అడవిలో నడుస్తున్న స్థానికులు, అటవీ అధికారులు
జన్నారం(ఖానాపూర్) : ప్రకృతికి మన దేహానికి అనేక సంబంధాలున్నాయి. మన ఆరోగ్యం ప్రకృతి చేతిలో ఉంటుందని అందుకే ఈ విషయాన్ని తెలియజేసెందుకే వనదర్శిని కార్యక్రమం చేపడుతున్నట్లు ఫారెస్ట్ డివిజనల్ అధికారి రవీందర్‌గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం టైగర్‌జోన్ పరిధిలోని జన్నారం అటవీ రేంజ్ జన్నారం బీట్ పరిధిలోని 2వ నంబర్ గేట్ నుంచి అడవిలోకి రెండు గంటల పాటు స్థానికులు, అటవీశాఖ అధికారులు వాకింగ్ చేశారు. అనంతరం అటవీ ప్రాంతంలో స్థానికులకు అడవుల ప్రాముఖ్యత, అడవుల వల్ల మానవులకు కలిగే లాభాలు తెలియజేశారు. రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించేందుకు అడవులు అవసరమన్నారు. ప్రకృతిలోని వనాలలో అనేక ఆరోగ్య విషయాలు దాగున్నాయని, వాటి గురించి తెలిస్తే మనం ఆరోగ్య సమస్యల నుంచి దూరం కావచ్చన్నారు.
అటవీ శాఖ అధికారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఫారెస్ట్ బాథింగ్ పేరుతో నెలకు రెండు మార్లు వనదర్శిని , ప్రకృతి బడి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కోన్నారు. ప్రతి రోజు నడక ఆరోగ్యాన్నిస్తుందని, అడవుల్లో నడిస్తే మరింత ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. అందుకే అటవీ అధికారులకు అడవి ప్రాంతంలో నడవాలని సూచించామన్నారు. కార్యక్రమంలో రేంజ్ అధికారి వెంకటేశ్వర్‌రావు, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు కట్ట రాజమౌళి, మోటివేషన్ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ ప్రకాశ్, వర్తక సంఘం అధ్యక్షుడు మారుతీరాజ్, లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు జక్కు భూమేశ్ , సభ్యులు అంజితరావు, గోపికృష్ణ, రంగ శ్రీనివాస్, ఎఫ్‌ఎస్‌వో ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment