khammam tour
-
కేసీఆర్ సర్కార్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది: అమిత్ షా
సాక్షి, ఖమ్మం: కేసీఆర్ సర్కార్‌కు కౌంట్‌డౌన్ మొదలైందని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. ఖమ్మం నుంచి ఎన్నికల శంఖారావం పూరించిన ఆయన.. ‘రైతు గోస–బీజేపీ భరోసా’ బహిరంగ సభలో మాట్లాడుతూ, కేసీఆర్ సర్కార్‌ను సాగనంపాలని.. తెలంగాణలో బీజేపీ సర్కార్ రావాలన్నారు. ‘‘తెలంగాణలో కేసీఆర్ సర్కారు పోతుంది. కమలం వికసిస్తుంది. కేసీఆర్ కారు భద్రాచలం వెళ్తుంది.. కానీ రాముడి గుడికి వెళ్లదు. కేసీఆర్ కారు స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉంది. కేసీఆర్ పనైపోయింది. భవిష్యత్ సీఎం బీజేపీ అభ్యర్థే అవుతారు..తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘బీఆర్ఎస్ 2జీ పార్టీ, కాంగ్రెస్ 4జీ పార్టీ, ఎంఐఎం 3జీ పార్టీ.. 4జీ, 3జీ, 2జీ కాదు తెలంగాణలో వచ్చేది బీజేపీనే.. కాంగ్రెస్ 4జీ అంటే నాలుగు తరాల పార్టీ. బీఆర్ఎస్ 2జీ అంటే రెండు జనరేషన్ల పార్టీ. ఎంఐఎం 3జీ అంటే మూడు జనరేషన్ల పార్టీ’’ అంటూ అమిత్ షా చురకలు అంటించారు. ‘‘తెలంగాణ ఉద్యమం కోసం అనేక మంది యువకులు ప్రాణత్యాగం చేశారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం రజాకార్ల పక్కన కూర్చొని పాలిస్తోంది. బీజేపీ ఎప్పుడూ బీఆర్ఎస్తో కలిసి వెళ్లదు. మజ్లిస్‌తో కలిసి ఉండేవాళ్ల పక్కన మేం కూర్చొం. 9 ఏళ్లలో తెలంగాణకు కేంద్రం రూ.2.80 లక్షల కోట్లు ఇచ్చింది’’ అని అమిత్‌షా పేర్కొన్నారు. కేసీఆర్ ఉత్తర కుమార ప్రగల్భాలు: కిషన్‌రెడ్డి రైతులకు భరోసా ఇవ్వాలని బీజేపీ నిర్ణయించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ‘రైతు గోస–బీజేపీ భరోసా’ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ విమోచణ దినోత్సవాలను కేసీఆర్ నిర్వహించడం లేదు. పంటల బీమా పథకం అమలు చేయడం లేదు. రైతులకు సీడ్ సబ్సిడీ అందడం లేదు’’ అని మండిపడ్డారు. ‘‘రైతుల ఆత్మహత్యల్లో 75 శాతం కౌలు రైతులే. కల్తీ విత్తనాలపై కేసీఆర్ సర్కార్ చర్యలు శూన్యం. ఉచిత ఎరువులు ఇస్తామని కేసీఆర్ ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారు. రైతు రుణమాఫీ పేరుతో రైతులకు వెన్నుపోటు పొడిచారు. సకాలంలో రుణమాఫీ చేయకపోవడంతో వడ్డీలు పెరిగాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేకపోవటంతో రైతులు నష్టపోతున్నారు. ధరణి పోర్టల్‌తో 20 లక్షల రైతులు ఇబ్బంది పడుతున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రైతు సమస్యలన్నీ పరిష్కరిస్తాం. బీజేపీ పూర్తిగా రైతుల పక్షాన నిలబడుతుంది’’ అని కిషన్‌రెడ్డి అన్నారు. -
సిట్టింగ్‌లకే సీట్లు వస్తాయన భ్రమల్లో ఉండొద్దు: మంత్రి కేటీఆర్
-
దేశం అబ్బురపడేలా అభివృద్ధి: కేటీఆర్
సాక్షి, ఖమ్మం: దేశం అబ్బురపడేలా తెలంగాణలో అభివృద్ధి జరుగుతోందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఖమ్మం జిల్లాలో సోమవారం కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. దేశంలో సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. సీఎం కేసీఆర్ పాలన స్వర్ణయుగమని చెప్పారు. పేదవారి ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే కేసీఆర్ ధ్యేయమని వెల్లడించారు. తెలంగాణలో 42 లక్షల మందికి ఆసరా పింఛన్లు ఇస్తున్నామని.. పింఛన్ల కోసం రూ. 4 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నామని తెలిపారు. కేసీఆర్ మహిళల కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టే.. ఇంటింటికి మంచినీరు అందించాలనే ఉద్దేశంతో మిషన్ భగీరథ కార్యక్రమం చేపట్టామని అన్నారు. మరో వైపు జిల్లాలో కేటీఆర్ పర్యటన సందర్భంగా పలువురు నేతలనను ముందస్తు అరెస్టులు చేపట్టారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, ఖమ్మం టూటౌన్ కారదర్శి వై. విక్రమ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు అక్రమ అరెస్టును సీపీఎం నేతలు ఖండిస్తున్నారు. -
'మరుగుదొడ్డి కావాలన్నా.. ఢిల్లీకి వెళ్లాల్సిందే'
సాక్షి, ఖమ్మం: కాంగ్రెస్ పార్టీపై నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలు పగటి కలలు కంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఆయన సోమవారం ఖమ్మంలో పర్యటించారు. ఈ సందర్బంగా హరీష్ మాట్లాడుతూ జాతీయ పార్టీని నమ్ముకుంటే తెలంగాణ ప్రజలకు మిగిలేది సున్నా అని తెలిపారు. మిషన్ కాకతీయ, 24 గంటల విద్యుత్ వంటి పనులు కాంగ్రెస్ హయాంలో ఎప్పుడైనా జరిగాయా అని ప్రశ్నించారు. మరుగుదొడ్డి కావాలన్నా కాంగ్రెస్ నేతలు ఢిల్లీ నుంచి అనుమతి తీసుకోవల్సిందేనన్నారు. ఖమ్మం జిల్లా ఎండిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీయేనని ఆరోపించారు. రెండేళ్లలో సీతారామ ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. -
కేసీఆర్ టూర్లో పోలీసుల అత్యుత్సాహం
-
కేసీఆర్ టూర్లో పోలీసుల అత్యుత్సాహం
సూర్యాపేట: సీఎం పర్యటనలో పోలీసుల అత్యుత్సాహం ఓ వృద్ధురాలి ప్రాణం తీసింది. సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలో ఖమ్మం పర్యటనకు వెళ్తూ మార్గం మధ్యలో సూర్యాపేటలోని మంత్రి జగదీష్ ఇంటికి వచ్చారు. అదే సమయంలో ఆ ఇంటి పక్కనే ఉన్న ఆస్పత్రికి స్థానిక శ్రీరామ్‌నగర్ కాలనీకి చెందిన సోమా లక్ష్మమ్మ(65) అనే వృద్ధురాలిని మధ్యాహ్నం 12 గంటల సమయంలో చికిత్స కోసం తీసుకొచ్చారు. అయితే సీఎం బందోబస్తుకు వచ్చిన పోలీసులు వారిని ఆస్పత్రిలోకి అనుమతించలేదు. దీంతో సకాలంలో వైద్యం అందక ఆమె మృతి చెందింది. సీఎం వచ్చారంటూ ఆస్పత్రిలోకి వెళ్లడానికి తమను పోలీసులు అనుమతించకపోవడంతోనే తన భార్య మృతి చెందిందని లక్ష్మమ్మ భర్త ఆరోపిస్తున్నారు. ఆమె బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. కాగా ఆమె గుండెపోటుతో మృతి చెందిందని వైద్యులు చెబుతున్నారు. -
సీఎం ఖమ్మం పర్యటన ఖరారు
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఖమ్మం పర్యటన ఖరారైనట్లు సమాచారం. ఈ నెల 31వ తేదీన తిరుమలాయపాలెం మండలం ఇస్లావత్‌తండా వద్ద భక్తరామదాసు ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు ట్రయల్‌రన్‌ను విజయవంతంగా నడిపిన విషయం విదితమే. ఈ మేరకు ఆయన ఖమ్మం జిల్లా పర్యటన ఖరారైనట్టు తెలుస్తోంది. -
మంత్రి పర్యటనకు గైర్హాజరు.. అధికారిని సస్పెండ్
అశ్వరావుపేట(ఖమ్మం): రాష్ట్ర మంత్రి పర్యటనకు హాజరుకాని ప్రభుత్వ అధికారినిపై సస్పెన్షన్ వేటు పడింది. ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండలంలో శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పర్యటించారు. ఈ పర్యటనకు ఐసీడీఎస్ సీడీపీఓగా విధులు నిర్వహిస్తున్న అన్నపూర్ణ అనే ఉద్యోగిని గైర్హాజరయ్యారు. దీంతో ఆగ్రహించిన మంత్రి సీడీపీఓను సస్పెండ్ చేయాలని కలెక్టర్ రాజీవ్‌కు ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఖమ్మంలో సీఎం కేసీఆర్ పర్యటన ప్రారంభం
ఖమ్మం: రెండు రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం ఖమ్మం నగరానికి విచ్చేశారు. ఆయనకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్, కలెక్టర్, ఎస్పీలు ఘన స్వాగతం పలికారు. ఖమ్మం నగరంలో పర్యటిస్తున్న సీఎం కాన్వాయ్‌ను సీపీఎం నాయకులు అడ్డుకున్నారు. కేసీఆర్ నూతన బస్టాండ్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం రాపర్తినగర్లో డంపింగ్ యార్డు స్థలాన్ని పరిశీలించి తిరిగి వెళ్తుండగా సీపీఎం కార్యకర్తలు సీఎం కాన్వాయ్‌ను అడ్డగించారు. స్థానికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రాలను ముఖ్యమంత్రికి అందజేశారు. ఖమ్మం నగర అభివృద్ధిపై సమీక్షలతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. త్వరలోనే ఖమ్మం నగర పాలక సంస్థ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. సీఎం వెంట కె.కేశవరావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఉన్నారు. ఇప్పటికే టీడీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు టీఆర్ఎస్లో చేరనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. -
భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న పొంగులేటి
వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకుల నుంచి తీర్థప్రసాదాలు, ఆశీర్వచనాలు స్వీకరించారు. శుక్రవారం నుంచి జిల్లాలో పర్యటించనున్న పొంగులేటి.. భద్రాచలం నుంచి కారేపల్లికి వెళ్లనున్నారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను పరామర్శిస్తారు. విశ్వనాథపల్లి, బాద్‌మల్లయ్యగూడెం, కారేపల్లిలో ఎంపీ ల్యాడ్స్‌తో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఎంపీపీ ఇంట్లో జరిగే శుభకార్యానికి కూడా పొంగులేటి హాజరుకానున్నారు. సాయంత్రం దమ్మపేట మండలంలో నాగువల్లి, మొండివర్రి గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. దమ్మపేటలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు గ్యాస్ స్టౌలు పంపిణీ చేయనున్నారు. -
22 న కేసీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 22, 23 తేదీల్లో జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, పినపాక నియోజక వర్గాల్లో పలు అభివృద్థి కార్యక్రమాలకు కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు.