మహిళా సర్పంచ్ ఆత్మహత్య | woman sarpanch committed suicide | Sakshi
Sakshi News home page

మహిళా సర్పంచ్ ఆత్మహత్య

Published Sat, Mar 21 2015 3:58 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

woman sarpanch committed suicide

స్టేషన్‌ఘన్‌పూర్ : వరంగల్ జిల్లాలోని స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలోని నష్కల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ మహిళా సర్పంచ్ నంగులూరి మాధవి(42)  ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే... శనివారం మాధవి తన ఇంట్లో ఉన్న కుక్కల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా... గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన ఎంజీఎం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆమె మరణించారు.
కాగా ఈ మధ్య భర్త చంద్రమౌళి మాధవిపై అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై తరచూ వేధింపులకు గురిచేస్తుండటంతో మాధవి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. భర్త చంద్రమౌళి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement