
గొంటి మల్లేశ్వరరావు
జలుమూరు : అల్లాడ వీఆర్‌ఏ గొంటి మల్లేశ్వరరావు(60) గుండె పో టుతో శుక్రవారం మృతి చెందాడు. కుటుంబ స భ్యులు తెలిపిన వివరా లు ప్రకారం అప్పటివర కూ వీఆర్వో కె.సింహాచలంతో గ్రామంలో ఆయన విధులు నిర్వహిం చాడు. మధ్యాహ్నం భోజనం సమయం కావడంతో ఇంటికి వచ్చి భార్యకు భోజనం పెట్ట మని చెబుతూ కాళ్లు, చేతులు కడ్కుకొని ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు.
ప్రాథమిక వైద్యసహాయం అందించేందుకు ప్రయత్నించగా అప్పటికే శరీరం మొత్తం చల్లబడి ఊపిరి ఆగిపోయిందని వారు తెలిపారు. ఇతనికి భార్య చిన్నమ్మడు, కుమార్తె స్నేహ(ఇంటర్ చదువుతోంది) ఉన్నారు. ఆర్‌ఐ చిన్నారావు, వీఆర్వోలు సొంగళి రామారావు కుటుంబాన్ని పరామర్శించి అంత్యక్రియలకు రూ. 10 వేలు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment