నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుమారి గ్రామంలో దారుణం జరిగింది. కవిత (26) అనే వివాహిత ఆదివారం తెల్లవారుజామున ఇంట్లోనే రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించింది. కవిత, రమణ దంపతులకు ఇద్దరు కమార్తెలు ఉన్నారు. రమణ దుబాయి వెళ్లొచ్చి ప్రస్తుతం స్థానికంగా కూలీ పనులు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి హత్యకు గురైనట్టు తెలుస్తోంది.
ఆదివారం తెల్లవారుజామున స్థానికులకు విషయం తెలియడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. వంటసామగ్రి మీద పడడంతో కవిత చనిపోయిందని భర్త చెబుతుండగా... భర్తే ఆమెను హత్య చేశాడని కవిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రమణ చెప్పిన విషయాలు పొంతన లేకపోవడంతో అతడిపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.