గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్) : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మరో స్వైన్‌ఫ్లూ మృతి నమోదైంది. దీంతో ఈ సీజన్‌లో గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూతో మృతిచెందిన వారి సంఖ్య మూడుకు పెరిగింది. గాంధీ నోడల్ అధికారి నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా ఖాన్ చౌరస్తాకు చెందిన స్వరూప(55) ఈ నెల 11వ తేదీన స్వైన్‌ఫ్లూ లక్షణాలతో గాంధీ ఆస్పత్రిలో చేరింది. అదేరోజు నమూనాలు సేకరించి నిర్ధారణకు పంపారు. చికిత్స పొందుతూ 12వ తేదీన స్వరూప మృతిచెందింది. అయితే సోమవారం అందిన నివేదికలో స్వైన్‌ఫ్లూ నిర్ధారణ అయింది. గతంలోనూ రోగి మృతిచెందిన తర్వాత స్వైన్‌ఫ్లూ నివేదిక అందడం గమనార్హం.
ఈ నెల 4 వ తేదీన గాంధీలో స్వైన్‌ఫ్లూతో చేరిన రంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన బాలింత జగ్గమ్మ(20)కు వైద్య చికిత్సలు అందిస్తున్నామని, ఆమె కోలుకుంటుందని నోడల్ అధికారి తెలిపారు. మరో 8 మంది స్వైన్‌ఫ్లూ అనుమానితులకు డిజాస్టర్ వార్డులో చికిత్సలు అందిస్తున్నామని, నమూనాలు సేకరించి నిర్ధారణకు పంపించామన్నారు. గత వారం రోజుల్లో సుమారు 25 డెంగ్యూ కేసులు గాంధీ ఆస్పత్రిలో నమోదుకాగా, అత్యవసర వార్డుల్లో డెంగ్యూ రోగులకు వైద్యసేవలు అందిస్తున్నారు.
గాంధీలో మరో స్వైన్‌ఫ్లూ మృతి
Published Mon, Sep 14 2015 8:20 PM | Last Updated on Sun, Sep 3 2017 9:24 AM
Advertisement
Advertisement