సాక్షిప్రతినిధి, నల్లగొండ :జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ యడవెల్లి విజయేందర్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను డీసీసీబీ అధికారులకు పంపినట్లు సమాచారం. కాగా, తన రాజీనామాపై స్పందించిన విజయేందర్‌రెడ్డి ‘రాజీ నామా చేయడం ఖాయం. కానీ, ఇంకా లేఖ మాత్రం పంపలేదు...’ అని ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. విశ్వసనీయ సమాచారం మేరకు విజయేందర్‌రెడ్డి తన సహాయకుడి ద్వారా డీసీసీబీ ఉన్నతాధికారులకు తన రాజీ నామా లేఖను పంపారు. అధికారులు ఆ లేఖను సీసీఆర్‌సీఎస్ (కమిషనర్ ఫర్ కోఆపరేషన్ అండ్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్)కు పంపనున్నట్లు సమాచారం.
సీసీఆర్ సీఎస్ ఆమోదం తర్వాత, అధికారికంగా రాజీ నామాను ప్రకటించే వీలుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. సహకార ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఆరు నెలల పాటు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిన విజయేందర్‌రెడ్డి ఆ తర్వాత తిరిగి బాధ్యతల్లో చేరారు. ఆ ఆరునెలల పాటు వైస్‌చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు ఇన్‌చార్జ్ చైర్మన్‌గా వ్యవహరించారు. ఈలోగా సార్వత్రిక ఎన్నికల్లో దెబ్బతిన్న కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది. ఇప్పుడు జిల్లాలో కాం గ్రెస్ చేతిలో జిల్లా పరిషత్, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఉన్నాయి.
కాగా, ఎన్నికల ముందు ఒప్పందం కచ్చితంగా అమలు కావాల్సిందేనని ఓ మాజీ మంత్రి పట్టుబడుతుం డడంతో విజయేందర్‌రెడ్డి రాజీనామాకే మొగ్గుచూపినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, చైర్మన్ రాజీనామా ఆమోదం పొం దాక, తిరిగి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే దాకా మాత్రమే వైస్‌చైర్మన్ ఇన్‌చార్జ్ చైర్మన్‌గా ఉంటారని, ఎన్నికల్లో తిరిగి ఎన్నుకుంటే మినహా పాండురంగావు చైర్మన్ అయ్యే అవకాశమే లేదు. మా రిన రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్‌కు చెందిన డెరైక్టర్లు ఎందరు తమ నాయకుల మాట వింటారన్నది ప్రశ్నార్థకమే.
యడవెల్లి రాజీనామా!
Published Tue, Sep 16 2014 1:11 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement