
సాక్షి, హైదారాబాద్ : తెలుగు భాషా సౌరభం గుబాళించింది.. అమ్మ భాష గొప్పదనం కళ్ల ముందు కదలాడింది.. తేనెలూరే తెలుగు భాషకు పట్టం కట్టాలన్న ఆకాంక్షతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అలనాటి సాహితీ దిగ్గజాలు స్వర్గం నుంచి చూస్తే.. ఈ నేలపై వాలి మరోసారి తమదైన శైలిలో సాహితీ సేద్యాన్ని జరిపించాలని ఆశపడేవారేమో.. అన్నట్లుగా సాగింది. నృత్య కళాకారులు ప్రదర్శించిన పేరిణి నృత్యహేళతో సభలు సంప్రదాయ, సాహితీ సుగంధాన్ని అద్దుకున్నాయి. నిత్య సంతోషిణి, లావణ్య ఆలపించిన ‘యా కుందేందు..’ ప్రార్థనతో సభ మొదలైంది.
ప్రపంచ తెలుగు మహాసభలు- ప్రత్యేక కథనాలు
అమ్మ భాష బాగు కోసం.. సర్వశక్తులు ఒడ్డుతాం
సాక్షి, హైదరాబాద్ : తెలుగు భాష గొప్పగా భాసిల్లేందుకు, వికసించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శతధా, సహస్రదా సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నిస్తుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పేర్కొన్నారు.
మన భాషకు పట్టం
సాక్షి, హైదరాబాద్ : జీవన గమనానికి మాతృభాషే ఆయువుపట్టు. మాతృభూమిని, మాతృభాషను మరిచినవాడు మనిషే కాదు.