హెల్మెట్ ప్రాముఖ్యతను వివరిస్తున్న ఏసీపీ
రఘునాథపాలెం: ‘మీరు ద్విచక్రవాహనంపై వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరించండి. దాని ప్రాముఖ్యతను ప్రజలకు వివరించండి. తద్వారా రోడ్డు ప్రమాదాల్లో మరణాలు తగ్గించండి’ అని రూరల్ ఏసీపీ నరేశ్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం రఘునాథపాలెం పోలీస్ స్టేషన్‌లో 30 మందికిపైగా సిబ్బ ందికి హెల్మెట్‌లను పంపిణీ చేశారు. ఈ సంద ర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రోడ్డు ప్రయాణం ఆనందకరంగా సాగాలంటే ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.
ద్విచక్రవాహన దారు లు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని చెప్పారు. ఇటీవ లి కాలంలో హెల్మెట్ ధరించిన వారు ప్రమాదాల కు గురైనప్పటికీ ప్రాణాలతో బయటపడ్డారని, ఇ లాంటి ఘటనలు అనేకం ఉన్నాయని వివరించా రు. ఇలాంటి ఘటనలు ప్రజలకు వివరించాలని సిబ్బందిని కోరారు. ఏదైనా ఎదుటి వారికి మనం చెప్పే ముందు దానిని పాటించి ఆదర్శంగా ఉండాలని పేర్కొన్నారు. సమావేశంలో సీఐ తిరుపతిరెడ్డి, ఎస్‌ఐ కృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment