మహిళల ఆధ్వర్యంలో వాటర్‌గ్రిడ్
గుజరాత్ పద్ధతులను అనుసరిస్తాం: మంత్రి కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణలో వాటర్ గ్రిడ్ పథకం నిర్వహణ బాధ్యతను స్వయం సహా యక సంఘాలకు అప్పగించే అవకాశాన్ని పరిశీ లిస్తామని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును మిషన్‌మోడ్‌లో ముందుకు తీసికెళతామన్నారు. గుజరాత్‌లో అమలవుతున్న వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును, అక్కడి పరిజ్ఞానాన్ని, ప్రణాళికలను అధ్యయనం చేశాక.. తెలంగాణలో వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయగలమన్న నమ్మకం కలిగిందని, ఈ మేరకు పర్యటన విజయవంతమైందని చెప్పారు.
గుజరాత్ పద్ధతులు అన్వయిస్తాం..
గుజరాత్ వాటర్‌గ్రిడ్‌కు తెలంగాణ వాటర్ గ్రిడ్‌కు కొన్ని సారూప్యతలతో పాటు స్థూలంగా పలు తేడాలున్నాయని కేటీఆర్ అన్నారు. ఆ రాష్ట్రంలో విజయవంతమైన కొన్ని పద్ధతులను తెలంగాణలో అన్వయించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ముఖ్యంగా అక్కడ వాటర్‌గ్రిడ్ ద్వారా నీటిని సరఫరా చేసే బాధ్యత వహిస్తున్న ‘పన్నీ సమితి’ పనితీరును మంత్రి అభినందించారు. గ్రామాల్లో ఉన్న వాటర్‌గ్రిడ్ వ్యవస్థ నిర్వహణ, పంపిణీ కార్యక్రమాలను అక్కడి మహిళలే చేస్తుండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కాగా.. గుజరాత్ రెండోరోజు పర ్యటనలో మంత్రి కేటీఆర్.. నోవడా వాటర్‌గ్రిడ్ కేంద్రాన్ని సందర్శించారు. 78 లక్షల మందికి సురక్షితమైన నీరు అందించేలా.. రూ. 417 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టును గుజరాత్ సీఎం ఈ ఏడాది జూలైలో ప్రారంభించారు. 12 మోటర్లతో 8 టీఎంసీల నీటిని 2,325 గ్రామాలకు, 38 పట్టణాలకు సరఫరా చేస్తున్న తీరును మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా గుజరాత్ అధికారులు మాట్లాడుతూ.. తెలంగాణ వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు నిర్మాణంలో అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు తాము సహకరిస్తామన్నారు.