Water plant project
-
వాటర్ ప్లాంట్ నిర్మాణంలో అధికారుల ‘పచ్చ’పాతం
సాక్షి, సంజామల(కర్నూల్): మండలంలోని బొందలదిన్నె గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణం వివాదాస్పదంగా మారింది. అధికార పార్టీ నేతలకు వత్తాసు పాలుకుతూ అధికారులు వ్యవహరిస్తున్న తీరు గ్రామంలో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించేలా ఉంది. వివరాలు.. గ్రామంలో ప్రజల దాహార్తి తీర్చేందుకు ఆరునెలల క్రితం వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సొంత నిధులతో మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టారు. అయితే దాన్ని జీర్ణించుకోలేని అధికారపార్టీ నేతలు అధికారులపై ఒత్తిడి తెచ్చి ప్లాంట్ నిర్మాణాన్ని అడ్డుకున్నారు. మంచి పనిని స్వాగతించాల్సింది పోయి ప్రతిపక్ష పార్టీ నేతకు మంచి పేరు రాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వ స్థలంలో కడుతున్న ప్లాంట్‌ను అడ్డుకున్నారు. అయితే విచిత్రం ఏమిటంటే ప్రభుత్వ స్థలంలో ప్రజలకు ఉపయోగపడే పనిని అడ్డుకున్న టీడీపీ నేతలు, అధికారులు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పట్టా స్థలంలో దౌర్జన్యంగా ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి సొంత నిధులతో వాటర్ ప్లాంట్ నిర్మాణానికి పూనుకున్నారు. పట్టా స్థలంలో టీడీపీ నాయకులు దౌర్జన్యంగా నిర్మిస్తున్న వాటర్ ప్లాంట్ బాధితులు తమ స్థలంలో ప్లాంట్ కట్టొద్దని మొత్తుకున్నా పోలీసుల అండతో అక్రమంగా ప్లాంట్ నిర్మాణాన్ని ప్రారంభించారు. అయితే చివరికి బాధితులు హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు ప్లాంట్ నిర్మాణ పనులను ఆపేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. సంబందిత అధికారులకు కోర్టు ఉత్వర్వుల కాపీలు కూడా అందాయి. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో అధికారపార్టీ నేతలు, అధికారుల తీరుతో రెండు వర్గాల మధ్య గొడవలకు దారి తీసే పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు ప్యాక్షన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన గ్రామంలో గత పదిహేనేళ్లుగా ప్యాక్షన్ తగ్గుముఖం పట్టి గ్రామ ప్రజలు ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు మినరల్ వాటర్ ప్లాంట్ రూపంలో అధికార పార్టీ చేస్తున్న ఆగడాలతో గ్రామంలో ప్రశాంతతకు భంగం కలిగేలా మారింది. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకొని గ్రామంలో ప్రశాంతతకు భంగం కలిగించకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. మా స్థలంలో నిర్మిస్తున్నారు గ్రామంలోని సర్వే నంబర్ 83లో మాకు 2.8 సెంట్ల స్థలం ఉంది. ఈ స్థలానికి సంబంధించిన రిజిస్టర్ డ్యాకుమెంట్లు కూడా ఉన్నాయి. అధికార పార్టీ నేతలు నా స్థలంలో దౌర్జన్యంగా వాటర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టడంతో నేను హైకోర్టును ఆశ్రయించాను. కోర్టు తీర్పు నాకు అనుకూలంగా వచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదు. – రమణారెడ్డి, బొందలదిన్నె ‘అధికార’ అండతో దౌర్జన్యం అధికారం ఉంది కదా అని టీడీపీ నాయకులు దౌర్యన్యానికి పాల్పడుతుండగా అధికారలు కూడా వారికి వత్తాసు పలుకుతున్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో చిచ్చుపెట్టాలని చూడటం తగదు. గ్రామంలో గొడవలు జరిగితే అధికారులదే బాధ్యత. – వెంకటస్వామి, బొందలదిన్నె -
బిందెడు నీటికోసం పడిగాపులు!
సాక్షి, నల్లగొండ రూరల్ : బిందెడు తాగునీటి కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఆ 6 గ్రామాల ప్రజలకు ఏర్పడింది. కృష్ణా తాగునీరు ఎప్పుడు వస్తుందా అని బిందెలు, క్యాన్లు పెట్టుకొని వృద్ధులు, చిన్నారులు ఎదురుచూస్తున్నారు. లక్షలు వెచ్చించి గ్రామాల్లో కృష్ణా తాగునీటి కోసం నిర్మించిన నీటి ట్యాంకులు అలంకారప్రాయంగా మారాయి. తాగునీటి ట్యాంకులకు కృష్ణా జలాలు చేరకపోవడంతో పైప్‌లైన్‌కు నల్లాను ఏర్పాటు చేసుకొని ప్రజలు నీటిని పట్టుకుంటుం న్నారు. నీటిసమస్యపై అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పరిష్కారం కావడంలేదని వెలుగుపల్లి, రసూల్‌పురం, ముశంపల్లి, గుట్టకింద అన్నారం, మేళ్లదుప్పలపల్లి, అన్నారెడ్డిగూడెం గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారానికి ఓకేసారి నీటి సరఫరా: మండలంలోని 6 గ్రామాలకు కృష్ణా తాగునీరు సక్రమంగా సరఫరా కావడంలే దు. వారానికి ఒకసారి నీటి ని సరఫరా చేస్తుండడంతో గ్రా మస్తులు తాగునీటికోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నల్లగొండకు వచ్చి నీటిని కొ నుగోలు చేయడం ఆర్థిక భారంగా మారడంతోపాటు తాగునీటికి ఇ బ్బందులు తప్పడంలేదని గ్రామస్తులు వాపోతున్నారు. చర్లగౌరారం ప్లాంట్ నుంచి నీటి సరఫరా: చర్లగౌరారం కృష్ణా వాటర్ ప్లాంట్ నుంచి నల్లగొండ మండలంలోని 6 గ్రామాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. నిరంతరం విద్యుత్ సరఫరా ఉన్నప్పటికీ నీటి సరఫరా ఎందుకు చేయడంలేదని అధికా రులను ప్రజలు నిలదీస్తున్నారు. ఎప్పుడు అడిగి నా రేపటినుంచి సరఫరా చేస్తామని చెబుతున్నారే తప్ప అధికారుల పనితీరులో మార్పు ఉండటంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైపులకు నల్లాల బిగింపు: గ్రామాల్లో ఏర్పాటు చేసిన ట్యాంకులకు కృష్ణా జలాలు సరఫరా చేయకపోవడంతో గ్రామస్తులు వాటర్ పైప్‌లైన్‌కు నల్లా ఏర్పాటు చేసుకున్నారు. 6 గ్రామాల్లో అనధికారికంగా నల్లా ఏర్పాటు చేసకుని కృష్ణా నీటిని బిందెల్లో పట్టుకుంటున్నారు. నీటిసరఫరా బంద్ కావడంతో నిల్వ ఉన్న మురికి నీరు తాగునీటి పైపుల్లోకి వెళ్లి కృష్ణా జలాలు కలుషితమవుతున్నాయి. అధికారులు తక్షణమే చర్య తీసుకుని నీటిఎద్దడి ఉన్న గ్రామాలపై దృష్టి సారించి ప్రతిరోజు కృష్ణా జలాలు సరఫరాచేయాలని ప్రజలు కోరుతున్నారు. నీళ్లు రాక 5రోజులైంది కృష్ణా తాగునీరు సరఫరా లేక 5రోజులైంది. దీంతో బావులవద్ద నీటిని పట్టుకొని వస్తున్నాం. ఒక్క ట్యాంక్‌కు కూడా కృష్ణా జలాలు ఎక్కడం లేదు. నీటిసమస్యను ఎవరు పట్టించుకోవడంలేదు. నీళ్లు పెట్టేందుకు వచ్చిన వారికి చెప్పితే వస్తయి అంటున్నారు. – విమల, వెలుగుపల్లి క్యాన్ నీళ్ల కోసం తిప్పలు క్యాన్ వాటర్ కోసం నల్లగొండకు పోవడం వల్ల వ్యవసాయ పనులకు ఇబ్బందిగా మారింది. నల్లా ఎప్పుడు వస్తదో తెలియక రెండు బిందెలు నల్లా వద్ద పెట్టి పిల్లలను అక్కడ ఉంచి పనులకు పోతున్నాం. ఏనాడు సక్కంగా నీరు రావడంలేదు. – పద్మ, వెలుగుపల్లి -
సీఎస్సార్ నిధులకు ఎసరు!
గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్సార్) కింద ప్రాజెక్ట్‌లు ఖర్చు చేయాల్సిన నిధులకు తాళాలు పడ్డాయి. సీఎస్సార్ నిధులు ఖర్చు చేసే బాధ్యతలను ప్రభుత్వం ప్రాజెక్ట్‌ల నిర్వాహకుల నుంచి తొలగించింది. నిధులు వ్యయం చేసే అధికారాన్ని కలెక్టర్‌కు అప్పగించడంతో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు అటకెక్కాయి. అభివృద్ధి పనులు పడకేశాయి. ముత్తుకూరు(నెల్లూరు): రాష్ట్ర రాజధాని అమరావతిలో జూన్ 26వ తేదీన విద్యుత్ శాఖ మంత్రి కళా వెంకట్రావు, వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, థర్మల్ ప్రాజెక్ట్‌ల ప్రతినిధులు సమావేశమయ్యారు. సీఎస్సార్ నిధులను జిల్లా కలెక్టర్ వద్ద డిపాజిట్ చేయాలని నిర్ణయించారు. దీంతో ప్రాజెక్ట్‌ల ప్రభావిత గ్రామాల్లో ప్రజల దాహార్తి తీర్చే ఆర్వో వాటర్ ప్లాంట్లు నిర్వహించే దిక్కులేక మూతపడ్డాయి. మరికొన్ని ప్లాంట్లలో అభివృద్ధి పనులు పడకేశాయి. మూతపడ్డ ఆర్వో వాటర్ ప్లాంట్లు ముత్తుకూరు మండలంలో థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్‌లు, ఇతర పరిశ్రమలు ఏర్పాటు చేసిన 13 ఆర్వో వాటర్ ప్లాంట్లల్లో ప్రస్తుతం ఏడు ప్లాంట్లు మూతపడ్డాయి. మిగిలిన ప్లాంట్ల నిర్వహణకు తలపెట్టిన టెండర్లను రద్ధు చేయడంతో ఇవి కూడా ప్రమాదంలో పడ్డాయి. ముఖ్యంగా రెండు థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్‌లకు కేంద్రంగా ఉన్న నేలటూరు పంచాయతీలోని టైడు వాటర్ ప్లాంట్లు మూతపడడం విశేషం. ఇవి కాకుండా ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద ఏర్పాటైన ఆరు ప్లాంట్లల్లో మూడు మూతపడ్డాయి. మూత పడ్డ ఆర్వో ప్లాంట్లు, ప్రజల కష్టాలు పట్టించుకునే అధికారులు, నాయకులు కరువయ్యారు. తాగునీటి కోసం అల్లాడిపోయే ప్రజలు ప్లాంట్ల పరిస్థితి వివరించేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. మినరల్ వాటర్‌ను తాగేందుకు అలవాటు పడ్డ పేదలు ప్రస్తుతం నీళ్ల క్యాన్లు కొనుగోలు చేయలేక అల్లాడిపోతున్నారు. సీఎస్సార్ నిధుల వ్యయానికి ఫుల్స్టాప్ సామాజిక బాధ్యత కింద ప్రాజెక్ట్‌లు తమ ఆదాయంలో రెండు శాతం నిధులను ప్రభావిత గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఖర్చు చేయాల్సి ఉంది. సెమ్కార్ఫ్ గాయత్రి పవర్ కాంప్లెక్స్ నిర్వాహకులు ఇప్పటి వరకు రూ.25 కోట్ల మేరకు సీఎస్సార్ నిధులు వ్యయం చేసినట్టు చెబుతున్నారు. రాష్ట్ర మంత్రులు ఆంక్షలు పెట్టిన తర్వాత నేలటూరులోని ఏపీజెన్కో ప్రాజెక్ట్ ఇంజినీర్లు రూ.2 కోట్ల సీఎస్సార్ నిధులను ఇటీవల కలెక్టర్‌కు డిపాజిట్ చేశారు. దీంతో చేపట్టాల్సిన పనులు, కల్పించాల్సిన సౌకర్యాలపై కలెక్టర్‌కు కనీసం ప్రతిపాదనలు పంపించే అధికారం కూడా తమకు లేదని జెన్కో ఇంజినీర్లు స్పష్టం చేశారు. బడి చుట్టూ ప్రహరీగోడ, స్కూల్ ముందు నీళ్ల బోరు ఏర్పాటు చేసే అధికారం కూడా కోల్పోయామన్నారు. రూ.కోట్లు ఉన్నా..గుక్కెడు నీళ్లు లేవు సామాజిక బాధ్యత నిధులను ప్రాజెక్ట్‌ల ప్రతినిధులు కలెక్టర్‌కు డిపాజిట్ చేయడంతో తీరప్రాంత గ్రామాల్లో తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. మరమ్మతులకు గురైన ఆర్వో ప్లాంట్‌ను రిపేరు చేయించే దిక్కు లేకుండా పోయింది. తాగునీటి కోసం తీరప్రాంత గ్రామాల్లో అలజడి మొదలైంది. పనులు కోసం ప్రజలు పదే పదే కలెక్టర్ వద్దకు వెళ్లే పరిస్థితి లేదు. స్థానికంగా నెలకొన్న ఈ సమస్యలను ఎవరు పరిష్కరిస్తారనేది ప్రశ్నార్థకమైంది. కనీసం తాగునీటి కష్టాలు తొలగించేందుకైనా అత్యవసర కమిటీని ఏర్పాటు చేయాలి. మూతపడ్డ ఆర్వో ప్లాంట్లను తెరిపించాలి. మిగిలిన ప్లాంట్లు మూతపడకుండా చర్యలు తీసుకోవాలి. –నెల్లూరు శివప్రసాద్, జెడ్పీటీసీ సభ్యుడు, ముత్తుకూరు ఆర్వో ప్లాంట్లు మూతపడ్డాయి నేలటూరు పంచాయతీలో ప్రాజెక్ట్‌లు ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్లు అన్నీ మూతపడ్డాయి. జెన్కో ఇంజినీర్లకు ఈ సమస్యను తెలియజేశాం. సీఎస్సార్(సామాజిక బాధ్యత) నిధులు కలెక్టర్‌కి ఇచ్చేశాం, రిపేరు చేయించలేము అని ఇంజినీర్లు బదులిచ్చారు. తాగునీటికి చాలా ఇబ్బందిగా ఉంది. నెల్లూరులో జేసీని కలసి, ఆర్వో ప్లాంట్ల సమస్య చర్చించాం. –ఈపూరు కోటారెడ్డి, నేలటూరు. ప్రాజెక్ట్‌లే ప్లాంట్లు నిర్వహించాలి థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్‌లు ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు పనిచేయని విషయం సోమవారం నెల్లూరులో జరిగిన సమావేశంలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. సీఎస్సార్ నిధులు కలెక్టరేట్లో డిపాజిట్ చేసినప్పటికీ ఆర్వో ప్లాంట్ల బాధ్యత ప్రాజెక్ట్‌లే నిర్వహించాలని, ప్లాంట్లను రిపేరు చేయించాలని కలెక్టర్ సూచించారు. –మునికుమార్, ఏఈ, ఆర్డబ్ల్యూఎస్ -
కారణాలు చెప్పొద్దు..
పరిగి వికారాబాద్ : ఎలాంటి కారణాలు చెప్పకుండా ఆగస్టు 15వ తేదీలోపు ఇంటింటికీ తాగునీరు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు కార్యదర్శి స్మితాసబర్వాల్ అధికారులను ఆదేశించారు. ఆగస్టు 14లోపు భగీరథ పనులు పూర్తి చేసి, 15న నీటి సరఫరా ప్రారంభించాలని సీఎం కేసీఆర్ డెడ్‌లైన్ విధించిన నేపథ్యంలో.. జాపర్‌పల్లిలో నిర్మించిన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను మంగళవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా నీటి శుద్ధి ప్రక్రియలను పరిశీలించారు. ఇప్పటి వరకు పూర్తయిన పనులు, ఇంకా చేయాల్సిన వాటిపై పలువురు ఇంజినీర్లు ఆమెకు వివరించారు. పరిగి మండల జాపర్‌పల్లి, రాఘవాపూర్ నుంచి కొడంగల్ వరకు వేస్తున్న ప్రధాన పైప్‌లైన్ పనులను పరిశీలించారు. సమన్వయంతో పనిచేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ సీఈ శ్రీనివాస్‌రెడ్డి, ఈఈ ఆంజనేయులు, ఆర్డీఓ విశ్వనాథం, తహసీల్దార్ అబీద్‌అలీ, స్థానిక డీఈ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. సమన్వయంతో సాగండి.. కొడంగల్ రూరల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంలో కాంట్రాక్టర్లు, అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ నిర్దేశిత సమయానికి పనులు పూర్తి చేయాలని చర్యలు తీసుకోవాలని సీఎంఓ కార్యదర్శి స్మితాసబర్వాల్ ఆదేశించారు. 23 ఎంఎల్డీ సామర్థ్యంతో మండల కేంద్రం సమీపంలో నిర్మిస్తున్న నీటి శుద్ధి కేంద్రాన్ని, పైప్‌లైన్ పనులను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరిగి సమీపంలోని జాపర్‌పల్లి(రాఘవాపూర్) 39 కి.మీ. నుంచి రా వాటర్ సరఫరా అవుతుందని, గ్రావిటీ లేకుండా నియోజకవర్గంలోని కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్‌పేట మండలాల్లోని 216 గ్రామాలకు నీటి సరఫరా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పరిగి నుంచి కొడంగల్‌కు వేసిన పైప్లైన్లలో లకేజీలు ఉన్నాయని, కూలీల సమస్య ఉందని పలువురు అధికారులు ఆమెకు వివరించారు. పెండింగ్‌లో ఉన్న రూ.7 కోట్ల బిల్లులను మూడు రోజుల్లో విడుదలయ్యేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. కూలీల కొరతపై అసహనం వ్యక్తంచేస్తూ అదనంగా.. ఒక్కో బ్యాచ్‌లో 5గురు చొప్పున 47 బ్యాచ్‌లను ఏర్పాటుచేసుకొని సకాలంలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆగష్టు 15వ తేదీ లోపు 216 గ్రామాలకు నీరందించేలని అధికారులను ఆదేశించారు. బీమాపై అవగాహన కల్పించండి... రైతుబంధు, బీమాపై అవగాహన కల్పించాలని సీఎంఓ కార్యదర్శి స్మితాసబర్వాల్.. ఆర్డీఓ వేణుమాధవ్‌కు సూచించారు. డివిజన్ పరిధిలో పరిష్కారం కాని పాస్‌పుస్తకాలు, చెక్కుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్ర స్థాయిలో వీఆర్ఓలు రైతులకు అవగాహన కల్పిస్తూ రైతుబంధు, బీమా వివరాలను తెలియజేయాలని చెప్పారు. భూవివాదాల కారణంగా నిలిచిన పాస్‌బుక్కులు, చెక్కుల వివరాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి రైతులకు న్యాయం చేయాలన్నారు. మిషన్ భగీరథ ప్రాంతంలో మొక్కలను నాటాలని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ ఈఈ పద్మలత, ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి, సీఈ చెన్నారెడ్డి, ఆర్డీఓ వేణుమాధవ్, సీఈ శ్రీనివాస్‌రెడ్డి, వికారాబాద్ ఈఈ నరేందర్, తహసీల్దార్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు సిద్దిపేట మంచినీటి ప్రాజెక్టుకు కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టనున్న వాటర్‌గ్రిడ్ పథకంపై మంత్రులకు అవగాహన కల్పించేందుకు సీఎం కేసీఆర్ బుధవారం సిద్దిపేట మంచినీటి ప్రాజెక్టు సందర్శనకు వెళుతున్నారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు ప్రధాన మూలం సిద్దిపేటలోని మంచినీటి పథకమే. సీఎం కేసీఆర్ 18 ఏళ్ల క్రితం సిద్దిపేట ఎమ్మెల్యే (రాష్ట్రమంత్రి కూడా)గా ఉన్న సమయంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. విజయవంతంగా అమలవుతున్న ఈ ప్రాజెక్టు స్ఫూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా వాటర్ గ్రిడ్ పేరిట విస్తరించాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిని పక్కాగా అమలుచేసేందుకు సీఎం కేసీఆరే స్వయంగా మంత్రుల బృందానికి అవగాహన కల్పించాలని నిర్ణయించారు.