vra dies
-
గుండెపోటుతో వీఆర్ఏ మృతి
జలుమూరు : అల్లాడ వీఆర్ఏ గొంటి మల్లేశ్వరరావు(60) గుండె పో టుతో శుక్రవారం మృతి చెందాడు. కుటుంబ స భ్యులు తెలిపిన వివరా లు ప్రకారం అప్పటివర కూ వీఆర్వో కె.సింహాచలంతో గ్రామంలో ఆయన విధులు నిర్వహిం చాడు. మధ్యాహ్నం భోజనం సమయం కావడంతో ఇంటికి వచ్చి భార్యకు భోజనం పెట్ట మని చెబుతూ కాళ్లు, చేతులు కడ్కుకొని ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. ప్రాథమిక వైద్యసహాయం అందించేందుకు ప్రయత్నించగా అప్పటికే శరీరం మొత్తం చల్లబడి ఊపిరి ఆగిపోయిందని వారు తెలిపారు. ఇతనికి భార్య చిన్నమ్మడు, కుమార్తె స్నేహ(ఇంటర్ చదువుతోంది) ఉన్నారు. ఆర్ఐ చిన్నారావు, వీఆర్వోలు సొంగళి రామారావు కుటుంబాన్ని పరామర్శించి అంత్యక్రియలకు రూ. 10 వేలు అందించారు. -
టిప్పర్ కింద పడి వీఆర్ఏ మృతి
చిగురుమామిడి(హుస్నాబాద్): మండలంలోని ఇందుర్తికి చెందిన వీఆర్ఏ కూన మహేందర్(43) ప్రమాదవశాత్తు టిప్పర్ కింద పడి మృతిచెందాడు. మహేందర్ సోమవారం తన భార్య భాగ్యవ్వను వ్యవసాయ బావి వద్దకు దింపేందుకు తన మోపెడ్‌పై వెళ్లాడు. ఆమెను బావి వద్ద దింపి తిరిగి వస్తున్నాడు. ఈక్రమంలో ఎదురుగా టిప్పర్ వస్తుండడం గమనించి రోడ్డు పక్కకు మోపెడ్‌ను ఆపి నిలిచాడు. అయితే టిప్పర్ డ్రైవర్ మహేందర్‌ను దాటి ముందుకెళ్లి, తిరిగి వెనక్కి వేగంగా రావడంతో వెనుక టైర్‌తోపాటు ముందు టైర్లు ఎక్కాయి. తీవ్రంగా గాయపడ్డ మహేందర్ అక్కడికక్కడే మృతిచెందాడు. తల నుజ్జునుజ్జయ్యింది. ఇతనికి భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలంటూ గ్రామస్తులు, బంధువులు ఆందోళనకు దిగారు. వీరి ఆందోళన సాయంత్రం వరకు కొనసాగింది. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్ గడ్డం సుధాకర్, ఎల్ఎండీ సీఐ కరుణాకర్‌రావు అక్కడికి చేరుకుని ఇరువర్గాలతో మాట్లాడారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. చిగురుమామిడి జెడ్పీటీసీ వీరమల్ల చంద్రయ్య మృతదేహం వద్ద నివాళి అర్పించి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ మహేందర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆందుకుంటుందన్నారు. ఆపద్బంధు పథకం ద్వారా ఆర్థికం అందించేందుకు కృషి చేస్తానన్నారు. ఎంపీటీసీలు అందె సుజాత, ఆకుల మొగిలి, టీఆర్ఎస్ మైనార్టీసెల్ మండలాధ్యక్షుడు ఎస్.కె. సిరాజ్ తదితరులు నివాళులర్పించారు. -
ఫాదర్స్ డే రోజున విషాదం
బూర్గంపాడు భద్రాద్రి జిల్లా : మరో రెండురోజుల్లో బాసర ట్రిపుల్ ఐటీలో కూతురు అడ్మిషన్ కోసం వెళ్లాల్సిన తండ్రి విద్యుత్‌షాక్‌తో విగతజీవుడయ్యాడు. బాసర వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న ఆ కుమార్తె తండ్రి మరణవార్త విని గుండెలావిసేలా రోదిస్తోంది. ‘నాన్నా నువ్వు నాకు కావాలి..నన్ను నువ్వే బాసరకు తీసుకెళ్లాలి...లే నాన్నా ...లే అంటూ’ ఆ పాప రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఫాదర్స్‌డే రోజున సారపాకలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. సారపాక గ్రామ రెవెన్యూ అసిస్టెంట్(వీఆర్ఏ) చెలికాని రాజు(40) ఆదివారం విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. ఇంట్లో కూలర్ మరమ్మతు చేస్తుండగా విద్యుత్ షాక్ రావడంతో కేకలు వేశాడు. గమనించి కుటుంబసభ్యులు వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేశారు. కిందపడిపోయిన రాజును భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే రాజు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. సారపాక గ్రామ రెవెన్యూ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రాజు మండలంలో అందరికీ సుపరిచితుడు. వీఆర్ఏ బాధ్యతలతో పాటు తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు.పాతసారపాకకు చెందిన రాజుకు భార్య అరుణతో పాటు అంజలి, శ్రావణి అనే ఇద్దరు కుమార్తెలున్నారు. పెద్దకుమార్తె అంజలి ఇటీవలే పదో తరగతిలో 10 జీపీఏ సాధించింది. భద్రాచలంలోని నవోదయ పాఠశాలలో చదువుతున్న అంజలికి బాసర ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చింది. ఈ నెల 21న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంది. ఇందుకోసం రాజు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆదివారం ఉదయమే భద్రాచలంలోని నవోదయ పాఠశాలలో ఉన్న కుమార్తె వద్దకు వెళ్లి ‘ఈనెల 21న బాసర వెళ్తున్నాం...రెడీగా ఉండమ్మా..’ అని చెప్పి వచ్చాడు. బాసర వెళ్లేందుకు మిత్రుని కారు కూడా సిద్ధం చేశాడు. ఇంతలోనే మృత్యువు అతనిని విద్యుత్‌షాక్ రూపంలో తీసుకెళ్లింది. రాజు మృతితో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పాత సారపాకలో విషాదం అలుముకుంది. రాజు మరణవార్త తెలిసిన వెంటనే తహసీల్దార్లు కేవీ శ్రీనివాసరావు, జె.స్వర్ణ, ఆర్ఐ సోయం రాంబాబు, వీఆర్ఓలు లక్ష్మీ, రమాదేవి, శ్రీనివాస్, వరలక్ష్మి, వీఆర్ఏలు మృతదేహాన్ని సందర్శించి సంతాపం తెలిపారు. -
ఆటో నుంచి జారిపడి వీఆర్ఏ మృత్యువాత
వీరఘట్టం : వీరఘట్టం–పాలకొండ సి.ఎస్.పి రహదారిలో తూడి జంక్షన్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పాలకొండ మండలం అంపిలి గ్రామానికి చెందిన వీఆర్ఏ కుమిలి గవరయ్య(47) మృతి చెందాడు. పోలీసులు, ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా పెద్దబుడ్డిడిలో బంధువుల ఇంట్లో జరుగుతున్న వివాహ వేడుకకు వెళ్లిన గవరయ్య తిరుగు ప్రయాణంలో పెద్దబుడ్డిడి నుంచి వీరఘట్టం మండలంలోని దశుమంతపురం చేరుకున్నారు. అక్కడి నుంచి కంబర మీదుగా విక్రమపురం కాలినడకన చేరుకుని విక్రమపురం జంక్షన్లో పార్వతీపు రం నుంచి శ్రీకాకుళం వెళుతున్న ఆటో ఎక్కా డు. డ్రైవరు పక్కనే కూర్చున్న గవరయ్య అప్పటికే అలసట చెంది ఉండడంతో నిద్రలోకి జారుకోవడంతో పట్టుతప్పి జారిపడ్డాడు. రో డ్డుకు తల తగలడంతో తీవ్ర రక్తస్రావం జరిగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే 108 సిబ్బంది వచ్చి ప్రథమచికిత్స చేసి పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు గవరయ్య మృతిచెం దినట్లు నిర్ధారించారు. ఈయనకు భార్య కళావతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
రోడ్డు ప్రమాదంలో వీఆర్ఏ దుర్మరణం
కళ్యాణదుర్గం : వైద్యం కోసం వెళుతున్న ఆయన్ను రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. కళ్యాణదుర్గం సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కంబదూరు వీఆర్ఏ రామన్న (54) దుర్మరణం చెందారు. వివరాలిలా ఉన్నాయి. రామన్నకు బీపీ, షుగర్ ఉన్నాయి. భార్య అక్కమ్మకు అనారోగ్యంగా ఉండటంతో శుక్రవారం ఆమెతోపాటు తనూ వైద్యం చేయించుకునేందుకు రామన్న శుక్రవారం డీజిల్ ఆటోలో కళ్యాణదుర్గానికి బయల్దేరారు. కళ్యాణదుర్గం సమీపంలోకి రాగానే పంది అడ్డురావడంతో అదుపుతప్పి ఆటో బోల్తాపడింది. డ్రైవర్ పక్కన కూర్చున్న రామన్నపై ఆటో మీదపడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మిగతా ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. కళ్లెదుటే భర్త చనిపోవడంతో భార్య కన్నీరుమున్నీరుగా విలపించింది. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.