
సుధీర్ రెడ్డి మృతదేహం
వరంగల్: వైఎస్ఆర్ సీపీ యువనేత భీంరెడ్డి సుధీర్ రెడ్డి(36) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సుధీర్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం కాజీపేట సమీపంలో తరాలపల్లి వద్ద కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.
సుధీర్ రెడ్డి మృతికి వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎంపి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సంగిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు సంతాపం తెలిపారు. సుధీర్ రెడ్డి మొదటి నుంచి వైఎస్ జగన్కు వీరాభిమానిగా గుర్తింపు పొందారు.