ప్రమాదంలో మహిళా రిపోర్టర్‌కు గాయాలు | Women at risk of injuries Reporter | Sakshi
Sakshi News home page

ప్రమాదంలో మహిళా రిపోర్టర్‌కు గాయాలు

Published Sat, May 16 2015 3:12 AM | Last Updated on Sun, Sep 3 2017 2:06 AM

Women at risk of injuries Reporter

డిచ్‌పల్లి: హైదరాబాద్ లోకల్ చానల్‌లో విధులు నిర్వహిస్తున్న రిపోర్టర్ వసుమతి శుక్రవారం రాత్రి నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.  ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పాదయాత్ర కవరేజీ అనంతరం రాత్రి హైదరాబాద్‌కు తిరిగివెళ్తూ డిచ్‌పల్లి సమీపంలోని దాబా వద్ద భోజనం కోసం ఆగారు. వాహనం దిగి హోటల్‌లోకి వెళ్లడానికి రోడ్డు దాటుతుండగా, హైదరాబాద్ వైపు నుంచి నిజామాబాద్ వైపు వెళుతున్న మారుతి కారు వేగంగా ఢీకొట్టింది.

దీంతో రోడ్డుపై కొద్ది దూరంలో ఎగిరి పడిన వసుమతి తీవ్రంగా గాయపడింది. ఆమె వెంట వచ్చిన రిపోర్టర్లు వెంటనే తమ వాహనంలో  జిల్లా కేంద్రంలోని ఓ హాస్పిటల్‌కు, అటు నుంచి   హైదరాబాద్ తీసుకెళ్లారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పరారయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement