'అమెరికా నుంచి చికెన్ దిగుమతిని వ్యతిరేకిస్తున్నాం'
హైదరాబాద్:అమెరికా నుంచి చికెన్ దిగుమతిని వ్యతిరేకిస్తున్నట్లు టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కే.కేశవరావు స్పష్టం చేశారు. ఈ అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తుతామని ఆయన తెలిపారు. ఆదివారం కేకే నివాసంలో టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీఎం కేసీఆర్ తో పాటు, పలువురు మంత్రులు, ఎంపీలు హాజరైయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేకే.. అమెరికా నుంచి చికెన్ దిగుమతికి తమ ప్రభుత్వం వ్యతిరేకమని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పార్టీ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు.
మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలన్నీ టీఆర్ఎస్ నెరవేర్చడానికి సిద్ధంగా ఉందన్ని కేకే తెలిపారు. హైకోర్టు అంశాన్ని కూడా విభజన చేయాలంటూ పార్లమెంట్ లో టీఆర్ఎస్ తరుపున ఒత్తిడి తెస్తామన్నారు.