Indira Priyadarshini Stadium
-
ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో స్వచ్ఛభారత్
►జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి ►ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో స్వచ్ఛభారత్ ఆదిలాబాద్ స్పోర్ట్స్ : ప్రతీఒక్కరు స్వచ్ఛత వైపుగా అడుగేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి సూచించా రు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం లో మంగళవారం స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామా లు, పట్టణాల్లో స్వచ్చభారత్ కార్యక్రమాలను నిర్వహిస్తూ యువత ఆదర్శంగా నిలవాలన్నారు. విద్యార్థులు సేవా దృక్పదాన్ని కలిగి ఉండి సమాజా ఉన్నతికి తమవంతు కృషి చేయాలని సూచించారు. భావిభారత పౌ రులు విద్యార్థులేనని, భవిష్యత్తు తరాలకు ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించాలన్నారు. అనంతరం ఐపీ స్టే డియంలోని పిచ్చిమొక్కలు, మైదానం చుట్టూ ఉన్న పి చ్చిమొక్కలు తొలగించి గుంతలను పూడ్చారు. ఈ కా ర్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి ఎన్.వెంకటేశ్వర్లు, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలూరి గోవర్దన్‌రెడ్డి, ఎన్ఎస్ఎస్ సమన్వయ కర్త తిరుపతి రెడ్డి, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు. -
దేశ సేవ కోసం ఆర్మీలో చేరండి
- సైనిక ఉన్నతాధికారి రోహిల్లా - కొనసాగుతున్న ఆర్మీ ర్యాలీ.. ఆదిలాబాద్ స్పోర్ట్స్ : యువత దేశ సేవ చేసేందుకు ఆర్మీలో చేరాలని ఆర్మీ సైనిక ఉన్నతాధికారి ఏకే.రోహిల్లా పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహిస్తున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి నిజామాబాద్ జిల్లా అభ్యర్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత నిరుత్సాహపడకుండా సాధన చేయాలని, దృఢమైన సంకల్పాన్ని కలిగి ఉండాలని అన్నారు. ఆర్మీలో చేరిన వారికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందని, సైన్యంలో చేరి దేశ రక్షణ చర్యల్లో పాల్గొనే అదృష్టం కలుగుతుందని చెప్పారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలని పేర్కొన్నారు. రన్నింగ్‌లో సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు వివరించారు. 1720 మంది అర్హత ఆర్మీ ర్యాలీకి గురువారం నిజామాబాద్ అభ్యర్థులు 2750 మంది హాజరయ్యూరు. ఎత్తులో 850 మంది అభ్యర్థులు తిరస్కరణకు గురయ్యూరు. కాగా ధ్రువీకరణ పత్రాలు సంక్రమంగా లేక 180 మంది అభ్యర్థులను రిజక్ట్ చేశారు. మొత్తం 1720 మంది అభ్యర్థులు రన్నింగ్‌కు అర్హత సాధించారు. గురువారం కరీంనగర్ జిల్లా అభ్యర్థులు రన్నింగ్‌లో పాల్గొన్నారు. ఇందులో 343 మంది రన్నింగ్‌లో పాస్ అయ్యారు. 26 మంది ఎత్తు, ఛాతి, భీమ్ ఇతర అంశాల్లో రిజక్ట్ అయ్యూరు. 343 మంది మెడికల్ టెస్ట్‌లకు అర్హత సాధించారు. కాగా, బుధవారం జరిగిన మెడికల్ టెస్ట్‌లో 160 మంది పాసయ్యారు. ఇందులో 81 మంది రాత పరీక్షకు అర్హులుగా గుర్తించారు. 61 మంది పర్మినెంట్ అన్‌ఫిట్‌గా గుర్తించారు. వీరు రూ.600 ఫీజు చెల్లించి సికింద్రాబాద్ ఆస్పత్రిలో మెడికల్ పరీక్ష చేయించుకోని తిరిగి ఆర్మీ అధికారులను సంప్రదించాలని సూచించారు. 18 మంది టెంపరరీ అన్‌ఫిట్‌గా గుర్తించినట్లు తెలిపారు. వారు సైతం ఉచితంగా సికింద్రాబాద్ ఆస్పత్రిలో మెడికల్ పరీక్ష చేయించుకోవాలని చెప్పారు. ఆర్మీ అధికారులు ధార్వీ, జిల్లా అధికారులు డీఎస్డీవో సుధాకర్‌రావు, మెప్మాపీడీ రాజేశ్వర్‌రాథోడ్, రెవెన్యూ అధికారిణి వనజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 9న మెదక్, హైదరాబాద్ అభ్యర్థులకు.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహిస్తున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో ఈ నెల 9వ తేదీన మెదక్, హైదరాబాద్ అభ్యర్థులకు అవకాశం అందిస్తున్నట్లు ఆర్మీ సైనిక ఉన్నతాధికారి ఎకే.రోహిల్లా కోరారు. రెండు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో యువకులు హాజరుకావాలని, వివిధ జిల్లాల నుంచి వస్తున్న అభ్యర్థులకు వసతి సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆర్టీసీ బస్సులు సమ్మెలో ఉన్నందున రైలు మార్గంతో వచ్చే ప్రయత్నం చేయాలని సూచించారు. -
దేశ సేవకు ముందుండాలి
మంత్రి జోగు రామన్న పిలుపు ⇒ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభం ⇒ 3012 మంది అభ్యర్థులు హాజరు ⇒ మెడికల్ టెస్ట్‌కు 615 మంది అర్హత ⇒ రెండో రోజూ ధ్రువీకరణ పత్రాల పరిశీలన ⇒ అర్హత-1656 , రిజక్ట్ 894 మంది ఆదిలాబాద్ స్పోర్ట్స్ : సైన్యంలో చేరి దేశానికి సేవ చేయడంలో యువత ముందుండాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాటు చేసిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యూరు. జాతీయ జెండా ఆవిష్కరించారు. జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ కోసం వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాను ఎంచుకోవడం హర్షించదగిన విషయమని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ర్ట ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో మరిన్ని కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. కలెక్టర్ ఎం.జగన్మోహన్ మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న యువతకు ఆర్మీలో భారత సరిహద్దు ప్రాంతాల్లో దేశ రక్షణ అవకాశం కల్పించినందుకు ఆర్మీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. 5 జిల్లాలకు చెందిన యువత పాల్గొంటోందని, 18 శాఖల పర్యవేక్షణతో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని వివరించారు. చెన్నై జోన్ డెప్యూటీ డెరైక్టర్ జనరల్ సంగ్రామ దార్వీ, సైనిక ఉన్నతాధికారి కల్నల్ ఎ.కే.రోహిలా, ఏఎస్పీ పనసారెడ్డి, ఏజేసీ ఎస్.ఎస్.రాజు, డీఎస్డీవో సుధాకర్‌రావు, మెప్మా పీడీ రాజేశ్వర్, రెవెన్యూ అధికారి వనజారెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మెడికల్ టెస్ట్‌కు 615 మంది అర్హత ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో సోమవారం అర్హత సాధించిన జిల్లా యువకులు 3,012 మంది రన్నింగ్‌లో పాల్గొన్నారు. ఇందులో యువకులు చాలామంది అలసిపోయి, మధ్యలోనే ఆగి పడిపోయారు. 3012 మందిలో నుంచి 615 మంది మెడికల్ పరీక్షలకు అర్హత సాధించారు. వీరికి బుధవారం ఉదయం 6 గంటలకు ఆర్మీకి చెందిన పది మంది బృందంతో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా, మంగళవారం జిల్లాకు చెందిన 2,550 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఎత్తు లేని వారిని 228 మందిని రిజక్ట్ చేశారు. ధ్రువీకరణ పత్రాలు సక్రమంగా లేని వారిని 666 మందిని వెనక్కి పంపించారు. 1,656 మంది పరుగుకు అర్హత సాధించారు. వీరు బుధవారం ఉదయం 5 గంటలకు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో రిపోర్ట్ చేయాలని ఆర్మీ అధికారులు కోరారు. ఆర్మీ సైనిక ఉన్నతాధికారి కల్నల్ ఏకె.రోహిలా యువతకు పలు సూచనలందించారు. సోమవారం రాత్రి గాలివాన బీభత్సంగా ఉన్నా అధికారులు, యువకులు ఉత్సాహంగా ముందుకుసాగి ర్యాలీని విజయవంతం చేశారని చెప్పారు. -
‘శాయ్’.. బాబోయ్!
- స్టేడియం నిండా సమస్యలే.. - గుంతలమయంగా రన్నింగ్ ట్రాక్ - ఎటు చూసినా పిచ్చిమొక్కలే దర్శనం - పాములకు ఆవాసం.. - నడక కోసం వస్తే నరకయాతన - క్రీడాకారులకు తప్పని తిప్పలు - టాయిలెట్స్ సైతం లేని దుస్థితి - ఇటువైపు దృష్టి సారించని అధికారులు మెదక్: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మెదక్ పట్టణం ముఖద్వారంలో 2000 సంవత్సరంలో ఇందిర ప్రియదర్శిని స్టేడియం ఏర్పాటు చేశారు. సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో.. 400 మీటర్ల పొడవున ఏర్పాటు చేసిన రన్నింగ్ ట్రాక్ సమీప జిల్లాల్లో ఎక్కడాలేదు. అప్పట్లో సుమారు రూ.50 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ స్టేడియంను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. ఇక్కడ అథ్లెట్లకు శిక్షణ ఇస్తున్నారు. సుమారు 50 సీట్లు ఉన్నప్పటికీ ప్రస్తుతం 30 మంది క్రీడాకారులు మాత్రమే శిక్షణ పొందుతున్నారు. గతంలో బాక్సింగ్, ఉమెన్స్ కబడ్డీ అకాడమీ ఉండగా వాటిని ఎత్తేశారు. రన్నింగ్‌లో ఇక్కడ శిక్షణ పొందిన మెరికల్లాంటి చిరుతలు జాతీయ, అంతర్జాతీయస్థాయిల్లో ఉత్తమ బహుమతులు అందుకున్నారు. కనీస సౌకర్యాలు కరువు: లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన స్టేడియంలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. టాయిలెట్లు శిథిలం కావడంతో మసక చీకట్లోనే క్రీడాకారులంతా కాలకృత్యాల కోసం ఆరుబయటకు వెళ్తుంటారు. బాత్రూంలు సక్రమంగా లేకపోవడంతో ఆరుబయటే స్నానాలు చేస్తున్నారు. స్టేడియంలో పిచ్చి మొక్కలు, గడ్డి పెరిగిపోయి పాములకు ఆవాసంగా మారింది. దీంతో మసక చీకట్లో స్టేడియంకు వచ్చే క్రీడాకారులు, పట్టణ వాకర్స్ బిక్కుబిక్కుమంటూ అడుగులు వేస్తున్నారు. రన్నింగ్ ట్రాక్ గుంతలమయం కావడంతో చిన్నపాటి వర్షానికే నీరు నిలిచిపోతుంది. దీంతో పలువురు అథ్లెట్లు కిందపడి గాయాల పాలవుతున్నారు. హైజంప్, లాంగ్ జంప్ల కోసం ఏర్పాట్లు లేకపోవడంతో నేలపై ఇసుక పోసుకొని ఉద్యోగార్థులు నానా పాట్లు పడుతూ ప్రాక్టీస్ చేస్తున్నారు. స్టేడియం మధ్యలో ఒక్క లైట్ కూడా లేక చీకట్లోనే పట్టణ ప్రజలు వాకింగ్ చేస్తున్నారు. అటు స్పోర్ట్ ఆథార్టీ ఆఫ్ ఇండియా అధికారులు కానీ, ప్రభుత్వం కానీ, మున్సిపాలిటీ గానీ పట్టించుకోకపోవడంతో భారీ స్టేడియం సమస్యలకు నిలయంగా మారింది. ఈ విషయమై స్టేడియం కోచ్ శ్రీనివాస్‌ను వివరణ కోరగా సెప్టిక్ ట్యాంకు కూలిపోవడం వల్లే మరుగుదొడ్లు పనికి రాకుండా పోయాయన్నారు. ప్రత్యామ్నాయంగా రింగులు ఏర్పాటు చేస్తున్నామని, త్వరలో టాయిలెట్లు పునరుద్ధరిస్తామని తెలిపారు. సింథటిక్ ట్రాక్ వేయాలి స్టేడియంలో 400 మీటర్ల ట్రాక్ ఉన్నప్పటికీ పూర్తిగా శిథిలమై రన్నింగ్‌కు అనుకూలంగా లేదు. గుంతలమయంగా మారిన ట్రాక్‌పై పరుగులు పెట్టడం ప్రమాదాలకు నెలవుగా మారుతోంది. ఎస్ఐ, కానిస్టేబుల్స్, ఎక్సైజ్ శాఖలో ఉద్యోగాల కోసం ప్రాక్టీస్ చేసేవారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. - ఆనందం. రిటైర్డ్ పీడీ ఉపాధి హామీ నిధులతో పిచ్చిమొక్కలు తొలగించాలి ఉపాధి హామీ పనులతో స్టేడియంలో పెరిగిపోయిన పిచ్చిమొక్కలు తొలగించాలి. ట్రాక్ ఇరువైపుల ఉన్న పగుళ్లలో మట్టి పోయించాలి. మున్సిపాలిటీ అధికారులు స్పందించాలి. -కృష్ణ, రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి