
మేడ్చల్: చికెన్ బిర్యానీలో పురుగుల వచ్చిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వాగత్ బార్ అండ్ రెస్టారెంట్‌లో గురువారం రాత్రి చోటుచేసుకుంది. చికెన్‌లో పురుగులు ఉన్న విషయం గుర్తించిన కస్టమర్ బార్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా లాభం లేకపోయింది. ఈ అంశంపై బార్ మేనేజర్ నోరు మెదపకపోవడంతో కస్టమర్లు ఆందోళన చేపట్టారు.
బోడుప్పల్ స్వాగత్ బార్ అండ్ రెస్టారెంట్ లో మద్యం సేవిస్తున్న ఓ వినియోగదారుడు చికెన్ 65 అర్డరిచ్చాడు. అనంతరం అందులో నుంచి పురుగులు రావడం గుర్తించిన కస్టమర్ మరో ఐటంను గమనించాలని బిర్యాని తెప్పించుకున్నాడు. అది కూడా కుళ్లిపోయి.. ఫంగస్ చేరి ఉండటంతో మేనేజర్‌ను నిలదీశాడు. దీనిపై మేనేజర్ ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో.. కస్టమర్లు ఆందోళనకు దిగారు. సంబంధిత అధికారులు తక్షణమే బార్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.