- సైనిక ఉన్నతాధికారి రోహిల్లా
- కొనసాగుతున్న ఆర్మీ ర్యాలీ..
ఆదిలాబాద్ స్పోర్ట్స్ : యువత దేశ సేవ చేసేందుకు ఆర్మీలో చేరాలని ఆర్మీ సైనిక ఉన్నతాధికారి ఏకే.రోహిల్లా పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహిస్తున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి నిజామాబాద్ జిల్లా అభ్యర్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత నిరుత్సాహపడకుండా సాధన చేయాలని, దృఢమైన సంకల్పాన్ని కలిగి ఉండాలని అన్నారు. ఆర్మీలో చేరిన వారికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందని, సైన్యంలో చేరి దేశ రక్షణ చర్యల్లో పాల్గొనే అదృష్టం కలుగుతుందని చెప్పారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలని పేర్కొన్నారు. రన్నింగ్‌లో సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు వివరించారు.
1720 మంది అర్హత
ఆర్మీ ర్యాలీకి గురువారం నిజామాబాద్ అభ్యర్థులు 2750 మంది హాజరయ్యూరు. ఎత్తులో 850 మంది అభ్యర్థులు తిరస్కరణకు గురయ్యూరు. కాగా ధ్రువీకరణ పత్రాలు సంక్రమంగా లేక 180 మంది అభ్యర్థులను రిజక్ట్ చేశారు. మొత్తం 1720 మంది అభ్యర్థులు రన్నింగ్‌కు అర్హత సాధించారు. గురువారం కరీంనగర్ జిల్లా అభ్యర్థులు రన్నింగ్‌లో పాల్గొన్నారు. ఇందులో 343 మంది రన్నింగ్‌లో పాస్ అయ్యారు. 26 మంది ఎత్తు, ఛాతి, భీమ్ ఇతర అంశాల్లో రిజక్ట్ అయ్యూరు. 343 మంది మెడికల్ టెస్ట్‌లకు అర్హత సాధించారు. కాగా, బుధవారం జరిగిన మెడికల్ టెస్ట్‌లో 160 మంది పాసయ్యారు.
ఇందులో 81 మంది రాత పరీక్షకు అర్హులుగా గుర్తించారు. 61 మంది పర్మినెంట్ అన్‌ఫిట్‌గా గుర్తించారు. వీరు రూ.600 ఫీజు చెల్లించి సికింద్రాబాద్ ఆస్పత్రిలో మెడికల్ పరీక్ష చేయించుకోని తిరిగి ఆర్మీ అధికారులను సంప్రదించాలని సూచించారు. 18 మంది టెంపరరీ అన్‌ఫిట్‌గా గుర్తించినట్లు తెలిపారు. వారు సైతం ఉచితంగా సికింద్రాబాద్ ఆస్పత్రిలో మెడికల్ పరీక్ష చేయించుకోవాలని చెప్పారు. ఆర్మీ అధికారులు ధార్వీ, జిల్లా అధికారులు డీఎస్‌డీవో సుధాకర్‌రావు, మెప్మాపీడీ రాజేశ్వర్‌రాథోడ్, రెవెన్యూ అధికారిణి వనజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
9న మెదక్, హైదరాబాద్ అభ్యర్థులకు..
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహిస్తున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో ఈ నెల 9వ తేదీన మెదక్, హైదరాబాద్ అభ్యర్థులకు అవకాశం అందిస్తున్నట్లు ఆర్మీ సైనిక ఉన్నతాధికారి ఎకే.రోహిల్లా కోరారు. రెండు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో యువకులు హాజరుకావాలని, వివిధ జిల్లాల నుంచి వస్తున్న అభ్యర్థులకు వసతి సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆర్టీసీ బస్సులు సమ్మెలో ఉన్నందున రైలు మార్గంతో వచ్చే ప్రయత్నం చేయాలని సూచించారు.
దేశ సేవ కోసం ఆర్మీలో చేరండి
Published Fri, May 8 2015 2:19 AM | Last Updated on Sun, Sep 3 2017 1:36 AM
Advertisement
Advertisement