భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న పొంగులేటి
వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకుల నుంచి తీర్థప్రసాదాలు, ఆశీర్వచనాలు స్వీకరించారు. శుక్రవారం నుంచి జిల్లాలో పర్యటించనున్న పొంగులేటి.. భద్రాచలం నుంచి కారేపల్లికి వెళ్లనున్నారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను పరామర్శిస్తారు.
విశ్వనాథపల్లి, బాద్‌మల్లయ్యగూడెం, కారేపల్లిలో ఎంపీ ల్యాడ్స్‌తో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఎంపీపీ ఇంట్లో జరిగే శుభకార్యానికి కూడా పొంగులేటి హాజరుకానున్నారు. సాయంత్రం దమ్మపేట మండలంలో నాగువల్లి, మొండివర్రి గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. దమ్మపేటలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు గ్యాస్ స్టౌలు పంపిణీ చేయనున్నారు.