సింగరేణి స్టాల్స్‌ను సందర్శించిన కేంద్ర, రాష్ర్ట మంత్రులు, గవర్నర్
గోదావరిఖని/కొత్తగూడెం : హైదరాబాద్‌లోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియం లో రక్షణ, కార్మిక సౌకర్యాలు అనే అంశంపై శనివారం సింగరేణి సంస్థ స్టాల్స్ ఏర్పాటు చే సింది. కేంద్ర ప్రభుత్వ రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఎగ్జిబిషన్‌కు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర కార్మిక, హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, రాష్ట్ర గవర్నర్ నర్సింహన్ హాజరయ్యారు.
వారికి డెప్యూటీ డెరైక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేప్టీ ఎస్‌ఐ హుస్సేన్, సింగరేణి ప్రాజెక్ట్సు, ప్లానింగ్ డెరైక్టర్ ఎ.మనోహర్‌రావు సింగరేణిలో రక్షణ చర్యలు, పని పద్ధతులు, కార్మికుల నైపుణ్యం పై వివరించారు. సేఫ్టీ సీజీఎం సుగుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.