నాగోబా జాతరకు కేసీఆర్
కేస్లాపూర్: ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ లో వైభవంగా జరుగుతున్న నాగోబా జాతర కు గురువారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు హాజరుకానున్నారు. జాతరలో కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం అక్కడ జరిగే ప్రజాదర్బార్ లో పాల్గొంటారు. జాతరకు కేసీఆర్ హెలీకాఫ్టర్ లో రానున్న నేపధ్యంలో అక్కడ ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ స్థలాన్ని, ఏర్పాట్లను సీఎం సెక్యూరిటీ అధికారులు బుధవారం పరిశీలించారు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపండుగగా జరుగుతున్న తొలిజాతరకు సీఎం కేసీఆర్ రావడంపై గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆదిలాబాద్‌తో పాటు మహరాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్‌ల నుంచి వేలాదిగా తరలి వచ్చిన వివిధ తెగల ఆదివాసీలతో జాతర కిటకిటలాడుతోంది. ఈ నెల 27 వరకు నాగోబా జాతర కొనసాగుతుంది.