సోనియా గాంధీతో మాట్లాడుతున్న ఆర్టిస్ట్ ఆంజనేయులు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఓక్లా ఎన్‌ఎస్‌ఐసీ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ‘హియర్ నౌ అండ్ దెన్’పేరుతో గత మూడురోజులుగా అంతర్జాతీయ ఆర్ట్‌ఫెయిర్ జరుగుతోంది. ఇందులో హైపర్ రియలిజం ఆర్ట్‌లో సూర్యాపేట జిల్లా గరిడేపల్లికి చెందిన గుండు ఆంజనేయులు చిత్రాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. ఎక్కువ సమయం తీసుకొనే ఈ ఆర్ట్‌లో ఆంజనేయులు ఏడాది కాలంలో ఐదు చిత్రాలను రూపొందించారు. ఈ చిత్రాల ప్రత్యేకతను గుర్తించిన ‘ఆర్ట్ ఎలైవ్ గ్యాలరీ’వారు ఆంజనేయులు చిత్రాలకోసం ప్రత్యేకంగా ఒక గ్యాలరీని ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ గౌరవం దక్కించుకున్న ఏకైక వ్యక్తి ఆంజనేయులు కావడం గమనార్హం. గ్యాలరీలో ప్రదర్శించిన ఐదు చిత్రాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా అతను గీసిన నులక మంచం, సోడా బండి, సైకిల్, తుమ్మకంప అందరి మన్ననలు పొందాయి. ఈ ఆర్ట్‌ఫెయిర్‌ను పరిశీలించేందుకు వచ్చిన యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ఆంజనేయులును ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment