బెదిరింపులకు భయపడం: టీ ఎంఎస్‌ఓలు | will not fear threats stopping TV channels broadcasting | Sakshi
Sakshi News home page

బెదిరింపులకు భయపడం: టీ ఎంఎస్‌ఓలు

Published Tue, Aug 12 2014 2:56 AM | Last Updated on Fri, Aug 10 2018 5:09 PM

బెదిరింపులకు భయపడం: టీ ఎంఎస్‌ఓలు - Sakshi

బెదిరింపులకు భయపడం: టీ ఎంఎస్‌ఓలు

హైదరాబాద్: ప్రజల మనోభావాలు దెబ్బతీసిన చానళ్ల ప్రసారాల నిలిపివేతపై ఎవరి బెదిరింపులకు భయపడేది లేదని రంగారెడ్డి, మెదక్ జిల్లా ఎంఎస్‌ఓల సంఘం అధ్యక్షుడు సుభాష్‌రెడ్డి అన్నారు. సోమవారం మాదాపూర్‌లోని ఇమేజ్ గార్డెన్‌లో తెలంగాణ ఎమ్‌ఎస్‌ఓలు సమావేశమయ్యారు. టీవీ9, ఏబీఎన్ చానళ్ల ప్రసారాలను రెండు రోజుల్లో పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకు రావడం సమంజసం కాదన్నారు. అసభ్య పదజాలాన్ని వాడి ప్రజల  మనోభావాలను కించపరిచినందుకే ప్రసారాలు నిలిపివేశామని స్పష్టం చేశారు. కేబుల్ యాక్ట్ 19 సెక్షన్ ప్రకారం ప్రజల మనోభావాలు దెబ్బతీసిన చానళ్లపై చర్యలు తీసోకుండా ట్రాయ్ నోటీసులు జారీ చేయడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఆ చానళ్లు వైఖరి మార్చుకుని ప్రజల అభిమానాన్ని పొందితే ప్రసారాలు పునరుద్ధరిస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement