మృతదేహం వద్ద రోదిస్తున్న బంధువులు
చిగురుమామిడి(హుస్నాబాద్): మండలంలోని ఇందుర్తికి చెందిన వీఆర్‌ఏ కూన మహేందర్(43) ప్రమాదవశాత్తు టిప్పర్ కింద పడి మృతిచెందాడు. మహేందర్ సోమవారం తన భార్య భాగ్యవ్వను వ్యవసాయ బావి వద్దకు దింపేందుకు తన మోపెడ్‌పై వెళ్లాడు. ఆమెను బావి వద్ద దింపి తిరిగి వస్తున్నాడు. ఈక్రమంలో ఎదురుగా టిప్పర్ వస్తుండడం గమనించి రోడ్డు పక్కకు మోపెడ్‌ను ఆపి నిలిచాడు. అయితే టిప్పర్ డ్రైవర్ మహేందర్‌ను దాటి ముందుకెళ్లి, తిరిగి వెనక్కి వేగంగా రావడంతో వెనుక టైర్‌తోపాటు ముందు టైర్లు ఎక్కాయి. తీవ్రంగా గాయపడ్డ మహేందర్ అక్కడికక్కడే మృతిచెందాడు. తల నుజ్జునుజ్జయ్యింది. ఇతనికి భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలంటూ గ్రామస్తులు, బంధువులు ఆందోళనకు దిగారు.
వీరి ఆందోళన సాయంత్రం వరకు కొనసాగింది. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్ గడ్డం సుధాకర్, ఎల్‌ఎండీ సీఐ కరుణాకర్‌రావు అక్కడికి చేరుకుని ఇరువర్గాలతో మాట్లాడారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. చిగురుమామిడి జెడ్పీటీసీ వీరమల్ల చంద్రయ్య మృతదేహం వద్ద నివాళి అర్పించి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ మహేందర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆందుకుంటుందన్నారు. ఆపద్బంధు పథకం ద్వారా ఆర్థికం అందించేందుకు కృషి చేస్తానన్నారు. ఎంపీటీసీలు అందె సుజాత, ఆకుల మొగిలి, టీఆర్‌ఎస్ మైనార్టీసెల్ మండలాధ్యక్షుడు ఎస్.కె. సిరాజ్ తదితరులు నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment