జోగుళాంబ సన్నిధిలో విధుశేఖర భారతి   | Vidhu shekara Bharati In The Presence Of Jogulamba | Sakshi
Sakshi News home page

జోగుళాంబ సన్నిధిలో విధుశేఖర భారతి  

Published Mon, Jul 9 2018 1:02 PM | Last Updated on Mon, Jul 9 2018 1:02 PM

Vidhu shekara Bharati In The Presence Of Jogulamba - Sakshi

పాదుక పూజలో ఈవో, పాలకమండలి

అలంపూర్‌ రూరల్‌ : పరమహంస పరివ్రాజకాచార్య అనంతశ్రీ విభూషిత విధుశేఖర భారతిస్వామి వారి విజయ యాత్ర ఆదివారం రాత్రి అలంపూర్‌కు చేరుకుంది. ఈ అలంపుర జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి వారిని దర్శించా రు.

ఈ సందర్భంగా దేవాదాయా శాఖ ఉమ్మడి జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్‌ బి.కృష్ణ, ఆలయ కమిటీ చైర్మన్‌ తిరుపతి రెడ్డి, ఈవో గురురాజ ఆలయ అర్చకులతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని, అమ్మవారి ఆలయాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చారు.  

విజయస్థూపం ఆవిష్కరణ  

శృంగేరి శారదా పీఠాధిపతులు శ్రీ విధుశేఖర భారతిస్వామి వారు తన విజయయాత్ర ఇక్కడికి చేరిన సందర్బంగా విజయస్థూపాన్ని ఆలయంలో ఆవిష్కరించారు. పీఠాధిపతుల చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు.

వేద మంత్రోచ్ఛరణలతో విధుశేఖర భారతి స్వామివారి రజిత పాదుకలకు శాస్త్రోక్తంగా ఆలయ ఈవో గురురాజ, ఏసీ కృష్ణ దంపతులు, పాలక మండలి సభ్యులు చేశారు. ఆలయ వైశిష్ట్యాన్ని తెలియజేస్తూ స్వాగత పత్రాన్ని అందజేశారు.  

శారదా చంద్రమౌళీశ్వర పూజ  

అనుగ్రహ భాషణ అనంతరం అమ్మవారి కుంకుమార్చన మండపంలో ఆది దంపతులు శ్రీ శారదాచంద్ర మౌళీశ్వర పూజా కార్యక్రమాన్ని పీఠాధిపతులు నిర్వహించారు. 
కార్యక్రమంలో తహసీల్దార్‌ లక్ష్మి, ఆర్‌.ఐ రవి, వీఆర్‌ఓ భానుమూర్తి , ఆలయ కమిటీ ధర్మకర్తలు సత్యనారాయణ, రవి, రాఘవరెడ్డి, ఎన్‌.జీ కృష్ణ, శైలజ, వెంకటేశ్వర్లు ఉన్నారు.

 ‘ఆలయ సముదాయం’ అని మార్చండి

అలంపూర్‌ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం అధికారులకు, పాలక మండలికి  విధుశేఖర భారతి స్వామి వారు ఓ సూచన చేశారు. ఆదివారం పీఠాధిపతుల రాక సందర్భంగా దేవస్థానం తరపున అందించిన స్వాగతపత్రంలో జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి గ్రూప్‌ దేవస్థానం అని ఉండటాన్ని గమనించారు.

దీంతో వెంటనే అధికారులను, పాలక మండలిని గ్రూప్‌ అంటే ఏమిటి? ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చింది అంటూ ప్రశ్నించారు. జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర ఆలయ సముదాయం అని అనడం సముచితంగా ఉంటుందని సూచించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement