- విజిలెన్స్ దాడులతో వెలుగులోకి అక్రమాలు
- పౌరసరఫరాల గిడ్డంగిలో అవక తవకలు
- అస్తవ్యస్తంగా రికార్డులు
మల్యాల : మండల కేంద్రంలోని పౌరసరఫరాల గిడ్డంగిలో బుధవారం నాటి విజిలెన్స్ దాడిలో ఎన్నో అక్రమాలు వెలుగుచూశారుు. రెండు క్వింటాళ్ల బియ్యం లోటు ఉండగా.. రెండు క్వింటాళ్ల చక్కెలు మిగులు ఉంది. రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. గిడ్డంగి నిర్వహణపై విజిలెన్స్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజిలెన్స్ డీఎస్పీ బాలస్వామి ఆధ్వర్యంలో మల్యాలలోని పౌరసరఫరాల గిడ్డంగిలో బుధవారం మూడు గంటల పాటు తనిఖీలు చేపట్టారు. సరుకు నిల్వ, సరఫరాలకు సంబంధించిన రికార్డుల్లో తేడా ఉండడంపై ప్రశ్నించారు. ఫ్యాక్టరీ నుంచే సరుకుల తూకంలో తేడా వస్తుండడంతోనే నిల్వలలో తేడాలున్నాయనగా.. వెంటనే హమాలీలతో బస్తాలను తూకం వేరుుంచగా వ్యత్యాసం తేలకపోవడం గమనార్హం.
రికార్డులు అస్తవ్యస్తం
రికార్డుల ప్రకారం సరుకు నిల్వలలో తేడాల రావడంపై నిలదీశారు. గోడౌన్ ఇన్‌చార్జికి బదులు కాంట్రాక్టు క్లర్క్ సమాధానం చెప్పడం గమనార్హం. రికార్డులోని నిల్వకు వాస్తవానికి బియ్యంలో 2 క్వింటాళ్ల వ్యత్యాసం రాగా.. చక్కెర రెండు క్వింటాళ్ల అదనంగా ఉండడంపై ప్రశ్నించారు. గోధుమలు, ఉప్పు నిల్వల్లోనూ తేడాలు వచ్చారుు. సరుకుల నిల్వల్లో వ్యత్యాసంపై జేసీకి నివేదిక అందజేయనున్నట్లు విజిలెన్స్ డీఎస్పీ బాలస్వామి తెలిపారు.
గోడౌన్‌పై పర్యవేక్షణ కరువు
గోడౌన్‌లోని సరుకుల నిల్వ, సరఫరాపై అధికారుల పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలున్నారుు. అంతేకాకుండా గోడౌన్‌కు వచ్చిన సరుకులను నేరుగా రేషన్ దుకాణాలకు తరలిస్తున్నారనే మరో విమర్శ ఉంది. వాహనాల వెంబడి రూట్ ఆఫీసర్స్ వెళ్లడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నారుు.
ప్రైవేట్ వ్యక్తిదే హవా
గిడ్డంగి నిర్వహణ వివరాలు, రికార్డులన్నీ ప్రైవేట్ వ్యక్తి చేతిలోనే ఉండడంపై అనుమానాలకు తావిస్తోంది. డీలర్లు, అధికారులు, సరుకుల నిల్వలకు సంబంధించిన ప్రతి అంశం ప్రైవేట్ ఉద్యోగినే అడగడం ఆనవాయితీగా మారింది. ఇటు అధికారులు, హమాలీలు, అటు డీలర్లు సైతం ఏ విషయమైనా ప్రైవేట్ వ్యక్తితోనే చర్చించడం గమనార్హం. బుధవారం విజిలెన్స్ అధికారుల విచారణలోనూ ప్రైవేట్ వ్యక్తియే అన్ని సమాధానాలు చెప్పడం గమనార్హం.
బియ్యం లోటు.. చక్కెర మిగులు
Published Fri, May 1 2015 1:29 AM | Last Updated on Sun, Sep 3 2017 1:10 AM
Advertisement
Advertisement