
రాంగోపాల్‌పేట: మేల్ మరువత్తూర్ ఆదిపరాశక్తి అమ్మవారికి గంజి వార్పు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మేల్ మరువత్తూరు ఆదిపరాశక్తి ఆధ్యాత్మిక ప్రచార సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం రెజిమెంటల్‌బజార్‌లోని జూలమ్మ ఆలయం నుంచి కీస్ హైస్కూల్ వరకు ర్యాలీ కొనసాగింది. గంజి తలపై పెట్టుకుని అమ్మవారిని రథంలో ఉంచి పాటలు పాడుతూ సాగిన ర్యాలీ కనుల పండువగా సాగింది. అంతకుముందు కీస్ హైస్కూల్‌లో ఉదయం 6.30 నుంచి ఆదిపరాశక్తి వళిపాడు పూజలతో ఈ ఉత్సవం మొదలైంది. కీస్ హైస్కూల్‌లో ఉంచిన అమ్మవారికి ప్రజా గాయకుడు గద్దర్ ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమాల్లో సంస్థ తెలంగాణ అధ్యక్షుడు కళాధర్, ప్రధాన కార్యదర్శి రమేష్ గెల్లికీ, కోశాధికారి హరినాథ్ గుప్తా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment