రామ్‌గోపాల్‌పేట (సికింద్రాబాద్) : ఓ మహిళ కుటుంబ కలహాలతో హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకోబోయింది. అయితే గమనించిన లేక్ పోలీసులు ఆమెను రక్షించారు. చుడీబజార్‌కు చెందిన వివాహిత సునీత (26) వారం క్రితం పుట్టింటికి వెళ్లింది. కాగా ఆదివారం రాత్రి తండ్రితో గొడవ పడిన ఆమె మనస్తాపంతో సోమవారం మధ్యాహ్నం సాగర్ వద్దకు వెళ్లి దూకే ప్రయత్నంలో ఉండగా పోలీసులు చూసి కాపాడారు.