సాక్షి, ఖమ్మం: కాంగ్రెస్ పార్టీపై నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలు పగటి కలలు కంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఆయన సోమవారం ఖమ్మంలో పర్యటించారు. ఈ సందర్బంగా హరీష్ మాట్లాడుతూ జాతీయ పార్టీని నమ్ముకుంటే తెలంగాణ ప్రజలకు మిగిలేది సున్నా అని తెలిపారు.
మిషన్ కాకతీయ, 24 గంటల విద్యుత్ వంటి పనులు కాంగ్రెస్ హయాంలో ఎప్పుడైనా జరిగాయా అని ప్రశ్నించారు. మరుగుదొడ్డి కావాలన్నా కాంగ్రెస్ నేతలు ఢిల్లీ నుంచి అనుమతి తీసుకోవల్సిందేనన్నారు. ఖమ్మం జిల్లా ఎండిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీయేనని ఆరోపించారు. రెండేళ్లలో సీతారామ ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment