90 లీటర్లు, పట్టణ ప్రాంతాల్లో 135 లీటర్ల చొప్పున రక్షిత మంచినీటి అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ప్రస్తుతం పట్టణంతో పాటు పలు గ్రామాల్లో వాటర్ గ్రిడ్ ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. ఎంత నీరు సరఫరా అవుతుందో లెక్కించేందుకు మీటర్లు ఏర్పాటు చేస్తున్నారు. దీని వల్ల వాటర్ సోర్సెస్ నుంచి రోజుకు ఎన్ని లీటర్ల నీరు సరఫరా జరుగుతోంది. ఒక్కో కుటుంబం రోజుకు ఎన్ని లీటర్ల నీటిని వినియోగిస్తోందనే విషయాలపై స్పష్టత రానుంది. మొత్తం ఎన్ని లీటర్ల డిమాండ్ ఉంది. ఎంత మేర సరఫరా జరుగుతోంది. ఎంత నీరు వృథాగా పోతుందనే విషయాలు ఈ మీటర్ల ద్వారా పక్కాగా తేలనున్నాయి. ప్రస్తుతానికి నీటి వినియోగాన్ని తెలుసుకునేందుకు మీటర్లు ఏర్పాటు చేస్తున్నా భవిష్యత్‌లో మీటర్లు సూచించే రీడింగ్ ఆధారంగానే బిల్లులు వసూలు చేయనున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మీటర్ల బిగింపు ప్రస్తుతానికి మున్సిపాలిటీకే పరిమితమైనా దశల వారీగా గ్రామీణ ప్రాంతాల్లోనూ వాటర్‌గ్రిడ్ ద్వారా నల్లాలు బిగించి ప్రతీ ఇంటికి మీటర్లు పెట్టనున్నారు. నత్తనడకన కొనసాగుతున్న పనులు.. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో వాటర్‌గ్రిడ్ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. గత మాసంలోనే పనులు పూర్తి చేస్తామని అధికారులు చెప్పినా మరో నెల రోజులు పట్టే అవకాశం ఉంది. ఇప్పటికి ఆయా ప్రాంతాల్లో నిర్మిస్తున్న ట్యాంకులు నిర్మాణ దశలోనే కొనసాగుతున్నాయి. పలు కాలనీల్లో ఇంకా నల్లా కనెక్షన్లు ఇళ్లకు చేరుకోలేదు. జూన్‌లోగా పనులు పూర్తి కాకపోతే మళ్లీ వర్షాకాలంలో పట్టణ ప్రజలకు కలుషిత నీరే దిక్కు కానుంది. ఇప్పటికైనా పనుల్లో వేగం పెంచి పనులు సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. విడతల వారీగా బిగిస్తున్నాం మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటి వరకు 1300 వరకు వాటర్‌గ్రిడ్ నల్లాలకు మీటర్లు బిగించాం. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో మీటర్ల బిగింపులో కొంత జాప్యం జరుగుతోంది. దశల వారీగా పట్టణంలో అన్ని వాటర్ గ్రిడ్ నల్లాలకు మీటర్లు బిగించనున్నాం.– హరిబువన్, పబ్లిక్ హెల్త్ ఆఫీసర్, ఆదిలాబాద్ మున్సిపాలిటీ -
ప్రభుత్వ వైఫల్యంతోనే రైతు ఆత్మహత్యలు
సూర్యాపేట/చౌటుప్పల్: రైతు ఆత్మహత్యలకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా సూర్యాపేటలో రాజ్యసభ మాజీ సభ్యుడు ఆకారపు సుదర్శన్ విగ్రహాష్కరణ చేశారు.గడిచిన 16 నెలల్లో వ్యవసాయం రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, ఫలితంగా 1500 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. ఒకేసారి మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌ది కచరా గ్యాంగ్: రేవంత్ కచరా (కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు) గ్యాంగ్ లో చేరి బాగుపడ్డొళ్లు ఎవరూ లేరని టీడీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. భూమికి జానెడు, కొలతకు బెత్తెడు లేని మంత్రి జగదీశ్‌రెడ్డి అని ధ్వజమెత్తారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు దొంగనోట్లు, ఇసుక దందాల్లో ఇరుక్కున్నారని, అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిం చారు. ఊసుకల్లా, పాసుపల్లా ఎమ్మెల్యేలంటూ పరుష పదజాలంతో విమర్శించారు. చౌటుప్పల్‌లో వాటర్‌గ్రిడ్ పథకానికి చిహ్నంగా నిర్మిం చిన పైలాన్‌ను పరిశీలించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వాటర్‌గ్రిడ్ పైప్లైన్లు కేసీఆర్ కుటుంబానికి క్యాష్లైన్లుగా మారాయని విమర్శించారు. కార్యక్రమంలో మోత్కుపల్లి నర్సింహులు, ఉమామాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతుల కోసం కేంద్రాన్ని కోరుతాం సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ తెలిపారు. ఇందుకోసం త్వరలోనే టీడీపీ ప్రతినిధుల బృందం డిల్లీకి వెళ్తుందని చెప్పారు. హన్మకొండలోని టీడీపీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు నివాసంలో ఎల్.రమణ బుధవారం విలేకరులతో మాట్లాడారు. అదిలాబాద్ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యే ఒక ఇంజనీరును కొడితే దిక్కులేదని పేర్కొన్నారు. దోచి పెట్టేందుకే 146 జీవో : ఎర్రబెల్లి ప్రజల సొమ్మును కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకే ప్రభుత్వం 146 జీవోను జారీ చేసిం దని టీడీఎల్పీనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. -
వాటర్‌గ్రిడ్‌కు రూ.3, 470 కోట్లు
సింగూరుకు రూ. 1710 కోట్లు ఎస్ఆర్ఎస్పీకి రూ.1760 కోట్లు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బాన్సువాడ : జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో 1645 గ్రామాలకు తాగునీరు అందించేందుకు వాటర్ గ్రిడ్ పథకం ద్వారా రూ.3,470 కోట్లతో టెండర్లు పూర్తయ్యాయని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన బాన్సువాడలో మిషన్ కాకతీయ పనులను, ఫిల్టర్‌బెడ్‌ను పరిశీలించారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ... నిజాంసాగర్ ప్రాజెక్టు నీరు సాగుకు అవసరమైనందున రూ.1710 కోట్లతో సింగూరు నుంచి వాటర్‌గ్రిడ్ పైప్‌లు వేస్తున్నామని తెలిపారు. దీని ద్వారా బాన్సువాడ, బోధన్, జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో 785 గ్రామాలకు నీరు సరఫరా చేస్తామని వివరించారు. అలాగే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా రూ.1760 కోట్లతో నిజామాబాద్ అర్బన్, రూరల్, ఆర్మూర్, బాల్కొండ, కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లోని 860 గ్రామాలకు నీరందిస్తామని తెలిపారు. ఈ పనులకు టెండర్లు పూర్తయ్యాయని, ఎల్అండ్టీ కంపెనీ వారు కాంట్రాక్టు పొందారని చెప్పారు. వాటర్ గ్రిడ్ పూర్తరుుతే నిజాంసాగర్ ప్రాజెక్టు నీరు పూర్తిగా సాగుకే వినియోగిస్తామని, ఆయకట్టు కింద రైతులకు పుష్కలంగా నీరు లభిస్తుందని అన్నారు. రైతులకు రుణమాఫీ చేసినా, కొందరు బ్యాంకర్లు అమలు చేయలేదని, దీని కోసం శనివారం సాయంత్రం నిజామాబాద్‌లోని ప్రగతి భవన్లో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. బాన్సువాడలో 50 ఫీట్లతో రోడ్డు వెడల్పు.. బాన్సువాడలోని ప్రధాన రహదారికి ఇరువైపులా 50 ఫీట్లతో రోడ్డును వెడల్పు చేయనున్నట్లు మంత్రి పోచారం స్పష్టం చేశారు. రోడ్డు వెడల్పు చేస్తే పట్టణం అభివృద్ధి చెందుతుందని, అందుకు వ్యాపారులు సహకరించాలని కోరారు. ఆయన వెంట బోధన్ ఆర్డీఓ శ్యాంప్రసాద్‌లాల్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ నేతలు మహ్మద్ ఎజాస్, ఎర్వల కృష్ణారెడ్డి, గోపాల్‌రెడ్డి, నార్ల సురేష్, సర్పంచ్ వాణి విఠల్, అలీముద్దీన్ బాబా ఉన్నారు. -
పైలాన్ చేరని వాటర్‌గ్రిడ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వాటర్‌గ్రిడ్ పథకం ఒకడుగు ముందుకు.. మూడడుగులు వెనక్కి అన్నట్లు సాగుతోంది. ప్రణాళికా లోపం, నిధుల కొరతతో ఇంటింటికీ రక్షిత మంచినీటిని అందించే పథకం ఆరంభానికి ముందే ఎదురీదుతోంది. టెండర్లకు ముందే ఆరోపణలు.. పునాది రాయి అయినా వేయక ముందే విపక్షాలు చేస్తున్న విమర్శలు వాటర్‌గ్రిడ్‌ను ముసురుకున్నాయి. తొమ్మిది జిల్లాల్లో 25 వేల ఆవాసప్రాంతాలకు, 69 పట్టణాలకు నల్లాల ద్వారా ఇంటింటికీ రక్షిత మంచినీటిని అందించడం ఈ ప్రాజెక్టు ద్వారా తలపెట్టిన బృహత్తర లక్ష్యం. కానీ ఈ ప్రాజెక్టు పనులన్నీ నత్త కంటే మెల్లగా సాగుతున్నాయి. పైపులైన్ల టెండర్లకు ఒత్తిళ్లు: వాటర్ గ్రిడ్‌కు రూ.35 వేల కోట్లకుపైగా ఖర్చు అవుతుంది. ఇందులో కీలకమైన పైపుల తయారీ.. కొనుగోలు.. లైనింగ్ ప్రక్రియపై బడా కంపెనీలన్నీ కన్నేశాయి. తెలంగాణ, ఏపీ కంపెనీలతో పాటు జిందాల్, కొరియన్ వాటర్ కంపెనీ ఇప్పటికే తమవంతు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఐసీఐసీఐ, ఎల్ఐసీతో కన్సార్టియంగా ఏర్పడి పెట్టుబడులు పెట్టడంతో పాటు.. ఈ పైపులైన్ కాంట్రాక్టును దక్కించుకునేందుకు జిందాల్ పావులు కదుపుతోంది. కొరియన్ వాటర్ కంపెనీ సైతం రూ.10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేం దుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. బడా కంపెనీలన్నీ రాష్ట్ర సర్కారుపై రాజ కీయ ఒత్తిళ్లు తీసుకొస్తున్న ప్రచారం జోరందుకుం ది. అయితే పైపులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ ఇప్పటికీ మొదలు కాలేదు. ఈలోగా కొన్ని కంపెనీలు తమకు అనుకూలంగా టెండర్ల నిబంధనలుండేలా పైరవీలు చేస్తుండటంతో సర్కారు తల పట్టుకుంది. నిధు ల సమీకరణకు వీలు గా రాష్ట్ర సర్కారు జనవరిలోనే తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. కానీ.. కార్పొరేషన్‌కు సంబంధిం చిన పాలకవర్గం నియామకాలు కాలేదు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌లో నిర్మిస్తున్న పైలాన్ తుదిదశలో ఉంది. ఇప్పటికీ కార్యక్రమానికి పునాది రాయి పడలేదు. ఈలోగానే విపక్షాలు సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇంటేక్ వెల్స్కు సంబంధించిన ప్యాకేజీల కుదింపు, టెండర్లవ్యవధి తగ్గింపు.. టెండరు మార్గదర్శకాలను కొన్ని కంపెనీలకు అనుకూలంగా మార్చినట్లు విమర్శలు సర్కారును చుట్టుముట్టాయి. దీంతో పనుల వేగానికి కళ్లెం వేసినట్లు స్పష్టమవుతోంది. సర్వేకే ఆరు నెలలు వాటర్‌గ్రిడ్ తొలిదశ లైన్ సర్వే ఇటీవలే పూర్తయింది. నెల రోజుల్లో పూర్తవుతుందనుకున్న సర్వే కు ఆరు నెలలు పట్టింది. లైన్సర్వేకు లైటింగ్ డిటెక్షన్ రేంజింగ్(లైడార్) వంటి ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని విని యోగిస్తామని చెప్పిన ప్రభుత్వం అది ఖరీదైన ప్రక్రియ కావటంతో వెనకడుగు వేసింది. -
దోచుకోవడానికే వాటర్‌గ్రిడ్
సాక్షి, హైదరాబాద్: ప్రజల సొమ్మును దోచుకోవడానికే టీఆర్ఎస్ ప్రభుత్వం వాటర్‌గ్రిడ్ పథకానికి రూపకల్పన చేసినట్లు కనిపిస్తోందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్ ఆరోపించారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శాసనసభలో కాంగ్రెస్‌పక్ష నేత నేత కె.జానారెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్కతో కలసి గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని దిగ్విజయ్‌సింగ్ దుయ్యబట్టారు. దళితులకు మూడెకరాల భూమి, కేజీ టు పీజీ ఉచిత విద్య, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, ఎస్టీలు, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల వంటి ఎన్నో హామీలను అమలు చేయలేదన్నారు. ఇలాంటి హామీలను విస్మరించి కేవలం వాటర్‌గ్రిడ్ పథకానికే ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. ముందుగా రూ. 27 వేల కోట్లతో పూర్తవుతుందని చెప్పి ఇప్పుడు వాటర్‌గ్రిడ్‌కు రూ. 40 వేల కోట్లు అవసరం అవుతుందని చెప్పడం వెనుక కారణాలు ఏమిటని ఆయన ప్రశ్నించారు. వాటర్‌గ్రిడ్‌లో అక్రమాలకు అవకాశాలున్నాయని దిగ్విజయ్‌సింగ్ వ్యాఖ్యానించారు. మొత్తం రాష్ట్ర ప్రభుత్వంలో ఒక కుటుంబమే ఆధిపత్యం చెలాయిస్తున్నదని, మంత్రివర్గంలో మిగిలిన వారంతా నామమాత్రంగా మిగిలిపోయారని విమర్శించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను దిగ్విజయ్ ఖండించారు. రైతుల హక్కులు, ప్రయోజనాలను దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈ నెల 19న ఢిల్లీలో రైతులతో ప్రదర్శన నిర్వహించనున్నట్లు దిగ్విజయ్ తెలిపారు. రాష్ట్రంలోనూ టీఆర్ఎస్ అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపైనా, భూసేకరణ చట్టంపైనా ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. కాగా, పార్టీ ముఖ్యనేతలతో గాంధీభవన్‌లో సమావేశమైన దిగ్విజయ్ సభ్యత్వ కార్యక్రమంపై సమీక్షించారు. ఉత్తమ్ మాట్లాడుతూ ఈ నెల 30కల్లా పూర్తిస్థాయి సభ్యత్వ పుస్తకాలతోపాటు కంప్యూటర్ సీడీలను కార్యాలయంలో అందించాలనిసూచించారు. అసంతృప్త ఎమ్మెల్సీలతో భేటీ... శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా షబ్బీర్ అలీ నియామకం తీరుపై అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, రంగారెడ్డి, సంతోష్ కుమార్ తదితరులు దిగ్విజయ్‌ను కలిశారు. షబ్బీర్ అలీకి వ్యక్తిగతంగా తాము వ్యతిరేకం కాకున్నా పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడాల్సి వస్తోందని వారు పేర్కొన్నట్లు తెలిసింది. తమను విశ్వాసంలోకి తీసుకుని నిర్ణయం తీసుకొని ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని దిగ్విజయ్‌కు పొంగులేటి వివరించినట్టుగా తెలిసింది. దీనికి దిగ్విజయ్ బదులిస్తూ షబ్బీర్ అలీ నియామకం తాత్కాలిక నిర్ణయమేనని చెప్పారు. శాసనమండలిలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు పూర్తయిన తర్వాత మరోసారి అంతర్గతంగా ఎన్నికలు నిర్వహించుకుందామని హామీని ఇచ్చినట్టుగా తెలిసింది. ఈ చర్చలన్నీ ఉత్తమ్, భట్టి, షబ్బీర్ అలీ సమక్షంలోనేజరిగినట్లు సమాచారం. -
రైతుల హక్కులను కాలరాయడమే
భూ వినియోగహక్కు చట్టంపై అసెంబ్లీలో విపక్షాల ఫైర్ సవరించాల్సిందేనని డిమాండ్.. అంగీకరించని ప్రభుత్వం నిరసనగా సభ నుంచి కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం వాకౌట్ మూజువాణి ఓటుతో నాలుగు బిల్లులకు ఆమోదం సాక్షి, హైదరాబాద్: వాటర్‌గ్రిడ్ పథకంలో పైప్లైన్ల నిర్మాణం కోసం తీసుకువస్తున్న భూ వినియోగహక్కు (రైట్ టు యూజ్) చట్టం సరికాదని.. అది రైతుల హక్కులను కాలరాసే చట్టమని పేర్కొంటూ బుధవారం అసెంబ్లీలో ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకుపడ్డాయి. బిల్లులో పలు సవరణలు చేయాలని డిమాండ్ చేశాయి. కానీ సవరణలకు ప్రభుత్వం అంగీకరించకపోవడంతో మజ్లిస్ మినహా మిగతా విపక్షాలన్నీ వాకౌట్ చేశాయి. భూవినియోగ హక్కు చట్టంతో సహా ఐదు బిల్లులను సర్కారు బుధవారం సభలో ప్రవేశపెట్టగా... మూడు బిల్లులను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే ఈ బిల్లులన్నీ మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు. భూసేకరణ చేపట్టాలి.. వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు అవసరమైన భూమిని వినియోగించుకునే హక్కు కోసం రూపొందించిన ‘భూవినియోగహక్కు’ బిల్లును రెవెన్యూ మంత్రి మహమూద్ అలీ బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జానారెడ్డి, జీవన్‌రెడ్డి పలు అభ్యంతరాలను లేవనెత్తారు. ‘‘భూవినియోగహక్కు అంటున్న ప్రభుత్వం ఆ భూమిపై మొక్కలు నాటకూడదు, నిర్మాణాలు చేయకూడదు, బావులు, జలాశయాలు తవ్వ కూడదంటూ.. ఆంక్షలు విధించడమేమిటి? ఆంక్షల కారణంగా రైతులు హక్కును కోల్పోతారు. కేవలం మార్కెట్ విలువలో పదిశాతం ఇచ్చి రైతులను మోసం చేయాలని చూస్తే ఆందోళనకర పరిస్థితులు ఎదురవుతాయి. తక్షణమే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలి. మార్కెట్ విలువకు నాలుగింతలు పరిహారం ఇచ్చే భూసేకరణ చట్టాన్ని అమలుచేయాలి..’’ అని డిమాండ్ చేశారు. భూ వినియోగహక్కు వల్ల రైతులతో పాటు పట్టణాల్లోని ప్లాట్ల యజమానులకు కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుందని బీజేపీ సభ్యుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. గతంలో రిలయన్స్ గ్యాస్ పైపులైన్ నిర్మాణం వల్ల రంగారెడ్డి, మెదక్, ఖమ్మం జిల్లాల్లో లక్షలాది మంది నష్టపోయారని గుర్తుచేశారు. బిల్లును అబయెన్స్‌లో పెట్టి, సెలక్ట్ కమిటీకి నివేదించాలని కోరారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు సీపీఎం ఎమ్మెల్యే రాజయ్య, సీపీఐ ఎమ్మెల్యే రవీందర్ స్పష్టం చేశారు. రైతులకు ఇబ్బంది ఉండదు: కేటీఆర్ భూవినియోగహక్కు కింద రైతుల హక్కులకు ఎటువంటి ఆటంకం ఏర్పడదని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఉపరితలానికి రెండు మీటర్ల లోతులో వేసే పైప్లైన్ల వలన వ్యవసాయానికి ఎటువంటి ఇబ్బందులు రావన్నారు. పంట నష్టపోయే రైతులకు పంట పరిహారంతో పాటు భూమి మార్కెట్ విలువలో పదిశాతం (కలెక్టర్ నిర్ధారించిన మేరకు) నష్టపరిహారంగా అందించనున్నట్లు తెలిపారు. భారీగా పెరిగే చెట్లయితే పైప్‌లైన్ పగులుతుందనిగాని, సాధారణ వ్యవసాయానికి ఎటువంటి ఆంక్షలు ఉండబోవన్నారు. పైప్‌లైన్‌కు ఉద్దేశపూర్వకంగా నష్టం కలిగించే వారికి జైలుశిక్ష ఉంటుందని బిల్లులో పేర్కొన్నామని.. జైలు శిక్షలు రైతులకు అనడం సరికాదని మంత్రి చెప్పారు. వీలైనంత వరకు పైప్‌లైన్ ఏర్పాటంతా రెవెన్యూ, అటవీ భూముల్లోనే జరిగేలా చూస్తామన్నారు. మూడు బిల్లులకు నో.. భూవినియోగబిల్లు, పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం, మార్కెట్ కమిటీ చైర్మన్ల పదవీకాలం ఏడాదికి తగ్గింపు బిల్లులను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. చిన్న రాష్ట్రానికి తగినంత మంది మంత్రులున్నా.. కొత్తగా పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని కాంగ్రెస్, బీజేపీ విమర్శించాయి. మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ల పదవీ కాలాన్ని ఏడాదికి తగ్గించడమంటే.. విపక్షాలకు చెందిన చైర్మన ్లను తొలగించే కుట్రలో భాగమేనని ఆరోపించాయి. అయితే వ్యాట్ సవరణ, వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు బిల్లులను అన్నిపక్షాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. -
జిల్లాలో వాటర్ గ్రిడ్‌కు రూ.280 కోట్లు
జోగిపేట/పుల్కల్: జిల్లా ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించాలనే ఉద్దేశంతో రూ.280 కోట్ల వ్యయంతో వాటర్ గ్రిడ్ పథకాన్ని చేపడుతున్నామని రాష్ట్ర పంచాయతీ రాజ్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదివారం ఆయన నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి పుల్కల్ మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా సింగూర్ ప్రాజెక్ట్ లోపల కుడి, ఎడమ వైపులా నిర్మించ తలపెట్టిన ఇన్‌టెక్‌వెల్ (వాటర్ గ్రిడ్ పంపింగ్) నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ విజయ్‌కుమార్ ద్వారా ప్రాజెక్ట్ వివరాలను తెలుసుకున్నారు. ఎడమ వైపు నిర్మించే ఇన్‌టెక్ వెల్ నుంచి అందోల్, మెదక్, రామాయంపేట, నారాయణఖేడ్ నియోజక వర్గాల్లోని గ్రామాలకు మంచి నీటిని సరఫరా చేస్తామని, ఇన్‌టెక్ వెల్ నుంచి ప్రాజెక్ట్ లోపలి భాగం వరకు సుమారు కిలోమీటరున్నర పొడవున ఫీడర్ చానల్ కాలువ ద్వారా నీటిని తరలించడం జరుగుతుందని ఎస్ఈ మంత్రి కేటీఆర్‌కు వివరించారు. వేసవి సమీపిస్తున్నందున ఫిల్టర్ బెడ్‌కు సంబంధించిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రాజెక్ట్ కుడి వైపున మునిపల్లి, బుసారెడ్డిపల్లి గ్రామాల శివారులోని మంజీర నదిలో నిర్మించనున్న ఇన్‌టెక్ వెల్ నుంచి సంగారెడ్డి, పటాన్చెరు, జహీరాబాద్ నియోజకవర్గాలకు తాగునీటిని అందిస్తామన్నారు. ఇక్కడ భూ సేకరణ సమస్య లేనందున గ్రిడ్ పనులను వేగవంతంగా చేయాలన్నారు. సింగూర్ ప్రాజెక్టు వద్ద రెండు ఇన్‌టెక్ వెల్స్, ఫిల్టర్ బెడ్ల పనులను వచ్చే నెల మొదటి వారంలోగా ప్రారంభించాలని ఆదేశించారు. గజ్వేల్‌తోపాటు, సిద్దిపేట, దుబ్బాక నియోజక వర్గాలకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ద్వారా నీటి సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వాటర్‌గ్రిడ్‌లో మంజీర నీటి పథకాన్ని విలీనం చేసి, నర్సాపూర్ నియోజక వర్గంలోని అన్ని గ్రామాలకు తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం కృషిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ రాజమణి, ఎమ్మెల్యేలు బాబూమోహన్, చింతా ప్రభాకర్, కలెక్టర్ రాహుల్ బొజ్జా, జిల్లా అధికారులు పాల్గొన్నారు. బుస్సారెడ్డిపల్లిలో స్థలపరిశీలన మునిపల్లి: పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్, నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి ఆదివారం మునిపల్లి మండలం బుస్సారెడ్డిపల్లి గ్రామాన్ని సందర్శించారు. గ్రామ శివారులో నిర్మించనున్న ఇన్‌టెక్ వెల్స్ స్థలాన్ని పరిశీలించారు. మండలంలోని బుదేరా గ్రామ శివారులో 60 లక్షల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంకు ఏర్పాటు చేస్తామని మంత్రులు తెలిపారు. వారి వెంట ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, కలెక్టర్ రాహుల్‌బొజ్జా తదితరులున్నారు. -
వాటర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఏర్పాటు
చైర్మన్, ఎండీ సహా గరిష్టంగా 12 మంది సభ్యులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్ పథకం అమలు, నిర్వహణ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటైంది. దీనికి ‘తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లయ్ కార్పొరేషన్(టీడీడబ్ల్యూఎస్‌సీ)’గా నామకరణం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ కార్పొరేషన్లో చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ సహా సభ్యులు గరిష్టంగా 12 మందికి మించరాదని పేర్కొంది. కార్పొరేషన్ ఉపాధ్యక్షునిగా పంచాయితీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, డెరైక్టర్లుగా గ్రామీణ నీటిసరఫరా విభాగం ఇంజనీర్ ఇన్ ఛీఫ్, ప్రజారోగ్య విభాగం ఇంజనీర్ ఇన్ చీఫ్ వ్యవహరిస్తారు. ఈ కార్పొరేషన్‌ను కంపెనీల చట్టంలోని సెక్షన్ 149 ప్రకారం రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లో నమోదు చేయాల్సి ఉంది. ఒక్కో షేరు ధర రూ. 10 చొప్పున 50 లక్షల షేర్లతో రూ. 5 కోట్ల ఆథరైజ్డ్ క్యాపిటల్‌ను, 20 లక్షల షేర్లతో రూ. 2 కోట్ల పెయిడ్ క్యాపిటల్‌ను సమకూర్చాలని ప్రతిపాదించారు. పెయిడ్ క్యాపిటల్‌లోని 20 ల క్షల షేర్లలో సింహభాగాన్ని గవర్నర్ పేరు మీద, మిగిలిన వాటిని డెరైక్టర్లకు కేటాయించారు. -
దాహం తీరినట్టే..!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో మంచినీటి కొరత తీర్చేందుకు గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు కసరత్తు ప్రారంభించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వాటర్‌గ్రిడ్ పథకాన్ని జిల్లాలోని అన్ని ఆవాసాలకు అనుసంధానం చేయనున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మూడు ప్రాంతాల్లో తాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా నిరంతర నీటి సరఫరాకు ప్రణాళికలు రూపొందించారు. దీనికి ప్రభుత్వం దాదాపు రూ.4వేల కోట్లు వెచ్చించేందుకు సిద్ధమైంది. నేడు మంత్రి కేటీఆర్ పరిశీలన జిల్లాలో వాటర్‌గ్రిడ్ నిర్మాణ నమూనాలు, వాటి ద్వారా ప్రజలకు తాగునీరు అందే విధానాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ నీటి సరఫరా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం పరిశీలిస్తారు. జిల్లాలోని పాలేరు, వైరా ప్రాంతాల్లో పర్యటిస్తారు. జిల్లా ప్రజల తాగునీటి అవసరాలకు సరిపడా నీరందించే అవకాశం గోదావరి పరీవాహక ప్రాంతానికి ఉన్నట్లు గుర్తించారు. వాటర్‌గ్రిడ్ నిర్మాణానికి అనువైనదిగా ఈ ప్రాంతాన్ని తీసుకున్నారు. అశ్వాపురం మండలం పాములపల్లి వద్ద నిరంతరం నీరు అందుబాటులో ఉండే అవకాశం ఉన్న దృష్ట్యా అక్కడ వాటర్‌గ్రిడ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 22 మండలాల్లోని అన్ని ఆవాసాలకు తాగునీరు నిరంతరం సరఫరా చేయాలని నిర్ణయించారు. రిజర్వాయర్ల పరిసరాల్లో.. పాలేరు రిజర్వాయర్ వద్ద నిర్మించే తాగునీటి ప్రాజెక్టు (వాటర్‌గ్రిడ్) ద్వారా ఏడు మండలాల్లోని 365 ఆవాసాలకు నిరంతరం నీటి సరఫరా చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. వైరాలో నిర్మించే వాటర్‌గ్రిడ్ ద్వారా 11 మండలాల్లోని 565 ఆవాసాలకు తాగునీరు అందించనున్నారు. ఇప్పటికే వైరా, పాలేరు, అశ్వాపురం మండలం పాములపల్లి వద్ద నిర్మిస్తున్న గ్రిడ్లను రాష్ట్ర ప్రభుత్వ తాగునీటి సలహాదారు హరి ఉమాకాంతారావుతో పాటు పలువురు అధికారులు సందర్శించారు. సాంకేతిక పరమైన సూచనలు చేశారు. వాటర్‌గ్రిడ్ నిర్మాణ పనులపై జిల్లా రక్షిత మంచినీటి సరఫరా అధికారులు, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు వైరాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. జిల్లాలో ఇప్పటి వరకు తాగునీటికి పడుతున్న ఇబ్బంది, వాటర్‌గ్రిడ్ వల్ల ప్రజలకు కలిగే అదనపు ప్రయోజనం, ఇంటింటికీ పంపు కనెక్షన్ ఇచ్చే తీరు, పైపులైన్లు నిర్మించే విధానాన్ని అధికారులు మంత్రికి వివరిస్తారు. మరికొన్ని మార్పులుండవచ్చు.. ఇప్పటికే వివిధ సర్వేల ద్వారా వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టులకు అనువైన స్థలాన్ని అధికారులు సాంకేతికంగా ఖరారు చేశారు. ఒకవేళ మంత్రి కేటీఆర్ ఏమైనా మార్పులు సూచిస్తే దానికి అనుగుణంగా మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. తొలుత జూలూరుపాడు, ఏన్కూరు మండలాలకు పాములపల్లి వాటర్‌గ్రిడ్ ద్వారా మంచినీటిని సరఫరా చేయాలని అధికారులు భావించారు. అందుకనుగుణంగా ప్రణాళికలు రూపొందించారు. ఆ ప్రాంతాలు పాములపల్లికి అత్యంత దూరం కావడంతో ఈ రెండు మండలాలను వైరా వాటర్‌గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. వైరా వాటర్‌గ్రిడ్ పరిధిలో ఉన్న సత్తుపల్లి, దమ్మపేట, అశ్వారావుపేట మండలాలను పాములపల్లి వాటర్‌గ్రిడ్‌కు అనుసంధానం చేస్తూ ప్రణాళిక రూపొందించారు. వాటర్‌గ్రిడ్‌తోపాటు సెకండరీ గ్రిడ్, మూడు మండలాలకు ఒక హెడ్వర్క్ను నిర్మిస్తారు. దీన్ని ఊరూరా ఉండే హెడ్వర్క్లతో అనుసంధానిస్తారు. నాలుగేళ్లలో జిల్లావ్యాప్తంగా నీరు ఇప్పటి వరకు జిల్లాలో 3,167 గ్రామాల్లో నిరంతరం, 1,282 గ్రామాల్లో పాక్షికంగా నీరు సరఫరా చేస్తున్నారు. వాటర్‌గ్రిడ్ నిర్మాణం పూర్తయితే వచ్చే నాలుగేళ్లలో 3,167 గ్రామాలకు 24 గంటలపాటు నీరు సరఫరా చేసే అవకాశం ఉంది. జిల్లాలోని 580 కిలోమీటర్ల పొడవున్న ప్రధాన పైపులైన్, అక్కడి నుంచి గ్రామాలు, ఆవాస ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేయనున్నారు. దీని కోసం 4,431 కిలోమీటర్ల పొడవైన పైపులైన్ నిర్మించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. జిల్లాలో పలు జలాశయాలు, చెరువుల్లో నీరు నింపి అక్కడి నుంచి నిరంతరం తాగునీటిని అందించేందుకు ప్రణాళికలు రూపొందించారు. వాటర్‌గ్రిడ్ పథకాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తుండటంతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు జిల్లాలో ఈ పథకం విజయవంతానికి పూర్తిస్థాయి దృష్టి సారించారు. -
రూ.4 వేల కోట్లతో వాటర్‌గ్రిడ్‌కు ప్రతిపాదనలు
కూసుమంచి : రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్న వాటర్‌గ్రిడ్ (జలాజలం) పథకాన్ని జిల్లాలో అమలు చేసేందుకు రూ.4 వేల కోట్లతో ప్రతిపాదన లు పంపుతున్నట్లు ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ జగన్మోహన్రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన పాలేరులో విలేకరులతో మాట్లాడారు. పాలేరు, వైరా రిజర్వాయర్లతో పాటు గోదావరి నీటిని వినియోగించి జిల్లాలోని అన్ని గ్రామాలకు తాగునీరు అందించేందుకు ప్రభుత్వానికి ప్రణాళిక అందజేసినట్లు పేర్కొన్నారు. పాలేరు రిజర్వాయర్ పరిధిలోని కూసుమంచి, నేలకొండపపల్లి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్, ఖమ్మం అర్భన్ మండలాలతో పాటు ఖమ్మం నగరానికి, ముదిగొండ మండలంలోని కొన్ని గ్రామాలకు 1.48 టీఎంసీల పాలేరు నీటిని సరఫరా చేస్తామన్నారు. ఖమ్మం నగరానికి మాత్రం శుద్ధిచేయని జలాలను, మిగిలిన మండలాలకు శుద్ధి చేసిన జలాలను సరఫరా చేస్తామన్నారు. వైరా రిజర్వాయర్ సెగ్మెంట్ పరిధిలో వైరా, కొణిజర్ల, బోనక ల్, ఎర్రుపాలెం, మధిర, తల్లాడ, సత్తుపల్లి, కొత్తగూడెం, వేంసూరు,పెనుబల్లి, అశ్వారావుపేట, దమ్మపేట మండలాలకు, నగర పంచాయతీలకు తాగునీరు సరఫరా చేస్తామని వివరించారు. ఇందుకోసం 1.13 టీఎంసీల నీటిని వినియోగించనున్నట్లు తెలిపారు. మిగిలిన మండలాలకు అశ్వాపురం సమీపంలోని పాములపల్లి నుంచి గోదావరి జలాలను తరలిస్తామని చెప్పారు. పాలేరు గ్రిడ్ ద్వారా 365, వైరా గ్రిడ్ ద్వారా 565 హ్యాబిటేషన్లకు రక్షిత నీరు సరఫరా చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరికి రోజుకు 100 లీటర్ల నీటిని సరఫరా చేయాలనే ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. వచ్చే వేసవి నాటికి ఆయా రిజర్వాయర్లలో ఇన్‌టెక్ వెల్ (బావులు) నిర్మాణ పనులు 50 శాతం మేర అయినా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. రిజర్వాయర్‌ను పరిశీలించిన ఉన్నతాధికారులు... పాలేరు రిజర్వాయర్‌ను సోమవారం వాటర్‌గ్రిడ్ చీఫ్ టెక్నికల్ కో ఆర్డినేటర్ సత్యపాల్‌రెడ్డి, ఖమ్మం, వరంగల్ జిల్లాల ఎస్ఈలు జగన్మోహన్రెడ్డి, సురేష్‌కుమార్ పరిశీలించారు. వాటర్‌గ్రిడ్ మ్యాపులను, రిజర్వాయర్‌లో నిర్మించనున్న ఇన్‌టెక్‌వెల్ స్థలాన్ని చూసి, పలు అంశాలపై చర్చించారు. వారివెంట ఆర్డబ్ల్యూఎస్ ఈఈ మల్లేషం గౌడ్, డీఈఈ మాణిక్యాలరావు, ఏఈ మురళీకృష్ణ ఉన్నారు. -
నిర్మల్‌లోఎస్‌ఈ కార్యాలయం!
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్ పథకం పర్యవేక్షక ఇంజినీర్ కార్యాలయాన్ని నిర్మల్‌లో నెలకొల్పనున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్ రెండు జిల్లాలకు కలిపి ఉండే ఈ కార్యాలయాన్ని నిర్మల్‌లో ఏర్పాటు చేయడం ద్వారా రెండు జిల్లాల పనులు, నిర్వహణ ను సులభంగా పర్యవేక్షణ చేయవచ్చని ఆర్డబ్ల్యూఎస్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ రెండు జిల్లాల సరిహద్దుల్లో ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గ్రిడ్ ద్వారా మొత్తం తొమ్మిది నియోజకవర్గాలు, నాలుగు మున్సిపాలి టీలకు తాగునీరందించాలని నిర్ణయించారు. జిల్లాలోని ఆదిలాబాద్, ని ర్మల్, బోథ్ నియోజకవర్గాలతోపాటు, నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూ ర్, బాల్కొండ, కామారెడ్డి, నిజామాబాద్, నిజామాబాద్‌రూరల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాల పరిధిలో 21 మండలాలు ఈ గ్రిడ్ ద్వారా తాగునీటిని సరఫరా చేయాలని భావిస్తున్నారు. ఈ గ్రిడ్‌ను పర్యవేక్షణ కోసం ఎస్ఈ కార్యాలయాన్ని అక్కడే ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. 14 డిప్యూటీ ఈఈ పోస్టులు.. ఈ పథకానికి సంబంధించి ఇంజినీర్ల నియామకాలకు ప్రభుత్వం ఇటీవలే శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 492 ఇంజనీర్లతో సహా, మొత్తం 529 మంది ఉద్యోగుల నియామకాలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా జిల్లాకు నాలుగు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులను మంజూరు చేయనుంది. జిల్లాలో నాలుగు గ్రిడ్లకు అనుమతి మంజూరైన నేపథ్యంలో గ్రిడ్‌కు ఒకరు చొప్పున నలుగురు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులను కేటాయించాలని ఇక్కడి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు గతంలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అలాగే ఒక్కో డివిజన్‌కు ముగ్గురు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల చొప్పున ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ డివిజన్లకు 12 మంది, కడెం, మంచిర్యాల గ్రిడ్లకు ఒక్కొక్కరు చొప్పున మొత్తం 14 మంది డీఈలను కేటాయించనున్నారు. ఈ పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించే జేఈ పోస్టులు సుమారు 55 వరకు మంజూరయ్యే అవకాశాలున్నాయని ఆ శాఖ పర్యవేక్షక ఇంజినీర్ ఇంద్రసేన తెలిపారు. -
మాకొద్దీ పనులు..!
మూడు గ్రిడ్ల సర్వే పనులకు ముందుకురాని ఏజెన్సీలు అర్హత లేని మూడు కంపెనీలను తిరస్కరించిన అధికారులు ఆదిలోనే అవాంతరాలు సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్ పథకానికి ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. జిల్లాకు నాలుగు వాటర్‌గ్రిడ్‌లు మంజూరు కాగా, మూ డు గ్రిడ్ల పనులకు ప్రారం భంలోనే ఇబ్బందులొస్తున్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల గ్రిడ్ల పనులను సర్వే చేసేందుకు ఏ కంపెనీ ముందుకు రావడం లేదు. వచ్చిన ఒకట్రెండు కంపెనీలకు అర్హత లేకపోవడంతో.. వాటిని జిల్లా ఆర్డ బ్ల్యూఎస్ ఉన్నతాధికారులు తిరస్కరించారు. దీంతో కేవలం ఒక్క కడెం గ్రిడ్ పనుల సర్వే మాత్రమే జరుగుతోంది. ఈ నాలుగు గ్రిడ్ల పనుల సర్వే కోసం ఆ శాఖ ఈఎన్సీ కార్యాలయం గత నెలలో టెండర్లు పిలిచిన విషయం విధితమే. ప్రభుత్వం ఆదిలాబాద్ గ్రిడ్ సర్వే కోసం రూ.74 లక్షలు, మంచిర్యాల గ్రిడ్ సర్వే కోసం రూ.36 లక్షలు, ఆసిఫాబాద్ గ్రిడ్ కోసం రూ.1.12 కోట్ల అంచనా వ్యయంగా నిర్ణయించింది. కేవలం మూడు కంపెనీలు టెండర్లలో పాల్గొన్నాయి. ఆయా కంపెనీలు సరైన ధ్రువపత్రాలు దాఖలు చేయలేదని ఈ మూడు కంపెనీలను ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఇటీవల తిరస్కరించారు. మరో వారం రోజుల్లో రెండోసారి టెండర్లు పిలిచే అవకాశాలున్నాయని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రజల తాగునీటి కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర సర్కారు వినూత్నంగా ఈ వాటర్‌గ్రిడ్ పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా రూ.38 వేల కోట్లతో చేపట్టిన ఈ పథకంలో భాగంగా జిల్లాకు రూ.4,390 కోట్లు కేటాయించింది. ఒక్కో వ్యక్తికి పల్లెల్లో వంద లీటర్లు, పట్టణాల్లో 135 లీటర్ల చొప్పున తాగునీటి వసతి కల్పించేందుదకు నాలుగు గ్రిడ్లను మంజూరు చేసింది. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం సన్నాహాల్లో నిమగ్నమైంది. కొలిక్కి వస్తున్న కడెం గ్రిడ్ సర్వే.. జిల్లాలో ఖానాపూర్ నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలకు తాగునీటి వసతి కల్పించేందుకు చేపట్టిన కడెం గ్రిడ్ సర్వే పనులు కొలిక్కి వస్తున్నాయి. ఐదు మండలాల పరిధిలో మొ త్తం 594 నివాసిత ప్రాంతాల (హ్యాబిటేషన్ల)లో ఉన్న 2.78 లక్షల మంది తాగునీటి అవసరాలను తీర్చేందుకు ఈ పనులు చేపట్టనున్నారు. 96 కిలో మీటర్ల పొడవు ఉన్న ఈ గ్రిడ్‌కు రూ. 533 కోట్లు ఖర్చయ్యే అవకాశాలున్నాయని ప్రాథమికంగా ని ర్ధారణకు వచ్చారు. కడెం ప్రాజెక్టు నుంచి తాగు నీటిని సరఫరా చేయనున్నారు. జన్నారం, కడెం మండలాల్లో చేపట్టనున్న పనులకు సంబంధించిన సర్వేను సిద్దూ సర్వీసెస్ కంపెనీ చేపట్టగా, ఖానాపూర్, ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల పనుల సర్వేను ఎస్ఎస్ఎస్ అసోసియేట్‌కు అప్పగించారు. పక్షం రోజుల్లో ఈ కంపెనీలు నివేదికలు ఇచ్చే అవకాశాలున్నాయి. అంచనాలు రూపొందిస్తున్నాం - ఇంద్రసేన, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కడెం గ్రిడ్ సర్వే పనులు పూర్తి కావస్తున్నాయి. పక్షం రోజుల్లో ఈ సర్వే నివేదిక వచ్చే అవకాశాలున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ పనుల అంచనాలను రూపొందిస్తున్నాము. ఇందుకోసం కొందరు ఈఈలకు బాధ్యతలు అప్పగించాము. ఫిబ్రవరి రెండో వారంలో టెండర్లు పిలిచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాము. -
నేడు సిద్దిపేట మంచినీటి ప్రాజెక్టుకు కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టనున్న వాటర్‌గ్రిడ్ పథకంపై మంత్రులకు అవగాహన కల్పించేందుకు సీఎం కేసీఆర్ బుధవారం సిద్దిపేట మంచినీటి ప్రాజెక్టు సందర్శనకు వెళుతున్నారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు ప్రధాన మూలం సిద్దిపేటలోని మంచినీటి పథకమే. సీఎం కేసీఆర్ 18 ఏళ్ల క్రితం సిద్దిపేట ఎమ్మెల్యే (రాష్ట్రమంత్రి కూడా)గా ఉన్న సమయంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. విజయవంతంగా అమలవుతున్న ఈ ప్రాజెక్టు స్ఫూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా వాటర్ గ్రిడ్ పేరిట విస్తరించాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిని పక్కాగా అమలుచేసేందుకు సీఎం కేసీఆరే స్వయంగా మంత్రుల బృందానికి అవగాహన కల్పించాలని నిర్ణయించారు. -
మా‘నీటి’ పథకం
నేడు ఎల్ఎండీకి కేసీఆర్ రాక మంత్రులు, అధికార యంత్రాంగం సైతం ఉదయం 11.30 గంటలకు సీఎం చేరిక సిద్దిపేట నీటి సరఫరా పథకం పరిశీలన కాన్వాయ్ ద్వారా హన్మాజీపల్లె సంపు సందర్శన గంటకుపైగా ఇంటేక్వెల్, పంపుసెట్ పరిశీలన ఏర్పాట్లు సిద్ధం చేసిన జిల్లా యంత్రాంగం బెజ్జంకి/తిమ్మాపూర్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు బుధవారం జిల్లాకు వస్తున్నారు. ఆయనతోపాటు రాష్ర్ట మంత్రులు, ఉన్నతాధికారులతోపాటు సుమారు రెండు వందల మంది గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజనీరింగ్ అధికారులు రానున్నారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వాటర్‌గ్రిడ్ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో.. అందుకు స్ఫూర్తిగా నిలిచిన దిగువ మానేరు డ్యాం (ఎల్ఎండీ)- సిద్దిపేట నీటి సరఫరా పథకం అమలు తీరును మంత్రులు, అధికారులతో కలిసి సీఎం పరిశీలించనున్నారు. ఈ పథకాన్ని తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 1998లో రూ.60 కోట్లతో నిర్మించారు. పర్యటనలో అందులో భాగంగా ఉదయం 11 గంటలకు సీఎం హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి 11.45 గంటలకు లోయర్ మానేరు డ్యాం వద్దకు చేరుకుంటారు. అప్పటికే రాష్ట్ర మంత్రులు, అధికారులు రోడ్డు మార్గాన అక్కడికి విచ్చేస్తారు. అనంతరం మంత్రులు, అధికారులతో కలిసి బెజ్జంకి మండలంలోని మైలారం గుట్ట, హన్మాజీపల్లె సమీపంలోని ఇంటేక్వెల్ పంపుహౌస్‌లను సందర్శిస్తారు. సుమారు గంటకుపైగా అక్కడే ఉంటారు. ఈ పంపుహౌస్ ద్వారా గత పద్నాగేళ్లుగా సిద్దిపేట నియోజకవర్గంలోని 180 గ్రామాలకు విజయవంతంగా నీటిని సరఫరా చేస్తున్న తీరును పరిశీలించడంతోపాటు మంత్రులు, అధికారులకు వివరిస్తారు. విస్తృత ఏర్పాట్లు.. సీఎం రాక నేపథ్యంలో కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య, ఎస్పీ వి.శివకుమార్‌తోపాటు జిల్లా ఉన్నతాధికారులంతా మంగళవారం హన్మాజీపల్లెకు చేరుకుని అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆర్డబ్యూఎస్ ఎస్ఈ హరిబాబు, ఈఈ ప్రకాశ్, ఆర్అండ్బీ ఎస్ఈ చంద్‌లాల్, డీఈ వెంకటరమణ, జేఈ నరేందర్‌లను ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎల్ఎండీకి విచ్చేసి స్థానిక ఎస్సారెస్పీ చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. సీఎం పర్యటనకు విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం పర్యటన సందర్భంగా హెలిప్యాడ్, బ్యారికేడ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వైద్యుల బృందాన్ని, 104, 108 వాహనాలను, మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచాలన్నారు. హెలిప్యాడ్ ఏర్పాట్లు, తాత్కాలిక మరుగుదొడ్లు, బారికేడ్లు, ఇతర సదుపాయాలకు సంబంధించి ఒక్కో అధికారికి ఒక్కో బాధ్యతను అప్పగించారు. టెంట్లు, కుర్చీలు ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్ఈ, జెడ్పీ సీఈవో, 24 గంటల విద్యుత్ సరఫరాను ట్రాన్స్‌కో ఏస్ఈ, పరిశుభ్రతను డీపీవో, భద్రతను ఎస్పీ చూసుకోవాలన్నారు. సీఎం పర్యటన ప్రాంతంలో అంబులెన్స్, 104, 108 వాహనాలు, మెడికల్ టీంని ఏర్పాటు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. సమీక్ష సమావేశంలో జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, ఇన్చార్జి అడిషనల్ జేసీ టి.వీరబ్రహ్మయ్య, జెడ్పీ సీఈవో అంబయ్య, డీఎస్వో చంద్రప్రకాష్, ఆర్డీవో చంద్రశేఖర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శోభ, డీపీవో కుమారస్వామి, టూరిజం అధికారి వెంకటేశ్వర్రావు, ఎల్ఎండీ ఈఈ కరుణాకర్, క్లస్టర్ మెడికల్ ఆఫీసర్ జువేరియా, ఏవో రాజగౌడ్, తహశీల్దార్లు కోమల్‌రెడ్డి, శ్రీనివాస్, ఎంపీడీవో కిషన్‌స్వామి ఉన్నారు. -
నాలుగు వాటర్ గ్రిడ్ల అంచనా వ్యయం
రూ.4,390 కోట్లు ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమినిస్తున్న వాటర్ గ్రిడ్ పథకం కింద జిల్లాలోని నాలుగు గ్రిడ్లకు రూ.4,390 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసింది. ఎస్సారెస్పీ, కడెం, కొమురంభీమ్, ఎల్లంపల్లి ప్రాజెక్టుల నుంచి వాటర్‌గ్రిడ్‌ల కోసం ఈ అంచనా వేశారు. మొదట జిల్లాలో ఐదు వాటర్‌గ్రిడ్‌ల కోసం అంచనాలు రూపొందించినా గడ్డెన్న వాగును తప్పించారు. ముథోల్ నియోజకవర్గం కోసం గడ్డెన్నవాగు నుంచి తాగునీటి సరఫరా కోసం రూ.163 కోట్లతో పనులు నడుస్తుండటంతో వాటర్‌గ్రిడ్‌లో దీన్ని పరిగణలోకి తీసుకోలేదు. కాగా.. రాష్ట్రంలోని పది జిల్లాల్లో 26 వాటర్‌గ్రిడ్‌లు నిర్మిస్తుండగా అందులో ఆరు గ్రిడ్లను ప్రభుత్వం పైలేట్ ప్రాజెక్టులుగా తీసుకుంది. వాటిలో జిల్లాలోని కడెం కూడా ఉంది. కడెం సర్వే మొదలు.. కడెం ప్రాజెక్టు వద్ద వాటర్‌గ్రిడ్ నిర్మాణానికి సర్వే మొదలైంది. 862 కిలో మీటర్లలో పైపులైన్ వేయాల్సి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఖానాపూర్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ప్రధాన పైపులైన్, గ్రామాలకు వెళ్లే సెకండరీ పైపులైన్ పైన పేర్కొన్న కిలో మీటర్లలో విస్తరించి ఉంటుంది. ప్రధానంగా సర్వేలో మొదట అంచనా వేసిన విధంగా ఎన్ని కిలో మీటర్ల మేర పైపులైన్ వేయాల్సి ఉంటుంది, పైపులైన్ కోసం ఎంత ప్రభుత్వ, ప్రైవేటు భూములు సేకరించాల్సి వస్తుంది, మార్గమధ్యలో ఎన్ని కల్వర్టులు అవసరం, ఆఫ్టికల్ ఫైబర్‌లైన్ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి వస్తుందనేది అంచనా వేస్తారు. సర్వే ఆధారంగా గ్రిడ్ డిజైన్‌కు టెండర్ పిలుస్తారు. తదుపరి గ్రిడ్ అంచనా వ్యయాన్ని రూపొందిస్తారు. ప్రస్తుతం జిల్లాలోని నాలుగు వాటర్‌గ్రిడ్‌లకు సంబంధించి ప్రాథమికంగా ఎన్ని కిలో మీటర్లలో పైపులైన్, అంచనా వ్యయాన్ని రూపొందించారు. సర్వే తర్వాత ఇందులో స్వల్పంగా మార్పులు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. వెనువెంటనే.. రాష్ట్రంలో ప్రభుత్వం ఆరు వాటర్గ్రిడ్లను పైలేట్ ప్రాజెక్టుగా తీసుకుని ప్రస్తుతం సర్వే పనులు ప్రారంభించింది. జిల్లాలో కడెం సర్వే పనులు మొదలయ్యాయి. డిసెంబర్లో సర్వే పూర్తిచేసి జనవరిలో నిర్మాణ పనులకు సంబంధించి టెండర్లు పిలవాలని ప్రభుత్వం యోచిస్తోంది. మార్చిలో పనులు ప్రారంభించాలని తలుస్తున్నారు. పైలేట్ ప్రాజెక్టు నిర్మాణ పనులు మొదలు కాగానే జనవరిలో మిగితా గ్రిడ్ల సర్వే కోసం టెండర్లు నిర్వహించి ఫిబ్రవరిలో సర్వే పూర్తి చేసి, మార్చి లేదా ఏప్రిల్‌లో నిర్మాణ పనులకు సంబంధించిన టెండర్లు నిర్వహించి పనులు ప్రారంభించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఎస్సారెస్పీ, కొమురంభీమ్, ఎల్లంపల్లి సర్వే పనులు వెనువెంటనే ఉంటాయని చెబుతున్నారు. వాటర్‌గ్రిడ్ స్వరూపం.. తాగునీటి, ఇతర అవసరాలకు గ్రామీణ ప్రాంతాల్లో ఒక మనిషికి రోజుకు వంద లీటర్లు, అర్బన్‌లో 135 లీటర్ల నీరు సరఫరా చేసేందుకు ప్రభుత్వం వాటర్‌గ్రిడ్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. రెండు నెలల కిందట ఏయే ప్రాజెక్టుల నుంచి నియోజకవర్గాలు, మండలాలకు నీటి సరఫరా చేయాల్సి ఉంటుందనేది ప్రాథమికంగా అంచనా వేశారు. 2030 సంవత్సరం జనాభాకు అనుగుణంగా తాగునీటి అసవరాలకు ఎన్ని టీఎంసీల నీళ్లు అవసరమవుతాయో కూడా నిర్ధారించారు. ఎస్సారెస్పీ నుంచి నిర్మల్‌లోని ఐదు మండలాలు, బోథ్‌లో ఏడు, ఆదిలాబాద్‌లోని మూడు మండలాలకు కలిపి 2.8 టీఎంసీలు, ఎల్లంపల్లి కింద మంచిర్యాలలోని మూడు, చెన్నూర్‌లోని నాలుగు, బెల్లంపల్లిలోని ఆరు మండలాలు కలిపి 1.673 టీఎంసీలు, కొమురంభీమ్ కింద సిర్పూర్(టి) నియోజకవర్గంలో ని ఐదు, ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలకు కలిపి 1.011 టీఎంసీల నీరు అవసరమని గుర్తించారు. ఎస్సారెస్పీ నుంచి ఆదిలాబాద్‌కు పైపులైన్‌ను జాతీయ రహదారి మీదుగా వేయాలని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మహెబూబ్ఘాట్ మీదు గా పైపులైన్‌ను వేయడం భారంతో కూడింద ని, అదేవిధంగా నిర్మాణంలో కూడా ఖర్చు అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. జాతీయ రహదారి మీదుగా దూరం పెరిగినా పైపులైన్ అక్కడి నుంచే వేయాలని అనుకుంటున్నారు. కాగా.. ప్రాజెక్టు వద్ద గ్రిడ్ నుంచి మండల కేంద్రాలు, పట్టణాల వరకు మెయిన్ పైపులైన్ వేస్తుండగా, మండల కేంద్రాలు, పట్టణాల నుంచి గ్రామాలకు సెకండరి పైపులైన్ కిలో మీటర్లను ప్రాథమికంగా గుర్తించారు. సర్వే అనంతరం ఇది కొంత మారే అవకాశం ఉంటుంది. జిల్లాలో నాలుగు కార్యాలయాలు.. రానున్న రోజుల్లో గ్రామీణ నీటి సరఫరా శాఖను వాటర్‌గ్రిడ్ కార్పొరేషన్‌గా మార్చే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇదిలా ఉంటే జిల్లాలో వాటర్‌గ్రిడ్‌ల కోసం నాలుగు కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. ఎస్సారెస్పీకి సంబంధించి నిర్మల్‌లో, కడెంకు సంబంధించి కడెంలోనే, కొమురంభీమ్‌కు సంబంధించి 20 కి.మీ.ల దూరంలో ఉండే ఆసిఫాబాద్‌లో, ఎల్లంపల్లికి సంబంధించి మంచిర్యాలలో కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. గ్రిడ్‌కు ఈఈలను నియమించనున్నారు. అదేవిధంగా నిపుణులైన సిబ్బందిని నియమించుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ జిల్లా అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఏఈల ఆవశ్యకత ఉంది. ఈ దృష్ట్యా సుమారు 50 మంది ఏఈలను నియమించే అవకాశాలు ఉన్నాయి. -
వాటర్‌గ్రిడ్ మాస్టర్‌ప్లాన్ రెడీ!.
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో రాబోయే నాలుగేళ్లలో ఇంటింటికీ నల్లా కనెక్షన్ మంజూరుకు ఉద్దేశించిన వాటర్‌గ్రిడ్ పథకం అంచనాలు సిద్ధమయ్యాయి. సుమారు కోటి జనాభాకు చేరువైన మహానగర దాహార్తిని తీర్చేందుకు వెయ్యి చదరపు కిలోమీటర్ల పరిధిలో మంచినీటి సరఫరా పైప్‌లైన్ గ్రిడ్ ఏర్పాటుకు రూ.13,495 కోట్ల అంచనా వ్యయంతో జలమండలి సమగ్ర ప్రతిపాదనలు సిద్ధంచేసింది. వీటికి సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపితే పథకం పనులు మొదలుకానున్నాయి. గ్రిడ్‌కు సంబంధించిన ప్రాథమిక కసరత్తును జలమండలి పూర్తిచేసింది. ఇందుకోసం ఓ మాస్టర్‌ప్లాన్ ప్రణాళిక చిత్రపటాన్ని కూడా రూపొందించింది. గ్రిడ్ పరిధిలో ఏర్పాటు చేయాల్సిన పైప్లైన్లు, స్టోరేజీ రిజర్వాయర్లు, పంపింగ్ స్టేషన్లు, గ్రావిటీ ఆధారంగా నీటిసరఫరా తదితర అంశాలపై సమగ్ర డిజైనింగ్, డ్రాయింగ్లు పూర్తిచేసే సాంకేతిక పనులను ప్రముఖ సివిల్ ఇంజినీరింగ్ కన్సల్టెన్సీకి అప్పగించాలని నిర్ణయించింది. అయితే గ్రేటర్ వాటర్‌గ్రిడ్ ముఖచిత్రంపై త్వరలో ముఖ్యమంత్రి సమక్షంలో ఉన్నతస్థాయి సమీక్షాసమావేశం జరగనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ సమావేశంలో గ్రిడ్ కార్యాచరణకు శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. తీరనున్న శివార్ల దాహార్తి ... గ్రేటర్లో విలీనమైన పలు శివారు మున్సిపాల్టీల్లో ప్రస్తుతం మంచినీటి సరఫరా తీరును పరిశీలిస్తే...శేరిలింగంపల్లిలో కేవలం 30 శాతం ప్రాంతాలకే నీటి సరఫరా పైప్‌లైన్ నెట్వర్క్ ఉంది. రాజేంద్రనగర్‌లో 45 శాతం, కుత్భుల్లాపూర్‌లో 50 శాతం, మల్కాజ్‌గిరిలో 65 శాతం, కూకట్‌పల్లిలో 70 శాతం, ఉప్పల్‌లో 82.5 శాతం, ఎల్బీనగర్లో 85 శాతం, కాప్రాలో 85 శాతం, అల్వాల్‌లో 90 శాతం ప్రాంతాలకే మంచినీటి సరఫరా నెట్వర్క్ ఉంది. ఈనేపథ్యంలో మిగతా ప్రాంతాల్లో పైప్‌లైన్ నెట్వర్క్ విస్తరణ, స్టోరేజి రిజర్వాయర్లు, పంప్‌హౌజ్‌ల నిర్మాణానికి ఈ గ్రిడ్ పథకంలో స్థానం కల్పించడం విశేషం. -
వాటర్‌గ్రిడ్ మాస్టర్‌ప్లాన్ రెడీ!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో రాబోయే నాలుగేళ్లలో ఇంటింటికీ నల్లా కనెక్షన్ మంజూరుకు ఉద్దేశించిన వాటర్‌గ్రిడ్ పథకం అంచనాలు సిద్ధమయ్యాయి. సుమారు కోటి జనాభాకు చేరువైన మహానగర దాహార్తిని తీర్చేందుకు వెయ్యి చదరపు కిలోమీటర్ల పరిధిలో మంచినీటి సరఫరా పైప్‌లైన్ గ్రిడ్ ఏర్పాటుకు రూ.13,495 కోట్ల అంచనా వ్యయంతో జలమండలి సమగ్ర ప్రతిపాదనలు సిద్ధంచేసింది. వీటికి సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపితే పథకం పనులు మొదలుకానున్నాయి. గ్రిడ్‌కు సంబంధించిన ప్రాథమిక కసరత్తును జలమండలి పూర్తిచేసింది. ఇందుకోసం ఓ మాస్టర్‌ప్లాన్ ప్రణాళిక చిత్రపటాన్ని కూడా రూపొందించింది. గ్రిడ్ పరిధిలో ఏర్పాటు చేయాల్సిన పైప్లైన్లు, స్టోరేజీ రిజర్వాయర్లు, పంపింగ్ స్టేషన్లు, గ్రావిటీ ఆధారంగా నీటిసరఫరా తదితర అంశాలపై సమగ్ర డిజైనింగ్, డ్రాయింగ్లు పూర్తిచేసే సాంకేతిక పనులను ప్రముఖ సివిల్ ఇంజినీరింగ్ కన్సల్టెన్సీకి అప్పగించాలని నిర్ణయించింది. అయితే గ్రేటర్ వాటర్‌గ్రిడ్ ముఖచిత్రంపై త్వరలో ముఖ్యమంత్రి సమక్షంలో ఉన్నతస్థాయి సమీక్షాసమావేశం జరగనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ సమావేశంలో గ్రిడ్ కార్యాచరణకు శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. తీరనున్న శివార్ల దాహార్తి ... * గ్రేటర్లో విలీనమైన పలు శివారు మున్సిపాల్టీల్లో ప్రస్తుతం మంచినీటి సరఫరా తీరును పరిశీలిస్తే...శేరిలింగంపల్లిలో కేవలం 30 శాతం ప్రాంతాలకే నీటి సరఫరా పైప్‌లైన్ నెట్వర్క్ ఉంది. * రాజేంద్రనగర్‌లో 45 శాతం, కుత్భుల్లాపూర్‌లో 50 శాతం, మల్కాజ్‌గిరిలో 65 శాతం, కూకట్‌పల్లిలో 70 శాతం, ఉప్పల్‌లో 82.5 శాతం, ఎల్బీనగర్లో 85 శాతం, కాప్రాలో 85 శాతం, అల్వాల్‌లో 90 శాతం ప్రాంతాలకే మంచినీటి సరఫరా నెట్వర్క్ ఉంది. ఈనేపథ్యంలో మిగతా ప్రాంతాల్లో పైప్‌లైన్ నెట్వర్క్ విస్తరణ, స్టోరేజి రిజర్వాయర్లు, పంప్‌హౌజ్‌ల నిర్మాణానికి ఈ గ్రిడ్ పథకంలో స్థానం కల్పించడం విశేషం. గ్రేటర్ వాటర్‌గ్రిడ్ అంచనాలివే ఔటర్ రింగ్‌రోడ్డుకు లోపల ఉన్న ప్రాంతాల్లో గ్రేటర్ వాటర్‌గ్రిడ్ ఏర్పాటుకానుంది. సుమారు వెయ్యి చదరపు కిలోమీటర్ల పరిధిలో 2021 సంవత్సరం నాటికి పెరగనున్న జనాభా, ఐటీ, హార్డ్‌వేర్ పరిశ్రమల విస్తరణ, పారిశ్రామికీకరణ అవసరాలకు వినియోగించే నీటి డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని చేపట్టబోయే వాటర్‌గ్రిడ్ పనులు-వాటి అంచనా వ్యయాలిలా ఉన్నాయి. (నిధులు రూ.కోట్లలో) * కృష్ణా హెడ్‌వర్క్స్ పనులు: రూ.1184 * కృష్ణా ఫేజ్-4 (110కి.మీ): రూ.1760 * కృష్ణాఫేజ్-4 నీటిశుద్ధికేంద్రాలు, రిజర్వాయర్ల నిర్మాణం: రూ.848 * ఔటర్‌రింగ్‌రోడ్డు చుట్టూ 160 కి.మీ పరిధిలో 3000 డయా వ్యాసార్థంగల నీటి పంపిణీ పైప్లైన్ల ఏర్పాటు: రూ.2860 * ఔటర్‌లోపల నీటిపంపిణీకి 1000 డయా వ్యాసార్థంగల రేడియల్ మెయిన్పైప్లైన్ల ఏర్పాటు:రూ.1040 * జీహెచ్ఎంసీ పరిధిలో అన్ని కాలనీలు,బస్తీలకు నీటిసరఫరా పైప్‌లైన్ నెట్వర్క్ ఏర్పాటు:రూ.3195 * శివారు మున్సిపాల్టీలు, గ్రామపంచాయతీలు, నగరపంచాయతీలకు నీటి పంపిణీకి 3653 కి.మీపైప్లైన్ల ఏర్పాటు-రూ.2608 * మొత్తం:13,495 కోట్లు -
అమ్మా..పింఛన్లు వస్తున్నయా?
వృద్ధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ మాటామంతీ నల్లగొండ జిల్లా గుడిమల్కాపురంలో ఫ్లోరైడ్ బాధితుడిని వాహనం దిగి పలకరించిన సీఎం ఈ నెలాఖరుకల్లా అర్హులందరికీ పింఛన్లు ఇస్తామని ప్రకటన త్వరలోనే వాటర్‌గ్రిడ్ పథకం {పారంభించేందుకు వస్తానన్న సీఎం చౌటుప్పల్, న్యూస్‌లైన్: ‘‘అమ్మా పింఛన్ వస్తుందా..? భయపడాల్సిన అవసరం లేదు.. ఈ నెలాఖరుకల్లా అర్హులందరికీ పింఛన్లు ఇస్తాం.. వాటర్‌గ్రిడ్ ప్రారంభించేందుకు మళ్లీ వస్తా... ఇదే వేపచెట్టు కింద కూర్చొని అన్ని మాట్లాడుకుందాం.. సమస్యలన్నీ పరిష్కరించుకుందాం...’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వృద్ధులకు భరోసా ఇచ్చారు. ఆదివారం నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం లింగవారిగూడెంలో మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తల్లి కమలమ్మ దశదినకర్మ కార్యక్రమానికి హాజరై వెళ్తూ మార్గమధ్యంలో వికలాంగులు, వృద్ధులతో సీఎం మాట్లాడారు. సీఎం వెళ్లే సమయంలో గుడిమల్కాపురంలో రోడ్డు పక్కన ఉన్న ఓ ఫ్లోరైడ్ బాధితుడు చెయ్యెత్తి సీఎంకు నమస్కారం చేశాడు. అది అలాగే గుర్తుంచుకున్న కేసీఆర్.. తిరుగు ప్రయాణంలో అక్కడే కూర్చున్న బాధితుడిని చూసి కాన్వాయ్ ఆపారు. వాహనం నుంచి దిగి ఆ వికలాంగుడి వద్దకు వెళ్లి పలకరించారు. సీఎంను చూసిన గ్రామస్తులు పెద్దఎత్తున గుమికూడారు. దీంతో కేసీఆర్ పింఛన్లపై ఆరా తీశారు. గ్రామస్తులతో 20 నిమిషాలపాటు మాట్లాడారు. వారి సంభాషణ ఇలా సాగింది. సీఎం: నీ పేరే మిటి, వయసెంత? ఫ్లోరైడ్ బాధితుడు: నా పేరు సుర్వి వెంకటేశం.. వయస్సు 50 ఏళ్లు. సీఎం: అంగవైకల్యం ఎప్పట్నుంచి ఉంది? వెంకటేశం: ఐదేండ్లున్నప్పట్నుంచి ఇలాగే ఉన్నా. సీఎం: పింఛన్ వస్తుందా? వెంకటేశం: రూ.500 వస్తున్నాయి. ఈ నెల ఇయ్యలే. వస్తదో, రాదో తెలియడం లేదు సీఎం: ఏం ఆందోళన లేదు. వికలాంగులందరికీ పింఛన్లు వస్తయ్. సీఎం: ఏమ్మా.. పింఛన్ వస్తుందా? (పక్కనే ఉన్న వృద్ధులు యశోదమ్మ, రాములమ్మ, బుచ్చమ్మలతో..) యశోదమ్మ: 200 రూపాయలు వస్తున్నయి. ఈ నెల ఇయ్యలే, వస్తదో రాదో తెలుస్తలేదు. భయమేస్తుంది. సీఎం: భయపడాల్సిన అవసరం లేదు, ఈ నెలాఖరుకల్లా అర్హులందరికీ పింఛన్లు ఇస్తాం రాములమ్మ: సారూ.. భూములు, ఇండ్లు, మో టార్లున్నయని పింఛన్లు, రేషన్‌కార్డులు ఇయ్యరట.. నలుగురైదుగురు కొడుకులున్నా.. తల్లిదండ్రులను చూడడం లేదు. ఎక్కడ్నో పోయి బతుకుతుండ్రు. ఉన్న ఇండ్లు బువ్వ పెడుతయా? వృద్ధులందరికీ పింఛన్లు ఇయ్యాలె. ఈ సందర్భంగా మరికొందరు మాట్లాడుతూ.. ‘‘మాకు సాగు జలాలు కూడా లేవు. భూములన్నీ పడావు పడ్డాయి. నక్కలగండిని చేపట్టాలి. తాగునీళ్లు కూడా సరిగా లేవు’’ అంటూ పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అందుకు సీఎం స్పందిస్తూ.. ‘‘అర్హులైన వారందరికీ పింఛన్లు వస్తయి. వచ్చేనెలలో వాటర్‌గ్రిడ్ ప్రారంభించేందుకు మళ్లీ వస్తా. ఇక్కడే ఇదే వేపచెట్టు కింద కూర్చొని అన్నీ మాట్లాడుకుందాం.. అన్ని సమస్యలను పరిష్కరించుకుందాం’’ అని భరోసా ఇచ్చారు. అనంతరం సీఎం అక్కడే ఉన్న జిల్లా కలెక్టర్ చిరంజీవులును పిలిచి తనతో మాట్లాడిన ఇద్దరు వృద్ధుల పేర్లు పింఛన్ల లిస్టులో ఉన్నాయో.. లేవో చూసి చెప్పాలని సూచించి, అక్కడ్నుంచి బయల్దేరారు. అనంతరం కలెక్టర్ లిస్టు చూసి.. సీఎంకు ఫోన్ చేసి వారిద్దరి పేర్లు ఉన్నాయని తెలిపారు. -
మహిళల ఆధ్వర్యంలో వాటర్‌గ్రిడ్
గుజరాత్ పద్ధతులను అనుసరిస్తాం: మంత్రి కేటీఆర్ హైదరాబాద్: తెలంగాణలో వాటర్ గ్రిడ్ పథకం నిర్వహణ బాధ్యతను స్వయం సహా యక సంఘాలకు అప్పగించే అవకాశాన్ని పరిశీ లిస్తామని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును మిషన్‌మోడ్‌లో ముందుకు తీసికెళతామన్నారు. గుజరాత్లో అమలవుతున్న వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును, అక్కడి పరిజ్ఞానాన్ని, ప్రణాళికలను అధ్యయనం చేశాక.. తెలంగాణలో వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయగలమన్న నమ్మకం కలిగిందని, ఈ మేరకు పర్యటన విజయవంతమైందని చెప్పారు. గుజరాత్ పద్ధతులు అన్వయిస్తాం.. గుజరాత్ వాటర్‌గ్రిడ్‌కు తెలంగాణ వాటర్ గ్రిడ్‌కు కొన్ని సారూప్యతలతో పాటు స్థూలంగా పలు తేడాలున్నాయని కేటీఆర్ అన్నారు. ఆ రాష్ట్రంలో విజయవంతమైన కొన్ని పద్ధతులను తెలంగాణలో అన్వయించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ముఖ్యంగా అక్కడ వాటర్‌గ్రిడ్ ద్వారా నీటిని సరఫరా చేసే బాధ్యత వహిస్తున్న ‘పన్నీ సమితి’ పనితీరును మంత్రి అభినందించారు. గ్రామాల్లో ఉన్న వాటర్‌గ్రిడ్ వ్యవస్థ నిర్వహణ, పంపిణీ కార్యక్రమాలను అక్కడి మహిళలే చేస్తుండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కాగా.. గుజరాత్ రెండోరోజు పర ్యటనలో మంత్రి కేటీఆర్.. నోవడా వాటర్‌గ్రిడ్ కేంద్రాన్ని సందర్శించారు. 78 లక్షల మందికి సురక్షితమైన నీరు అందించేలా.. రూ. 417 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టును గుజరాత్ సీఎం ఈ ఏడాది జూలైలో ప్రారంభించారు. 12 మోటర్లతో 8 టీఎంసీల నీటిని 2,325 గ్రామాలకు, 38 పట్టణాలకు సరఫరా చేస్తున్న తీరును మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా గుజరాత్ అధికారులు మాట్లాడుతూ.. తెలంగాణ వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు నిర్మాణంలో అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు తాము సహకరిస్తామన్నారు. -
తీరనున్న తాగునీటి కష్టాలు !
శంషాబాద్: గ్రామాల్లో తాగునీటి కష్టాలు తీరనున్నాయి. సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని నిర్ణయించిన వాటర్ గ్రిడ్ పథకంతో సమస్యలకు అడ్డుకట్ట పడనుంది. ఈ పథకంతో మండలంలోని అన్ని గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు తొలగనున్నాయి. సర్కారు ఆదేశాలతో గ్రామీణ నీటి సరఫరా విభాగం వాటర్‌గ్రిడ్‌కు సంబంధించిన సర్వేను పూర్తి చేసి నివేదికను పంపేందుకు సిద్ధమైంది. మండలంలో మొత్తం మూడు పాయింట్లుగా నీటి సరఫరా చేయడానికి ఇందులో ప్రతిపాదించారు. నాగార్జునసాగర్ నుంచి కల్వకుర్తి, ఆమన్‌గల్ మీదుగా వచ్చే నీటి సరఫరాకు మహేశ్వరం మండలం హర్షగూడలో ప్రధాన పంపింగ్పాయింట్గా నిర్ణయించారు. శంషాబాద్ మండలంలోని పెద్ద గోల్కొండ, రాళ్లగూడ, సరూర్‌నగర్ మండలంలోని పహడిషరీఫ్ పాయింట్లుగా నీటి సరఫరా చేయడానికి ప్రణాళికలు రూపొందించారు. ప్రణాళిక వ్యయం సుమారు రూ.51 కోట్లు కావచ్చనే అంచనాలను కూడా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు రూపొందించారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణం చేయాల్సిన ఒవర్‌హెడ్ ట్యాంకులు, సంపులకు మరో రూ.10 కోట్ల అంచనాను ఇందులో పొందుపర్చారు. శంషాబాద్ మండలానికి ప్రతిరోజు 15 లక్షల 80 వేల లీటర్ల నీటి సరఫరా అవసరాన్ని గుర్తించి ఈ అంచనాను సిద్ధం చేసినట్లు సమాచారం. మెట్రోవాటర్ ఇక అంతే.. వాటర్ గ్రిడ్ పథకాన్ని పట్టాలెక్కించే యోచనలో ఉన్న సర్కారు జలమండలితో శంషాబాద్‌కు కృష్ణా నీటిని సరఫరా చేయాలనే ప్రతిపాదనలను దాదాపు విరమించుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి. శంషాబాద్ పట్టణానికి రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్‌దేవ్‌పల్లి రిజర్వాయర్ నుంచి సరఫరా చేయడానికి పైప్‌లైన్ పనులు పూర్తి చేసి కృష్ణా నీటిని సరఫరా చేసినా అది మూన్నాళ్లముచ్చటగానే మారింది. వన్‌టైమ్ కనెక్షన్ డిపాజిట్ కింద జలమండలికి చెల్లించాల్సిన రూ.13 కోట్లు ప్రభుత్వం నేటికీ చెల్లించకపోవడంతో నీటి సరఫరాను నిలిపివేశారు. ప్రస్తుతం వాటర్‌గ్రిడ్ పథకంలో జల్లపల్లి మీదుగా వచ్చే పైప్‌లైన్‌కు పహడిషరీఫ్ పాయింట్‌గా నీటి సరఫరా చేయాలనే యోచనలో అధికారులున్నారు. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో జలమండలి నుంచి శంషాబాద్‌కు నీటి సరఫరా అయ్యే అవకాశాలు దాదాపు ముగిసినట్లేననే వాదనలు వినిపిస్తున్నాయి. -
ఓటమిలేని జీవితం నాది: కెసిఆర్
హైదరాబాద్: ఓటమి అనేది తన జీ వితంలో లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు చెప్పారు. అనుకున్నది ప్రతి ఒక్కటీ సాధించానన్నారు. ''తెలంగాణ రాదన్నారు. సాధించి చూపించాను''అని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణ తాగునీటి గ్రిడ్ ఏర్పాటు చేస్తామన్నారు. మూడున్నర ఏళ్లలో తెలంగాణలోని ప్రతి ఇంటికి మంచినీటి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యమంలా ఈ కార్యక్రమం చేపడుతామన్నారు. వాటర్ గ్రిడ్ ఏర్పాటుపై తెలంగాణలో సర్వే నిర్వహిస్తాని చెప్పారు. గతంలో నిర్వహించిన కుటుంబ సర్వేకు విశేష స్పందన వచ్చిందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడి కూడా తెలంగాణ సర్వే గురించి అడిగారని చెప్పారు. దేశవ్యాప్తంగా ఇలాంటి సర్వే నిర్వహించాలని ప్రధాని మోడీకి తాను సూచించానని కేసీఆర్ చెప్పారు. ** -
వాటర్ గ్రిడ్ పథకానికి 50 శాతం నిధులివ్వండి
కేంద్రానికి తెలంగాణ ఐటీ మంత్రి : కేటీఆర్ విజ్ఞప్తి న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ పథకానికి 50 శాతం నిధులు ఇవ్వాలని ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. గుజరాత్ స్ఫూర్తిగా తెలంగాణలో గ్రామీణ నీటి సరఫరా, ప్రజారోగ్య, హైదరాబాద్ మెట్రో నీటిసరఫరా విభాగాన్ని అనుసంధానం చేస్తూ రూ.24వేల కోట్లతో వాటర్ గ్రిడ్ పథకాన్ని చేపట్టబోతున్నట్టు కేంద్రానికి వివరించామన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో సోమవారం నిర్వహించిన ‘‘జాతీయ గ్రామీణ తాగునీటి పథకం, నిర్మల్ భారత్ అభియాన్’’ సమీక్షా సమావేశంలో పాల్గొన్న అనంతరం కేటీఆర్ ఇక్కడ మీడియాతో మాట్లాడారు. స్వస్త్భారత్, స్వచ్ఛ భారత్‌కు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నా రు. 2019 నాటికి ప్రతి ఇంటిలో ఒక మరుగుదొ డ్డి ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పాఠశాలల్లో మరుగుదొడ్డి నిర్మాణ వ్యయం రూ.60వేలు, అంగన్వాడీల్లో మరుగుదొడ్డి నిర్మాణవ్యయం రూ.12వేలకు పెంచాలని కేంద్రాన్ని కోరామన్నారు. ఓవర్‌హెడ్ ట్యాంక్ నిర్వహణకు కేంద్రం ఇస్తున్న నిధులను 15 శాతం నుంచి 25 శాతానికి పెంచాలన్నారు. రాష్ట్రస్థాయి వాటర్మిషన్కు నిధులు కేటాయిస్తే నిర్మల్ గ్రామీణ పురస్కార్‌కు తెలంగాణ నుంచి గ్రామాలు వస్తాయన్నారు. రూ.200ల పింఛన్‌ను రూ.1000, రూ.500ల పింఛను రూ.1500లకు పెంచనున్నామని, ఇందులో వాటాను భరించాలని కేంద్రాన్ని కోరామన్నారు. తెలంగాణకు వారసత్వసంపదగా విద్యుత్సమస్యను గత పాలకులు ఇచ్చారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ‘‘మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 70 రోజులైంది. వి ద్యుత్ సమస్యను టీఆర్ఎస్, ప్రభుత్వం సృష్టిం చింది కాదు. మా కన్నా ముందు పాలించిన రెం డుపార్టీలు వారసత్వసంపదగా ఇచ్చాయి. బొగ్గు నిక్షేపాలు, గోదావరి నీళ్లు ఉన్నప్పటికీ విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయకపోగా కనీసం గ్రిడ్ కనెక్టివిటీని పెట్టలేకపోయిన దౌర్భాగ్యస్థితి’’ అని ఒక ప్రశ్నకు సవూధానంగా చెప్పారు.