స్నేహితుడి వివాహానికి హాజరై..
గంగాపురం (గుండాల) :స్నేహితుడి వివాహానికి వచ్చిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు వ్యవసాయబావిలో పడి మృతిచెం దాడు. ఈ విషాదఘటన గుండాల మండలం గంగాపురం గ్రామంలో గురువారం చోటు చేసుకుం ది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగాపురం గ్రామానికి చెందిన మరిపెల్లి జనార్దన్, వరంగల్ జిల్లా దేవరుప్పల మండలం అప్పిరెడ్డిపల్లికి చెందిన అవిటె రాజశేఖర్ (25), ఇదే జిల్లా లింగాలఘనపురం మండలం బండ్లగూడేనికి చెందిన యాదిరెడ్డి స్నేహితులు. వీరు ఇంటర్ వరకు జనగామలో చదువుకున్నారు. అనంతరం ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లి ఒకే గదిలో ఉంటూ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే బుధవా రం గ్రామంలో జరిగిన మరిపెల్లి జనార్దన్ వివాహానికి రాజశేఖర్,యాదిరెడ్డి హాజరయ్యారు.
గురువారం ఉదయం స్నానం చేసేందుకు గ్రామ శివారులోని వ్యవసాయబావి వద్దకు వెళ్లారు. ఆ సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. యా దిరెడ్డి బావిలోకి దిగి స్నానం చేస్తుండగా, రాజశేకర్‌కు ఈత రాకపోవడంతో బావి ఒడ్డున రాతిపై నిలబడి స్నానం చేస్తున్నాడు. ఈ క్రమంలో బావి గట్టుపై పెట్టి న యాదిరెడ్డి సెల్‌మోగడంతో పైకి వెళ్లా డు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారడంతో రాజశేఖర్ బావిలో పడిపోయాడు. ఫోన్ మాట్లాడిన అనంతరం తిరి గి యాదిరెడ్డి బావిలోపలికి రాగ రాజశేఖ ర్ కనిపించలేదు. ఇంతలోనే అటువైపు వచ్చిన పెళ్లి బృందం సభ్యులకు విష యం తెలుపగా అందరూ కలిసి వెతకసాగారు.
రాజశేఖర్‌కు ఈతరాదని యాదిరెడ్డితో వారితో చెప్పడంతో అందరూ కలిసి బావిలో వెతకినా ఫలితం లేకుండా పోయింది. గ్రామస్తుల సాయంతో చివరకు ఇనుపకొండ్ల సాయంతో గాలింపు చర్యలు ముమ్మరం చేయడంతో రాజశేఖ ర్ మృతదేహం బావిచెరికలో ఇరుక్కుని ఉంది. మృతదేహాన్ని బయటకు తీసి బం దువులకు సమాచారం అందించారు. మృ తుడి గ్రామ సర్పంచ్ సుదర్శన్ ఫిర్యాదు మేరకు స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ యాద య్య ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు.
ఆసరా కోల్పోయిన తల్లిదండ్రులు
అప్పిరెడ్డిపల్లికి చెందిన అవిటె రాజు, ప్రమీల దంపతులకు రాజశేఖర్ ఒక్కగానొక్క సంతానం. కాగా, రాజు మానసిక వికలాంగుడు. తల్లి ప్రమీల పక్షవాతంలో బాధపడుతోంది. అయితే ఆ కుటుంబానికి రాజశేఖరే జీవనాధారం. కుటుం బా న్ని పోషించే తమ కొడుకు ఇక లేడని వా ర్తా తెలిసినా ఆ తల్లిదండ్రులు రాలేని దయనస్థితిలో ఉన్నారని ఆ గ్రామ సర్పం చ్ సుదర్శన్ పేర్కొన్నాడు.