బంట్వారం: ఒకవైపు లంచం అడిగితే నాకు చెప్పండి అని ముఖ్యమంత్రి చెప్తుంటే మరోవైపు ఏ చిన్న పని కావాలన్నా చేతులు తడపందే పని జరగటం లేదు. పట్టా మార్పిడి అయిన పాస్ పుస్తకాలు చేతికివ్వడానికి కూడా లంచం అడిగిన సంఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది.
గురువారం ఉదయం బంట్వారం మండలం రొంపల్లి గ్రామానికి చెందిన రైతు నర్సింహులు పట్టా మార్పిడి అయిన తన పాస్ పుస్తకాలివ్వమని వీఆర్‌వో శివకుమార్‌ను కోరాడు. దానికి వీఆర్‌వో మూడు వేలు లంచం అడగడంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ముందుగా వల పన్నిన ఏసీబీ అధికారులు రైతు నుంచి శివకుమార్ లంచం తీసుకుంటున్న సమయంలో వీఆర్వోను రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు.