రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టనున్న వాటర్‌గ్రిడ్ పథకంపై మంత్రులకు అవగాహన కల్పించేందుకు సీఎం కేసీఆర్ బుధవారం సిద్దిపేట మంచినీటి ప్రాజెక్టు సందర్శనకు వెళుతున్నారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టనున్న వాటర్‌గ్రిడ్ పథకంపై మంత్రులకు అవగాహన కల్పించేందుకు సీఎం కేసీఆర్ బుధవారం సిద్దిపేట మంచినీటి ప్రాజెక్టు సందర్శనకు వెళుతున్నారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు ప్రధాన మూలం సిద్దిపేటలోని మంచినీటి పథకమే. సీఎం కేసీఆర్ 18 ఏళ్ల క్రితం సిద్దిపేట ఎమ్మెల్యే (రాష్ట్రమంత్రి కూడా)గా ఉన్న సమయంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.
విజయవంతంగా అమలవుతున్న ఈ ప్రాజెక్టు స్ఫూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా వాటర్ గ్రిడ్ పేరిట విస్తరించాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిని పక్కాగా అమలుచేసేందుకు సీఎం కేసీఆరే స్వయంగా మంత్రుల బృందానికి అవగాహన కల్పించాలని నిర్ణయించారు.