వాటర్ గ్రిడ్ పథకానికి 50 శాతం నిధులివ్వండి
కేంద్రానికి తెలంగాణ ఐటీ మంత్రి : కేటీఆర్ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ పథకానికి 50 శాతం నిధులు ఇవ్వాలని ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. గుజరాత్ స్ఫూర్తిగా తెలంగాణలో గ్రామీణ నీటి సరఫరా, ప్రజారోగ్య, హైదరాబాద్ మెట్రో నీటిసరఫరా విభాగాన్ని అనుసంధానం చేస్తూ రూ.24వేల కోట్లతో వాటర్ గ్రిడ్ పథకాన్ని చేపట్టబోతున్నట్టు కేంద్రానికి వివరించామన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో సోమవారం నిర్వహించిన ‘‘జాతీయ గ్రామీణ తాగునీటి పథకం, నిర్మల్ భారత్ అభియాన్’’ సమీక్షా సమావేశంలో పాల్గొన్న అనంతరం కేటీఆర్ ఇక్కడ మీడియాతో మాట్లాడారు. స్వస్త్‌భారత్, స్వచ్ఛ భారత్‌కు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నా రు. 2019 నాటికి ప్రతి ఇంటిలో ఒక మరుగుదొ డ్డి ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పాఠశాలల్లో మరుగుదొడ్డి నిర్మాణ వ్యయం రూ.60వేలు, అంగన్‌వాడీల్లో మరుగుదొడ్డి నిర్మాణవ్యయం రూ.12వేలకు పెంచాలని కేంద్రాన్ని కోరామన్నారు. ఓవర్‌హెడ్ ట్యాంక్ నిర్వహణకు కేంద్రం ఇస్తున్న నిధులను 15 శాతం నుంచి 25 శాతానికి పెంచాలన్నారు. రాష్ట్రస్థాయి వాటర్‌మిషన్‌కు నిధులు కేటాయిస్తే నిర్మల్ గ్రామీణ పురస్కార్‌కు తెలంగాణ నుంచి గ్రామాలు వస్తాయన్నారు.
రూ.200ల పింఛన్‌ను రూ.1000, రూ.500ల పింఛను రూ.1500లకు పెంచనున్నామని, ఇందులో వాటాను భరించాలని కేంద్రాన్ని కోరామన్నారు. తెలంగాణకు వారసత్వసంపదగా విద్యుత్‌సమస్యను గత పాలకులు ఇచ్చారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ‘‘మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 70 రోజులైంది. వి ద్యుత్ సమస్యను టీఆర్‌ఎస్, ప్రభుత్వం సృష్టిం చింది కాదు. మా కన్నా ముందు పాలించిన రెం డుపార్టీలు వారసత్వసంపదగా ఇచ్చాయి. బొగ్గు నిక్షేపాలు, గోదావరి నీళ్లు ఉన్నప్పటికీ విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయకపోగా కనీసం గ్రిడ్ కనెక్టివిటీని పెట్టలేకపోయిన దౌర్భాగ్యస్థితి’’ అని ఒక ప్రశ్నకు సవూధానంగా చెప్పారు.