విద్యాశాఖ కార్యదర్శుల భేటీలో నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యలో వృత్తి విద్యకు పెద్దపీట వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం ఢిల్లీలో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయానికి వచ్చింది. రాష్ట్రం నుంచి ఈ సమావేశానికి హాజరైన విద్యాశాఖ కార్యదర్శి వికాస్‌రాజ్.. అందులో చర్చించిన అంశాలను వెల్లడించారు. ఉన్నత విద్య కోర్సులను పూర్తి చేసిన వెంటనే విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లభించేలా నైపుణ్యాల అభివృద్ధి ప్రత్యేక చర్యలు చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం పాఠశాల స్థాయి నుంచి డిగ్రీ స్థాయి వరకు వృత్తి విద్యా కోర్సులను ప్రవేశ పెట్టాలన్న అభిప్రాయానికి వచ్చింది.
పారిశ్రామిక వర్గాల అవసరాలకు అనుగుణంగా ఇంజనీరింగ్ వంటి వృత్తి విద్యా కో ర్సుల్లో సిలబస్‌ను మార్పులు చేయాలని, త ద్వారా విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పిం చవచ్చని పేర్కొంది. దీంతోపాటు నైపుణ్యాల అభివృద్ధికి ప్రతే ్యక మంత్రిత్వశాఖను ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్న నిర్ణయానికి వచ్చింది.